
లక్నో: గంగా నదిలో తేలియాడుతున్న మృతదేహాలతో కూడిన పాత ఫొటోను ట్వీట్ చేయడం ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నావ్‌లో 2014లో తీసిన ఆ ఫొటోను తాజాగా బల్లియా జిల్లాలో తీసినట్లుగా పేర్కొన్నారంటూ యూపీ కేడర్ మాజీ ఐఏఎస్ అధికారి సూర్యప్రతాప్ సింగ్‌పై ఉన్నావ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఉన్నావ్ వద్ద గంగానదిలో తేలియాడుతున్న 67 మృతదేహాలను గంగానది ఒడ్డున జేసీబీతో గుంత తవ్వి ఖననం చేశారని కూడా ఈనెల 13వ తేదీన తన ట్వీట్‌లో ఈ మాజీ అధికారి పేర్కొన్నారని పోలీసులు ఆరోపించారు. మంగళవారం బల్లియా జిల్లా పరిధిలో గంగా నదిలో కనిపించిన 52 మృతదేహాలను వెలికితీసి, అంత్య క్రియలు జరిపామని పోలీసులు వెల్లడించారు.
(చదవండి: వైరల్: బొమ్మతో చిరుతనే ఆటపట్టించిన చిన్నారి!)