formers facing problems
-
అయ్యో కాలం కలిసిరాలేదే !
కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షాలు కురవక సాగునీరు లేక పంటల పరిస్థితి అయోమయంలో పడింది. రబీ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో రైతులు దిగులుపడిపోతున్నారు. మబ్బులు కూడా రైతుల్ని ఉళకాడిస్తున్నాయే తప్ప కరుణించడం లేదు. ప్రతిరోజూ నల్లగా.. దట్టంగా కనిపిస్తాయి కానీ వాటినుంచి మాత్రం నీటి చుక్కలు రాలడం లేదు. వర్షాలు లేకపోవడంతో బోర్లు, బావులు అన్నీ ఎండిపోయి భూగర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. ఇక పంటలు ఎలా పండాలి?.. జీవితాలు ఎలా గడవాలి?.. అనుకుంటూ రైతులు రోజురోజుకీ డీలాపడిపోతున్నారు. దేవరకద్ర(మహబూబ్‌నగర్) : వర్షాలు లేక ఖరీఫ్ పంటల సాగు ముందుకు సాగక పోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. గతేడాది ఇదే సమయానికి జూరాలకు వరదలు వచ్చి ఎత్తిపోతల పథకం ద్వారా కొయిల్‌సాగర్‌కు నీరు చేరింది. దీంతో గొలుసు కట్టు చెరువు, కుంటలకు కాల్వల ర్వారా నీటిని వదలడంతో ఖరీఫ్ పంటల సాగు జోరుగా సాగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షాలు లేకపోవడంతో పాటు జూరాలకు వరద రావడంలేదు. కోయిల్‌సాగర్ ఆయకట్టు కింది రైతులు ఆందోళన చెందుతున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే.. జూరాలకు ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే ఎత్తిపోతలను రన్ చేసి కొయిల్‌సాగర్‌కు నీరందించాలనే ని బంధన ఉంది. వర్షాకాలం ఆరంభమై నెల గడి చింది. ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో లేకపోవడంతో ఎత్తిపోతలను రన్ చేయలేక పోయారు. గతేడాది జూన్‌లోనే జూరాలకు ఇన్‌ఫ్లో రావడంతో కోయిల్‌సాగర్‌కు నీటిని పంపింగ్ చేసి గరిష్టస్థాయి వరకు నింపారు. గతేడాది ఖరీఫ్, రబీ పంటలకు కొంత వరకు నీటిని వదిలిన తర్వాత ప్రస్తుతం కొయిల్‌సాగర్ ప్రాజెక్టులో 14 అడుగులమేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా పాత అలుగు స్థాయి వరకు 27 అడుగులుగా ఉంది. జూరాలకు ఇన్‌ఫ్లో ప్రారంభమైతేనే ఎత్తిపోతల రన్ చేసే అవకాశముంది. కర్నాటక, మహారాష్ట్రలలో భారీగా కురిసిన వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండిన తరువాతనే జూరాలకు నీరొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కర్నాటక ప్రాజెక్టులు నిండక పోవడంతో జూరాలకు ఇన్‌ఫ్లోపై వచ్చే ఆశలు ఇప్పట్లో కనిపించడం లేదు. లక్ష్యం చేరేదెప్పుడూ? కొయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద దేవరకద్ర, చిన్నచింతకుంట, ధన్వాడ, కొత్తగా ఏర్పడిన మరి కల్ మండలాల పరిధిలో 12 వేల ఎకరాల పా త ఆయకట్టు భూములు ఉండగా, ఎత్తి పోతల పథకం ద్వార ప్రాజెక్టును నింపి అదనంగా 38,250 ఎకరాలను సాగులోకి తేవాలనే లక్ష్యం ఉంది. పాత కొత్త ఆయకట్టు కలుపుకుని మొత్తం 50,250 ఎకరాల భూములకు సాగునీరు అందించాలి. మూడేళ్లుగా ఎత్తిపోతల ప థకం ద్వారా కొయిల్‌సాగర్‌కు నీటిని పంపింగ్ చేస్తున్న పూర్తి స్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. కేవలం పాత ఆయకట్టు కింద ఉన్న భూములకు మాత్రమే పూర్తి స్థాయిలో నీటిని వదిలారు. మీనుగోనిపల్లి వద్ద మునీరాబాద్లైన్పై పైపుల వేసిన తరువాత ఎడమ కాల్వకింద అదనపు ఆయకట్టుకు నీటిని వదిలి గొలుసు కట్టు చెరువులను నింపుతూ వచ్చారు. దీంతో 20వేల ఎకరాల వరకు ఆయకట్టు పెరిగింది. ఇక వాగుల ద్వారా నీటిని వదలడంతో భూగర్భ జలాలు వృద్ధిలోకి వచ్చి ఇటు తాగునీరు, అటు సాగునీటికి అవసరాలను కొంత వరకు తీరాయి. అయినప్పటికీ పూర్తి స్థాయి లక్ష్యం ఇంకా చేరుకోలేదు. కాల్వల ఆధునికీకరణ కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టును పెంచడానికి కాల్వల ఆధునీకీకరణ చేపట్టాం. ఎడమ కాల్వకు రూ.32కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం కాల్వ లైనింగ్ పనులు పూర్తి కావచ్చాయి. రాజోలి నుంచి పేరూర్ వరకు కొత్తగా తవ్వాల్సిన కాల్వ పనులు త్వరలో ప్రారంభమవుతాయి. కాల్వల పొడిగింపుతో అదనంగా 10వేల ఎకరాలకు సాగునీరందుతుంది. కుడి కాల్వ ఆధునీకీకరణ పనులకు ప్రతిపాదనలు చేశాం. కొత్త కాల్వలు, డిస్ట్రీబ్యూటరీ వ్యవస్థ పనులు పూర్తయితే సాగు లక్ష్యం నేరవేరుతుంది. జూరాలకు ఇన్‌ఫ్లో ప్రారంభమైతే ఎత్తిపోతల రన్ చేసి కొయిల్‌సాగర్‌కు నీరొచ్చే అవకాశముంది. – నాగిరెడ్డి, డీఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వానకోసం ఎదురు చూస్తున్నా.. పోయినేడు ఉన్న రెండకరాల్లో వరి పంట పండించుకున్నా. ఈ ఏడు వానల కోసం ఎదురు చూస్తున్నా. ఊరికి పక్కనే ఉన్న వాగులో నీళ్లోస్తే వరి నాట్లు వేసుకొంటా. పంటలు వేసుకునే అదును కాలం గడిచి పోతున్న ఆశతో ఉన్నాం. వానలు ఏ యేడు కా యేడు కానరాకుండా పోతున్నాయి. – సాయప్ప, రైతు, బస్వాపూర్ -
దిగుబడి మాటున దాగిన వేదన
గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని మధ్యప్రదేశ్ నమోదు చేసింది. ఇది ఓటర్లలో గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. కానీ ఆ రాష్ట్ర సీఎం చౌహాన్ తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి పక్కకు వెళ్లి అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? ఉత్పత్తి పెరిగినా రైతుకు గిట్టుబాటుధర లభించకపోతే హరిత విప్లవ కేంద్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు తప్పవు. అధిక దిగుబడి నేపథ్యంలో రైతుల జీవితాల్లో దయనీయమైన వేదనకు ఇదే మూల కారణం. గోడలపై రాతలు అనేది ప్రత్యేకించి ఎన్నికల ప్రచార సమయంలో భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా ఉనికిలోకి వచ్చే పదబంధం. మన నగరాలకేసి లేక వేగంగా పట్టణీకరణకు గురవుతున్న గ్రామీణప్రాంతం కేసి చూస్తే మీ కళ్లూ చెవులూ ఒక్కసారిగా విచ్చుకుంటాయి. ప్రతిచోటా గోడలపై రాసి ఉన్న విషయం లేదా దాని ప్రతిధ్వనులు దేశంలో మారుతున్నదేమిటి, మారనిదేమిటి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాయి. ఇక్కడ గోడలు అంటే పరిమిత స్థలం అని వాచ్యార్థం కాదు. గుజరాత్ హైవేల పొడవునా కనిపించే ఫ్యాక్టరీల వరుసను కూడా ఈ అర్థంలోనే చూడాల్సి ఉంటుంది. లేక కాంచీపురంలోని పాత పెరియార్ విగ్రహం మీద రాసిన అక్షరాలు కూడా కావచ్చు. లేదా, ప్రస్తుతం ఎన్నికల వాతావరణంలోని మధ్యప్రదేశ్‌లో ఆహారధాన్యాలు, సోయాబీన్ రాశులను, కళకళలాడుతున్న మండీలను మనం గమనించవచ్చు. పంజాబ్‌లో పంటకోతల కాలంలో మీరు చూసే లెక్కలేనన్ని ట్రాక్టర్ల ట్రాలీలను కూడా గమనించవచ్చు. ఇప్పుడు వ్యవసాయ గిడ్డంగుల గోడలు హైవేల పొడవునా కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ నిజంగానే హరిత విప్లవం సాధించిన రాష్ట్రం. గత పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అత్యధిక స్థాయి వ్యవసాయరంగ అభివృద్ధిని ఈ రాష్ట్రం నమోదు చేసింది. ప్రత్యేకించి గత అయిదేళ్లలో మధ్యప్రదేశ్ అసాధారణ స్థాయిలో 18 శాతం వ్యవసాయరంగ అభివృద్ధిని నమోదు చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేష్ రజోరా తెలిపారు. ఇక టీఎన్ నినాన్ తన ‘వీకెండ్ రుమినేషన్స్’ (వారాంతపు చింతన) కాలమ్‌లో రాసినట్లుగా, 2010 నుంచి 2015 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ వ్యవసాయ దిగుబడిలో 92 శాతం వృద్ధి నమోదైంది. చాలావరకు వ్యవసాయ ప్రధాన రాష్ట్రంగా ఉంటూ 77 శాతం గ్రామీణప్రాంతాలను కలిగి ఉన్న మధ్యప్రదేశ్ జనాభాలో ప్రతి పదిమందికీ ఏడుగురు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఇది ఓటర్ల సంఖ్య పరంగా గొప్ప సంతృప్తిని తీసుకురావాలి. గత 15 ఏళ్లుగా ఇంత అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో దఫా పాలనను ఆశిస్తూ ఎంతో స్థిమితంగా కూర్చోవాలి. కానీ కాస్త వేచి ఉండండి. 2018లో మధ్యప్రదేశ్ గోడలపై రాసి ఉన్న చిత్రణ ఇది కాదు. తన జీవితంలోనే అత్యంత కఠినతరమైన ఎన్నికలను చౌహాన్ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీపై 9 శాతం ఆధిక్యతతో గెలుపు సాధించారన్నది పట్టించుకోవద్దు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మేం పర్యటిస్తున్నప్పుడు మేం సమాధానం కోసం ప్రయత్నించిన ప్రశ్నలు ఇవే. వ్యవసాయరంగంలో సాధించిన అభివృద్ధి పక్కకు వెళ్లి వ్యవసాయ రంగ అశాంతి ఇంత తీవ్రంగా ఈ ఎన్నికల్లో ఎందుకు వ్యక్తమవుతోంది? ప్రస్తుతం మధ్యప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రంగా ఎలా రికార్డుకెక్కింది? మీరు కలుసుకుంటున్న అక్కడి రైతులు ఎందుకింత ఆగ్రహంతో ఉంటున్నారు? ఒక దశాబ్ది కాలం వ్యవసాయ రంగ వికాసం ఇప్పుడు పెద్ద శిక్షలాగా ఎందుకు మారిపోయింది? కళ్లూ, చెవులూ, మనసు పెట్టుకుని ఈ వ్యవసాయ ప్రధాన రాష్ట్రానికి వచ్చి చూడండి. భారతీయ వ్యవసాయంలో ఎక్కడ తప్పు జరుగుతోందో అది మీకు తెలియజేస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం సెహోర్‌కు వెళ్లండి. రాష్ట్ర రాజధాని భోపాల్‌కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం రాష్ట్రంలోనే అతిపెద్ద మండీలకు నెలవుగా ఉంటోంది. అయితే మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు.. రైతునా, వ్యాపారినా, మధ్యదళారినా లేక ప్రభుత్వాధికారినా అనే దానిమీదే సమాధానాలు ఆధారపడి ఉంటాయి. తన ట్రాక్టర్ ట్రాలీపై కూర్చొని ఉన్న రామేశ్వర్ చంద్రవంశీతో మేం మాట్లాడాం. సూర్యుడి ఎండలో ఈ రైతు ముఖం మాడిపోయినట్లు కనిపిస్తోంది. ‘గోధుమలకు గిట్టుబాటుధరలు తప్ప మాకేమీ అవసరం లేదు. వంద కేజీల గోధుమలకు రూ.3,000లు సోయాబీన్కి రూ. 4,000లు వచ్చేలా చేస్తే చాలు’ అని చెప్పాడా రైతు. ప్రస్తుతం మార్కెట్ ధరలకు ఇది 30 శాతం కంటే ఎక్కువే. పంటమీద వచ్చే నష్టాన్ని తానెందుకు భరించాలి? ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించనీయండి, లేదా ఎగుమతి చేయనివ్వండి అని తేల్చేశాడు. ‘అంతకంటే మేమిక ఏదీ కోరుకోం. ఫిర్యాదులూ చేయం’ అని చెబుతూ తాను 15 ఎకరాలున్న సంపన్న రైతునే కానీ దారిద్య్రానికి దిగువన ఉంటున్న బీపీఎల్ రైతును కాదు అని రెట్టించి మరీ గుర్తు చేశాడాయన. చౌహాన్ ప్రభుత్వం దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది. గోధుమ, వరి పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీలు)ను పెంచారు. దీనికి అదనంగా బోనస్ కూడా ప్రకటించారు. సోయాబీన్ వంటి కనీస మద్దతు ధర పరిధిలో లేని పంటలకు క్వింటాలుకు రూ.500లు రైతు ఖాతాలోకి బోనస్‌గా వెళ్లింది. తర్వాత తృణధాన్యాల వంతు. ప్రత్యేకించి పెసరపప్పు, ఉద్దిపప్పు. వీటి కనీస మద్దతు ధర వ్యాపారి చెల్లిస్తున్న ధర కంటే 60 నుంచి 90 శాతం ఎక్కువగా ఉంది. తృణధాన్యాల ధరలు పడిపోవడం వినియోగదారుడికి వరంగా మారితే రైతుకు పెను ముప్పుగా తయారవుతుంది. ఈ అంశంపై వ్యవసాయ ఆర్థికవేత్త, ఐసీఆర్ఆఇఆర్ సంస్కర్త అశోక్ గులాటిను ఈ విషయమై ప్రశ్నించండి చాలు. మార్కెట్ ధరకంటే కనీస మద్దతు ధర దాదాపు రెట్టింపు ధరను ప్రతిపాదిస్తున్నప్పటికీ రైతు ఖర్చులను అది చెల్లించలేకపోతోందని మీరు తెలుసుకుంటారు. కాబట్టి, రైతు ఎక్కువగా పండించే కొద్దీ ప్రభుత్వం ఎక్కువగా చెల్లిస్తుంటుంది. కానీ ఇద్దరూ కలిసి ఎక్కవ డబ్బును నష్టపోతుంటారు. మనం మూర్ఖంగా నష్టపోవడానికే చాలా కష్టపడి పని చేస్తున్నామా? గులాటి ఆయిన తోటి స్కాలర్లు రూపొందించిన ఐసీఆర్‌ఐఇఆర్ వర్కింగ్ పేపర్ 339 పేజీని చదవండి. మార్కెట్లతో సమన్వయం లేకపోయినట్లయితే, ఉత్పత్తిని మాత్రమే పెంచడం అనేది ప్రతీఘాతకంగా మారిపోతుందని ఈ నివేదిక మనకు తెలుపుతుంది. దీనికి మంచి ఉదాహరణ కాయధాన్యాలు. సంవత్సరాల తరబడి భారతీయ మొత్తం కాయధాన్యాల ఉత్పత్తి కనీసం 3–4 మిలియన్ టన్నుల కొరతను నమోదు చేస్తింది. ప్రపంచం తగినన్ని కాయధాన్యాలను పెంచడానికి సతమతమవుతోంది కానీ ధరలు మాత్రం పెరిగిపోతున్నాయి. రిటైల్ ధరలు వంద రూపాయలకు చేరుకోగానే మీడియాలో జనాగ్రహం కొట్టొచ్చినట్లు కనబడుతుంటుంది. అప్పుడు ప్రభుత్వం నిద్రమేలుకుని కనీస మద్దతు ధరను పెంచుతుంది. కాయధాన్యల ఉత్పత్తికి సాంకేతిక మిషన్‌ను నిర్మిస్తుంది, ఉత్పత్తిని పెంచుతుంది. దేశీయంగా కాయధాన్యాల డిమాండును 20 లక్షల టన్నుల మేరకు అధిగమించినట్లు ఐసీఆర్‌ఐఇఆర్ డేటా మనకు తెలుపుతుంది. కానీ పాత ఒడంబడికల వల్ల కాయధాన్యాల దిగుమతులు కొనసాగుతూనే ఉంటాయి. దీనిఫలితంగా భారత్‌కు ఏటా 22 లేక 23 మిలి యన్ టన్నుల కాయధాన్యాల ఉత్పత్తి సరిపోతుండగా, దేశంలో 30 మిలియన్ టన్నుల పంట చేరుతుంటుంది. అన్ని దిగుమతులూ జీరో పన్నుతో వస్తున్నందున వీటి ధరలు మన కనీస మద్దతు ధరలో సగమే ఉంటాయి. అంటే రైతు వ్యవసాయ ఖర్చులకు కూడా సమానం కావన్నమాట. కాయధాన్యాల వ్యవహారం మన కళ్లను తెరిపించకపోతే, మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి విషయంలో ఏం జరుగుతోందో పరి శీలించండి. గత సంవత్సరం మధ్యప్రదేశ్ పశ్చిమ ప్రాంత జిల్లా మాండసూర్లో రైతుల ఆగ్రహం జాతీయ పతాక శీర్షికల్లో చోటు చేసుకుంది. ఆగ్రహావేశాలతో మండుతున్న రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ఉల్లిపాయల ఉత్పత్తి కేంద్రంగా ఉంటున్న మాండసూర్లో వాటి ధర కిలోకు రూపాయికంటే తక్కువకు పడిపోయింది. రైతుల ఆత్మహత్యలకు జడిసిన చౌహాన్ ప్రభుత్వం నిల్వ ఉన్న ఉల్లిపాయలన్నింటినీ కిలోకు 8 రూపాయల లెక్కన కొంటానని ప్రకటించింది. ఈ వార్త ప్రచారం కాగానే మాండసార్లో పది కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్ ట్రాలీలు ఉల్లిపంటతో బారులు తీరాయి. సుదూరంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కూడా రైతులు తమ ఉల్లిపాయల పంటను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ ధర వద్ద కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఏంచేయాలో తోచలేదు. ప్రభుత్వానికి నిల్వ సౌకర్యాలు లేవు. వర్షాలు కుమ్మరించాయి. దీంతో భారీ నిల్వను వదిలించుకోవడానికి కిలో 2 రూపాయలకు అమ్ముతానని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఉన్మాదం కారణంగా మధ్యప్రదేశ్‌లో పన్ను చెల్లింపుదారులు రూ.785 కోట్లు నష్టపోయారు. ఇలా నష్టపోయే జాబితాలో ఈ ఏడు వంతు వెల్లుల్లికి దక్కింది. కిలో వెల్లుల్లి ఉత్పత్తికి రైతుకు రూ. 15–20లు ఖర్చు అవుతుండగా ధరలు మాత్రం కిలో రూ‘‘ 7కి పడిపోయాయి. మనది ఎంత విచిత్రమైన దేశం అంటే, మన రైతులు పండించిన వెల్లుల్లి ధరలు కుప్పగూలిపోతాయి. అదే సమయంలో చైనానుంచి భారీగా దిగుమతులు వస్తుం టాయి. ఎందుకంటే మన ప్రభుత్వ మెదడులో సగం వ్యవసాయం వైపు చూస్తుంటుంది. మిగతా సగం వినియోగదారు ధరలకేసి చూస్తుం టుంది. కానీ వీరు ఇద్దరూ ఎన్నడూ పరస్పరం చర్చించుకోరు. ఎన్నికల్లో మునిగితేలుతున్న మధ్యప్రదేశ్ నుంచి నేర్పవలసిన పాఠం ఏమిటి? రైతులు తమ ఉత్పత్తిని పెంచేలా ఏర్పాట్లు చేసినందుకు మన రాజకీయ నేతలకు అప్పనంగా ఓట్లు పడవు. కాస్త మంచిగా ఆలోచింది వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించకపోతే, దశాబ్ది కాలపు అమోఘమైన వ్యవసాయాభివృద్ధి సాధించినప్పటికీ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు సాధిస్తుందని చెప్పలేం. డబ్బు వెదజల్లడం పరిష్కారం కాదు. కనీస మధ్దతు ధర పెంపు అధిక ధరలకు గ్యారంటీ ఇవ్వదు. పైగా ఆహారధరలు పెరగాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. ఎందుకంటే అక్కడ వినియోగదారుడు ఉన్నాడు. పప్పు, ఉల్లిపాయ, టమేటో, బంగాళదుంపల ధరలు కాస్త పెరిగితే చాలు విమర్శలతో విరుచుకుపడే మీడియా ఉండనే ఉంది. అందుకే ఈ రోజు నిజమైన, చురుకైన రాజకీయనేత వ్యవసాయాన్ని మార్కెట్లతో అనుసంధానించడంపైనే దృష్టిపెడతాడు. దీనిపైనే వనరులను వెచ్చిస్తాడు. అవేమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ చైన్లు, ప్రైవేట్ రంగం ద్వారా స్టోరేజ్, ప్యూచర్ మార్కెట్లను తెరవడం. ప్రభుత్వ వ్యతిరేకత లేక భావజాలం కంటే మధ్యప్రదేశ్ గోడలపై ఇవ్వాళ స్పష్టంగా వ్యక్తమవుతున్న సందేశం ఇదే మరి. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
రైతు ‘మహా’ విజయం
సాక్షి, ముంబై: మండుటెండలో బొబ్బలెక్కిన పాదాలతో ఆరు రోజులపాటు 180 కిలో మీటర్లు నడిచి తమ సమస్యల పరిష్కారం కోసం ముంబైకి చేరుకున్న వేలాది మంది రైతుల ఆందోళనకు మహారాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. రైతుల డిమాండ్లలో దాదాపు అన్నింటినీ నెరవేరుస్తామని రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ఫడ్నవిస్ అసెంబ్లీ బయట మాట్లాడుతూ ‘రైతులు, ఆదివాసీల ప్రతినిధులతో సమావేశమయ్యాం. ఆదివాసీలు సాగుచేస్తున్న అటవీ భూములను వారికే బదిలీ చేయాలని నిర్ణయించాం. అయితే 2005కు ముందు నుంచి ఆ భూమిని తామే సాగు చేస్తున్నట్లు గిరిజనులు ఆధారాలు చూపించాలి. వారికి భూములను బదిలీ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. డిమాండ్లలోని దాదాపు అన్నింటినీ నిర్ణీత సమయంలోపు మేం నెరవేరుస్తాం’ అని చెప్పారు. సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సభ రైతుల పోరాటానికి నేతృత్వం వహించింది. తమ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో అలసి సొలసిన రైతన్నలు ఆందోళన విరమించి ఇక తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమవుతున్నారు. రైతులను ముంబై నుంచి ఇళ్లకు తిరిగి పంపేందుకు ప్రభుత్వం ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పించనుంది. ముంబై నుంచి నాసిక్ మీదుగా భుసావల్ వరకు రైతుల కోసం 2 రైళ్లను నడపటంతోపాటు ఆ మార్గంలో వెళ్లే రైళ్లకు అదనపు జనరల్ బోగీలను కూడా తగిలిస్తున్నట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు. అదనంగా రైతు రుణాలను మాఫీ చేయాలన్న డిమాండ్‌ను మాత్రం తాము నెరవేర్చలేమని సీఎం చెప్పారు. కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ రుణాలు తీసుకున్నప్పుడు వారిలో ఎవరి పేరున అప్పు తక్కువగా ఉంటే ఆ రుణం మాత్రమే మాఫీ అయిందనీ, దీన్ని సరిదిద్దడానికి ఇంకా ఎంత ఎక్కువ వ్యయం అవుతుందో అంచనా వేయడానికి ప్రభుత్వం మరో కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సోమవారం ముంబైలోని ఆజాద్ మైదానంలో సమావేశమైన రైతులు ఒకటే గమ్యం.. ఒకటే గమనం నడిచి నడిచి పాదాలకు పుండ్లు పడి రక్తాలు కారాయి. తినడానికి సరైన తిండి లేదు. నిద్రపోవడానికి అనువైన జాగా దొరికేది కాదు. మార్చిలోనే మాడుపగిలే ఎండలతో నిస్సత్తువ ఆవహించేది. అయినా మహారాష్ట్ర రైతన్నల అడుగు తడబడలేదు. నడక ఆగలేదు. వారి సంకల్ప బలం చెక్కు చెదరలేదు. అందరి కడుపులు నింపే అన్నదాతలు తమ ఆకలి తీరే మార్గం కోసం, బతుకుదెరువు కోసం చేసిన పాదయాత్ర యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. నాసిక్ నుంచి ముంబై వరకు మొత్తం 180 కిలో మీటర్లు సాగిన ఈ రైతు పాదయాత్రలో అడుగడుగునా ఎన్నో ఇబ్బందులు, మరెన్నో కష్టనష్టాలు.. మహిళా రైతులు కూడా అన్నింటినీ పంటి బిగువున భరించారు. అలుపూసొలుపూ లేకుండా దాదాపు 35 డిగ్రీల మండుటెండలో రోజుకి 30 కిలో మీటర్లు నడిచారు. మహారాష్ట్ర సర్కార్ దృష్టికి తమ సమస్యలు తీసుకువెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో తమకెదురైన ఇబ్బందులేమీ పట్టించుకోలేదు. ఒక్కో ఊరు దాటుతుంటే ప్రవాహంలా మరికొందరు రైతులు వారి అడుగుకి అడుగు కలిపారు. మరాఠ్వాడా, రాయగఢ్, విదర్భ ఇలా ఒక్కో ప్రాంతం నుంచి రైతులు కదం తొక్కారు. తొలి రోజు 30 వేల మందితో మొదలైన మార్చ్‌లో రోజు గడిచేకొద్దీ రైతుల సంఖ్య పెరిగి ముంబైకొచ్చేసరికి 50 వేలు దాటేసింది. కనీస సదుపాయాలు లేకున్నా.. డెబ్బయి ఏళ్ల వయసు దాటిన వారు, మహిళా రైతులు కూడా ఈ పాదయాత్రలో ఎక్కువగా కనిపించారు. ఆరురోజుల పాటు సాగిన నడకలో కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర్నుంచి ఎన్నో అవసరాలు ఉంటాయి. కనీస సదుపాయాలు లేకపోయినా వారు పట్టించుకోలేదు. కొందరు రైతులు బియ్యం, గోధుమలు, పప్పుదినుసుల మూటలను మోస్తూనే నడక సాగించారు. రోడ్డుపక్కనే వండుకొని తినడం, మళ్లీ నడవడం.. రాత్రయ్యేసరికి హైవేపక్కనో, ఏ మైదానాల్లోనో కాసేపు కునుకు తీయడం.. మళ్లీ లేచి నడక నడక.. అలా అదే పనిగా దుమ్ము, ధూళిలో 140 గంటల సేపు నడిచారు. మండిపోతున్న ఎండలో నడవడం వల్ల డయేరియా, లో బీపీ వంటి అనారోగ్య సమస్యలూ తలెత్తాయి. ‘మేము ఎదుర్కొంటున్న కష్టాలతో పోల్చి చూస్తే ఇదేమంత కష్టం కాదు. మా జీవితాలే ప్రమాదంలో ఉన్నాయి.పంట కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే ఎలా బతకాలి? అందుకే ఎంతటి బాధనైనా తట్టుకున్నాం’ అని 74 ఏళ్ల వయసున్న శంకర్ గావిట్ అనే రైతు చెప్పారు. రైతుల దుస్థితిని చూసి చాలా ఊళ్లల్లో స్థానికులే వారిని ఆదుకున్నారు. అంతటి కష్టంలోనూ రైతులు ముంబై విద్యార్థుల కష్టాన్ని గుర్తించారు. ఆదివారం సాయంత్రానికల్లా ముంబై శివార్లకు చేరుకున్న వారు.. తమ పాదయాత్రతో సోమవారం టెన్త్, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకూడదనే సదుద్దేశంతో ఆదివారం రాత్రి కూడా నడక సాగించి సూర్యుడు ఉదయించేలోపే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. డబ్బావాలాల ఆహారం.. స్థానికుల ఔదార్యం ఎన్నో బాధలను భరించి అన్ని కిలోమీటర్లు నడిచొచ్చిన రైతులకు ముంబై వాసులు ఘనంగా స్వాగతం పలికారు. దేశమంతటికీ అన్నం పెట్టే రైతన్నల ఆకలిదప్పులు తీర్చారు. స్వచ్ఛందంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి రైతుల అవసరాలను అడిగి మరీ నెరవేర్చారు. నగరంలో పాదయాత్ర సాగుతుండగా అర్ధరాత్రే అనేక మంది ప్రజలు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, డబ్బావాలాలు ట్రక్కులతో మంచినీళ్లు, తిండిపదార్థాలు తీసుకువచ్చి రైతులకు అందించారు. చెప్పులు లేని వారికి కొత్తవి ఇచ్చారు. పాదాల గాయాలకు వైద్య విద్యార్థులు చికిత్స చేశారు. రైతులకు అనూహ్యంగా అన్ని వైపుల నుంచి మద్దతు లభించడంతో మహారాష్ట్ర సర్కార్ దిగి రావల్సి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఆజాద్ మైదానానికి చేరుకుంటున్న రైతులు – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చేలు తడారి.. డెల్టా ఎడారి
పెనుగొండ: మిగుల జలాలతో నదుల అనుసంధానం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. అన్నపూర్ణ లాంటి ‘పశ్చిమ’ డెల్టాను ఎడారిగా మార్చేస్తోంది. గోదావరి నదికి సమీపంలోని గ్రామాల్లోనూ నీరందక వరిచేలు ఎండుతున్నాయి. దాళ్వాలో మాత్రమే సాగు నీటి కష్టాలు ఎదుర్కొనే రైతులు చంద్రబాబు సర్కారు పుణ్యమాని సార్వాలోనూ ఎద్దడిని చవిచూస్తున్నారు. నారుమడుల సీజన్లో నీరందక మడులు ఎండిపోగా.. రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్టర్ కె.భాస్కర్ హడావుడిగా నీటిపారుదల సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి మూడు రోజుల్లోనే సమస్యకు చెక్ పెడతామని ప్రకటించారు. అయినా పలు ప్రాంతాల్లో నేటివరకూ నీటి ఎద్దడికి పరిష్కారం లభించలేదు. పెనుగొండ మండలం కొఠాలపర్రు, తామరాడ, వడలి, రామన్నపాలెం గ్రామాల్లో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాట్లువేసి 15 రోజులు దాటుతున్నా చేలకు నీరందడం లేదు. వడలి–ఆచంట చానల్ పరిధిలో 700 ఎకరాలకు, ఐతంపూడి–చెరుకువాడ చానల్ శివారు ప్రాంతాల్లో 100 ఎకరాలకు నీరు అందడం లేదు. పంట కాలువల్లో మట్టాలు తక్కువగా ఉండటంతో చేలల్లోకి నీరు చేరడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నరసాపురం ప్రధాన కాలువ, కోడేరు బ్యాంక్ కెనాల్లో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. రెండు అడుగుల నీటిమట్టం పెంచాలని రైతులు కోరుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘కలెక్టర్ గారూ.. కనికరించరూ’ అని రైతులు వేడుకుంటున్నారు.