francescos pizzeria
-
అనుమతి ఎందుకు తీసుకోలేదు
ముంబై: దేశంలో మొట్టమొదటిసారిగా మానవరహిత ద్రోన్ను ఉపయోగించి పిజ్జాను డెలివరీ చేసిన ఫ్రాన్సెస్కోస్ పిజ్జేరియాపై పోలీసుల నిఘా పడింది. ద్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ ప్రయోగం చేసే ముందు తమకెందుకు సమాచారం అందించలేదని మంబై పోలీసులు పిజ్జా సెంటర్‌ను ప్రశ్నించారు. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పిజ్జా సెంటర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటీసీ)ని కూడా పోలీసుల ప్రశ్నించారు. అయితే పిజ్జా సెంటర్ ఏటీసీ నుంచి అనుమతి తీసుకన్నది, లేనిది తమకు తెలియదని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిబంధనల అనుసారం ఏదైనా ఆకాశంలో ఎగురవేయాల్సి ఉన్నప్పుడు అనుమతులు తప్పనిసరి అని, అలా చేయని ఆ పిజ్జా సెంటర్ వివరణ కోరతామని ఆయన తెలిపారు. అయితే ద్రోన్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగామని మధ్య ప్రాంత అడిషనల్ పోలీస్ కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు. అన్ని కోణాలను అధ్యయనం చేసిన తరువాత భవిష్యత్ చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే నగరానికి ఉగ్రవాద ముపునప పొంచి ఉన్నాయి. ఇలాంటి మానవరహిత ద్రోన్స్ ద్వారా ఇతర పద్ధతుల్లో ఉగ్రవాదులు దాడులు చేయొచ్చన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో ప్రత్యేక రోజులైన స్వాత్రంత్య, గణతంత్ర దినోత్సవాలను నగరాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. అయితే మన దేశంలో తొలిసారిగా ద్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ చేసే ప్రయోగాన్ని ఈ నెల 11న ముంబైకి చెందిన ఫ్రాన్సెస్కోస్ పిజ్జేరియా వారు విజయవంతంగా నిర్వహించారు. వీరు పంపిన ద్రోన్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంట్లో వినియోగదారుడికి పిజ్జాను అందించింది. ద్రోన్ విలువ 1.20 లక్షల రూపాయలు. -
పిజ్జా డ్రోన్లపై పోలీసుల కన్నెర్ర
వినియోగదారుల ఇళ్లకు పిజ్జాలు పంపడానికి డ్రోన్లు ఉపయోగించడంపై ముంబై పోలీసులు కన్నెర్ర చేశారు. ఇలాంటి ప్రయోగాలు చేసేముందు ముందుగా తమకు ఎందుకు తెలియజేయలేదని, అనుమతులు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి కూడా సదరు పిజ్జా హౌస్ వాళ్లు అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్కోస్ పిజ్జెరియా అనే ఔట్లెట్ వాళ్లు ఇలా డ్రోన్ సాయంతో పిజ్జాలను డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. (చదవండి: ముంబైలోనూ డ్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ) అయితే ఏ వస్తువునైనా గాల్లోకి ఎగరేయాలంటే అందుకు ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఏటీసీ వర్గాలు చెబుతున్నాయి. రిమోట్ కంట్రోల్ సాయంతో ఎగరేసే ఇలాంటి వస్తువుల వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉంటుందని, అందుకే ముందుగా అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. డ్రోన్ ప్రయోగానికి సంబంధించి తాము పూర్తి వివరాలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు. ఇప్పటికే ఒకసారి ముంబై నగరంపై ఉగ్రవాద దాడి జరిగినందున.. భవిష్యత్తులో ఉగ్రవాద సంస్థలు కూడా ఇలాంటి మానవరహిత వాహనాలను దాడులకు ఉపయోగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. -
ముంబైలోనూ ద్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ
ద్రోన్లు అంటే.. నిన్నటివరకూ బాంబులు కురిపించే మానవ రహిత యుద్ధవిమానాలు. నిఘాకు ఉపయోగపడే సాధనాలు. కానీ ఇప్పుడు.. పిజ్జాలను డెలివరీ చేసే వాహనాలు కూడా! ఇంతవరకూ వివిధ దేశాల బలగాలకే పరిమితమైన ద్రోన్లు ఇప్పుడు సాధారణ పౌరులకూ ఎన్నో పనులు చేసిపెట్టే పరికరాలుగా మారుతున్నాయి. ఇంతకుముందు డొమినోస్ పిజ్జావారు ద్రోన్ ద్వారా పిజ్జాను ప్రయోగాత్మకంగా డెలివరీ చేశారు. అమెజాన్ కంపెనీవారు పార్శిళ్ల రవాణానూ పరిశీలించారు. మనదేశంలో కూడా రాజకీయ పార్టీలు, పెళ్లిళ్లు, వేడుకల సందర్భంగా ఆకాశంలోంచి వీడియోలు తీసేందుకూ ద్రోన్లను వాడటం ఇటీవల ఊపందుకుంది. అయితే మన దేశంలో తొలిసారిగా ద్రోన్ ద్వారా పిజ్జాను డెలివరీ చేసే ప్రయోగాన్ని ఈ నెల 11న ముంబైకి చెందిన ‘ప్రాన్సెస్కోస్ పిజ్జేరియా’ వారు విజయవంతంగా నిర్వహించారు. వీరు పంపిన ద్రోన్ 1.5 కి.మీ. దూరంలోని ఓ భవనంలో ఉంటున్న వినియోగదారుడికి పిజ్జాను అందించింది. పిజ్జా బాయ్‌లకు బదులు ద్రోన్లను వాడటం వల్ల సమయం, ఖర్చు కలసివస్తాయని, మరో నాలుగేళ్లలో పిజ్జాల డెలివరీకి ద్రోన్ల వాడకం సాధారణ విషయం కావచ్చని పిజ్జేరియా యజమాని రజనీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మంచి ద్రోన్ రూ.1.20 లక్షలకు దొరుకుతుందని, కానీ ద్రోన్ల వినియోగంపై ఉన్న ఆంక్షలు తొలగితే వాటి వాడకం బాగా పెరుగుతుందన్నారు.