Free Ambulance
-
తండ్రి జ్ఞాపకార్థం తుక్కుగూడలో ఫ్రీ అంబులెన్స్ సేవలు
సాక్షి, రంగారెడ్డి: ముప్పిడి నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రజలకు లైఫ్ సపోర్ట్ కలిగిన ప్రత్యేక అంబులెన్స్‌ను అందించారు ట్రస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్. తుక్కుగూడ ప్రజలకు అత్యవసర సమయంలో ఉపయోగపడేందుకు ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి స్వర్గీయ ముప్పిడి నారాయణ గౌడ్.. తుక్కుగూడ బొడ్రాయి, మంకాలమ్మ దేవాలయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మార్కెట్ యార్డ్ సహా గ్రామ అభివృద్ధికి 35 ఏళ్లపాటు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ముప్పిడి నారాయణ గౌడ్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ ప్రజలకు ఎమర్జెన్సీలో ఉపయోగపడే విధంగా ఉచిత అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు శ్రీనివాస్ గౌడ్. 24 గంటల పాటు ఈ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఏ ఆపద వచ్చినా 7416718585 నెంబర్‌కి కాల్ చేసి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు హేమలత రాజు గౌడ్, రాజమోణి రాజు, పీఏసీఎస్ డైరెక్టర్ రఘురామరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కిరణ్మయి శ్రీధర్ గౌడ్, పూజారులు ప్రవీణ్ శర్మ, ప్రదీప్ శర్మ, ప్రభాకర్ గౌడ్, శంకరయ్య, వెంకటస్వామి గౌడ్, బాలరాజు గౌడ్, హరినాథ్, రమేష్ శ్రీధర్ మాజీ సర్పంచ్ నరసింహ ముదిరాజ్, మల్లేష్ గౌడ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Hyderabad: ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత -
Hyderabad: మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్: మరణించిన వారిని ఇల్లు/ఆస్పత్రి నుంచి శ్మశాన వాటికకు ఉచితంగా తరలించేందుకు అంతిమయాత్ర రథాలను (అంబులెన్స్) ప్రభుత్వం గ్రేటర్లో అందుబాటులోకి తెచ్చింది. వీటిని అవసరమైన వారు సంబంధిత ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు అంబులెన్స్‌ల కోసం సంప్రదించాల్సిన అధికారుల ఫోన్నెంబర్లను మునిసిపల్ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ జోన్ల వారీగా వెల్లడించారు. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సుల వారు భారీఎత్తున వసూళ్లకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులతో మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రభుత్వం ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. జోన్ల వారీగా అంబులెన్సుల కోసం సంప్రదించాల్సిన అధికారులు.. వారి ఫోన్ నెంబర్లు ఇలా.. 1. ఎల్బీనగర్ జోన్: కుమార్, సూపరింటెండెంట్(9100091941) ఎన్ వెంకటేశ్, డీటీసీఓ(9701365515) 2. చార్మినార్ జోన్: డి.డి నాయక్, జాయింట్ కమిషనర్(9440585704) ఎస్.బాల్‌రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(9849907742). 3. ఖైరతాబాద్ జోన్: రాకేశ్,ఏఈ(7995009080) 4. కూకట్పల్లి జోన్: చంద్రశేఖర్‌రెడ్డి, ఏఎంఓహెచ్(7993360308) శ్రీరాములు, డీసీటీఓ(9515050849) 5. శేరిలింగంపల్లి జోన్: జేసీ మల్లారెడ్డి(6309529286) ఎం.రమేశ్‌కుమార్(9989930253) డీవీడీ కంట్రోల్‌రూమ్(9154795942) 6. సికింద్రాబాద్ జోన్: డా.రవీందర్‌గౌడ్, ఏఎంఓహెచ్(7993360302) శంకర్, డీటీసీఓ(9100091948) చదవండి: కిలాడీ భార్య నిర్వాకం.. ప్రియుడి కోసం ఏకంగా.. -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇక అంబులెన్స్ సేవలు ఫ్రీ..
సాక్షి, గచ్చిబౌలి: సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబరాబాద్ పోలీసులు, ఐటీ కంపెనీల సంయుక్తాధ్వర్యంలో శనివారం 12 ఉచిత అంబులెన్స్‌లను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో అంబులెన్స్ ఆపరేటర్లు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణులు, చిన్నారులు, గుండె జబ్బులు ఉన్నవారు, డయాలసిస్ పేషెంట్ల కోసం అందుబాటులో అంబులెన్స్‌లు ఉంటాయన్నారు. సైబరాబాద్‌తో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషరేట్లలో ఉచితంగా సేవలందిస్తాయని తెలిపారు. రహేజా మైండ్ స్పేస్, దివ్యశ్రీ ఓరియన్, ఫినిక్స్, వేవ్‌రాక్, గార్గ్ కార్పొరేషన్, అసెండాస్, టీసీఎస్, గుగూల్, డీఎల్ఎఫ్ సహకారంతో అంబులెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కోవిడ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌తో పాటు అంబులెన్స్‌ల కోసం 94906 17440, 94906 17431లను సంప్రదించాలన్నారు. 24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
అమ్మ ఒడికి
అక్కున చేర్చుకున్న అమ్మఒడి ఆశ్రమం చేయూతనిచ్చిన సబ్ కలెక్టర్ మదనపల్లెరూరల్ : అమ్మకు ఆపన్నహస్తం అందిం ది. తాము ఆశ్రమం కల్పిస్తామని చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ ముందుకొచ్చింది. మదనపల్లె సబ్‌కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున సహకారం అందించారు. ‘అమ్మ అనాథయ్యింది’అనే శీర్షికన శుక్రవారం ‘సాక్షి’ దినపత్రిలో ప్రచురితమైన సంగతి పాఠకులకు విదితమే. దీనిపై చిత్తూరుకు చెందిన అమ్మ ఒడి సంస్థ నిర్వాహకులు నలగాంపల్లె చెరకూరి పద్మనాభనాయుడు, కార్యదర్శి చంద్రశేఖర్, వార్డెన్లు శ్రీమతి, అముజ, ఉచిత అంబులెన్స్ సేవలందించే డ్రైవర్ రమేష్‌లు మదనపల్లె ప్రభుత్వాస్పత్రి క్రానిక్‌వార్డులో ఉన్న లక్ష్మీదేవమ్మకు వద్దకు చేరుకున్నారు. సబ్‌కలెక్టర్ మల్లికార్జున ,ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆంజనేయులు, నర్సింగ్ సిబ్బంది సహకారంతో ఆమెను అంబులెన్స్‌లో అమ్మ ఒడి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను బిడ్డలు వీధులు పాలు చేస్తే క్రిమినల్ కేసులతో పాటు రూ.10వేలు వసూలు చేసి వారి పోషణకు నెలనెలా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.