funerals with police honour
-
ముగిసిన వాణీజయరాం అంత్యక్రియలు.. నివాళులర్పించిన సీఎం
అధికారిక లాంఛనాలతో ప్రముఖ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు ముగిశాయి. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. చెన్నైలోని బేసంట్నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. వాణీజయరాం మృతిపై సీఎం సంతాపం తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. ' ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందా. వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ కూడా ప్రకటించింది. ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని అన్నారు. కాగా.. శనివారం చెన్నైలోని ఆమె నివాసంలో మరణించారు. దేశవ్యాప్తంగా దాదాపు 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలు ఆలపించారు. అయితే ఆమె మృతిపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆమె ముఖంపై గాయాలు ఉండడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీ భర్త జయరామ్ ఐదేళ్ళ క్రితం (2018లో) మరణించారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. సంగీతమే తమకు పిల్లలు లేని లోటు తీర్చిందని ఆమె చెబుతూ ఉండేవారు. బంధువులే వారసులై ఈ రోజు వాణీ జయరామ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
కన్నీటి వీడ్కోలు..
ఆమదాలవలస రూరల్ : మండలంలోని కలివరం పంచాయతీ ఫీర్‌సాహెబ్‌పేట గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చింతాడ రాజశేఖర్(30) చిత్తూరులో అనుమానాస్పందగా మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ స్వగ్రామం ఫీర్‌సాహెబ్‌పేట కావడంతో ఇక్కడ నాగావళి నదీతీరంలో ఆయన మృతదేహానికి అధికార లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆమదాలవలస సీఐ ఆదాం, ఎస్ఐ వాసుదేవరావు, ఏఎస్ఐ మెట్ట సుధాకర్, చిత్తూరు జిల్లా ఏఆర్ ఎస్ఐ విశ్వనాథం, ఎచ్చెర్ల ఏఆర్ ఏఎస్ఐ సింహాచలంలు రాజశేఖర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. మిన్నంటిన కుటుంబసభ్యుల రోదన స్వగ్రామానికి రాజశేఖర్ మృతదేహం చేరుకోగానే రోదనలు మిన్నంటాయి. రెండు రోజులుగా మృతదేహం కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు దుఖాఃన్ని దిగమింగుకుని పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకు కష్టాలు తీర్చుతాడని అనుకుంటే ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు సుబ్బయ్య, రత్నాలు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలోనూ అందరితో మంచిగా ఉంటూ సహాయాలు చేసే మంచి గుణం ఉన్న మిత్రుడిని కోల్పోయామని తోటి స్నేహితులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజశేఖర్ మరణంతో గ్రామమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ కన్నీటితో రాజశేఖర్‌కు నివాళులు అర్పించారు. జూన్ నెలలో సెలవుపై వస్తానని చెప్పి ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బంధువులు రోదించారు. ముందుగా రాజశేఖర్‌కు గ్రామస్తుల ఆచారం ప్రకారం అశ్రునివాళుల మధ్య అంత్యక్రియల తంతు ముగించిన అనంతరం పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగించారు. విధుల్లో మృతిచెందడం బాధాకరం పోలీసు విధులు నిర్వహిస్తూ మృతిచెందడం చాలా బాధాకరమని వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. రాజశేఖర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజశేఖర్ మృతికి గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంచిగా నడుచుకునే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. -
కెర్సీకి పోలీసు లాంఛనాలతో..
శునకం అంటే విశ్వాసానికి మారుపేరు. అందులోనూ శిక్షణ పొందిన పోలీసు శునకాలైతే నేరగాళ్ల పాలిట సింహస్వప్నంగా ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా వెంటనే అక్కడకు వెళ్లి వాసన పసిగట్టి పోలీసులకు నేర పరిశోధనలో మంచి క్లూలు అందిస్తాయి. బాంబులను గుర్తించడం, డ్రగ్స్ అక్రమరవాణా గుట్టును రట్టు చేయడం కూడా వాటికి బాగా తెలిసిన విద్య. ఇలా పలు రంగాల్లో గత 12 ఏళ్లుగా పశ్చిమగోదావరి జిల్లా పోలీసులకు సేవలు అందించిన 'కెర్సీ' గురువారం ప్రాణాలు వదిలింది. ఇంతకాలం తమకు చేదోడు వాదోడుగా ఉండటమే కాక.. ఏలూరులోని పోలీసులకు ఎంతో చేరువైన కెర్సీ మరణించడంతో.. దానికి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.