Funniest
-
World Funniest Joke: మామూలు జోక్ కాదు.. ఇది జోకులకే జోక్!
ఏదైనా జోక్ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్‌లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్న డౌట్ వస్తుంది కదా.. రిచర్డ్ వైస్మాన్ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు. ‘మీకు ఇష్టమైన జోకులను పెట్టండి. నచ్చిన వాటికి ఓటేయండి’అంటూ ఓ వెబ్సైట్లో ప్రకటన పెట్టాడు. ఇలా మొత్తంగా 40 వేల జోకులు పోగయ్యాయి. సుమారు 20 లక్షల మంది తమకు నచ్చిన జోక్‌కు రేటింగ్ ఇచ్చారు. అందులో ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన గుర్పాల్ గోస్సాల్ అనే సైకియాట్రిస్ట్ పెట్టిన జోక్ అత్యంత హాస్యభరితమైన జోక్‌గా నిలిచింది. మరి ఆ జోక్ ఏంటో చూద్దామా.. చదవండి👉🏼క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..! ఓ రోజు ఇద్దరు వేటగాళ్లు అడవికి వెళ్లారు. అందులో ఒకడు సడన్‌గా స్పృహ తప్పి పడిపోయాడు. కళ్లు తేలేసేశాడు.. ఊపిరి కూడా తీసుకుంటున్నట్లు కనపడలేదు. దీంతో చనిపోయేడామో అని రెండోవాడికి డౌట్ వచ్చింది.. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశాడు. ‘నా స్నేహితుడు చనిపోయాడు. నేనిప్పుడు ఏం చేయాలి’అని టెన్షన్ పడుతూ అడిగాడు. అటు వైపు ఆపరేటర్.. ‘నేను మీకు సాయం చేస్తాను. మీరు కూల్ అవ్వండి. ముందు మీ స్నేహితుడు నిజంగానే చనిపోయాడా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకోండి’అని చెప్పాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం.. ఇంతలో తుపాకీ పేలిన శబ్దం.. ‘చనిపోయాడు.. కన్ఫర్మ్.. ఇప్పుడు నేనేం చేయాలి’అని ఆ వేటగాడు రొప్పుతూ మళ్లీ అడిగాడు.. సైంటిఫిక్‌గానూ ఇదే బెస్ట్ జోక్! మంచి జోక్‌లకు సంబంధించి.. ఆశ్చర్యం కలిగించడం, ఒత్తిడిని దూరం చేయడం వంటి కొన్ని ప్రమాణాలు ఉంటాయని, అవన్నీ ఈ జోక్‌లో ఉన్నాయని సైకాలజిస్టు రిచర్డ్ వైస్మాన్ చెప్పారు. 103 పదాలు ఉండే జోక్‌లు ఎక్కువగా నచ్చుతాయని.. ఈ జోక్‌లో 102 పదాలు (ఇంగ్లిష్‌లో) ఉన్నా యని వివరించారు. మరో చిత్రమేమిటంటే.. ఏటా అక్టోబర్ 7న, అదీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జోకులు ఎక్కువగా నవ్విస్తాయని తమ సర్వేలో తేలినట్టు పరిశోధకులు చెప్తున్నారు. చదవండి👉🏼కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స... చిగురిస్తున్న కొత్త ఆశ -
నవ్వు తెప్పించే బైక్ దొంగతనం
-
హాస్యప్రియులే !
మిథునం: ఆస్ట్రోఫన్డా రాశులలో మిథునం మూడోది. ఇది బేసి రాశి, క్రూర స్వభావం, వైశ్యజాతి, రంగు ఆకుపచ్చ, ఛాతీని సూచిస్తుంది. ద్విస్వభావ రాశి, పురుష రాశి, దీని దిశ పశ్చిమం. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలూ, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. అమెరికా, ఉత్తరాఫ్రికా, బెల్జియం, వేల్స్ ప్రాంతాలను సూచిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వారు సున్నిత మనస్కులు, చురుకైన తెలివితేటలు, హాస్యప్రియులు, కించిత్ చాపల్యం గలవారు. కళాభిరుచి, వాక్చాతుర్యంతో ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారు. వీరి ఆలోచనలకు, ఆచరణకు వ్యత్యాసం ఉంటుంది. ఒక పనిని మధ్యలోనే విడిచిపెట్టి మరో పనిని మొదలుబెడతారు. పలు విద్యలు, కళలలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు సాధారణంగా సహనవంతులు. గొడవలకు దూరంగా ఉంటారు. క్లిష్టమైన వివాదాలను చాకచక్యంగా పరిష్కరించి, అందరి మెప్పు పొందగలరు. అపారమైన ఊహాశక్తి, సృజనాత్మకత, వాదనా పటిమ వీరి సొంతం. తరచు మార్పును కోరుకుంటారు. గ్రహగతులు అనుకూలంగా లేకుంటే, వీరు తమ తెలివి తేటలను వికృత ప్రయోజనాల కోసం వాడుకుంటారు. మితిమీరిన స్వార్థంతో మోసాలకు, ద్రోహాలకు, కుంభకోణాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడరు. తరచు మాట మార్చే లక్షణం వల్ల నిందలకు గురవుతారు. స్థిరత్వం లేని చేష్టల వల్ల ఆత్మీయులు సైతం వీరి పట్ల సహనాన్ని కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. (వచ్చేవారం కర్కాటక రాశి గురించి...)