gaddam venkata swamy
-
TS: మంత్రి పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి వర్గంలో మన ఎమ్మెల్యేల్లో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ వీడడం లేదు. రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి కేబినెట్లో బెర్త్ దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అన్నదమ్ముల్లోనే పోటీ మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 2004నుంచి 2009 మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని, తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు. ఇందుకోసం రెండునెలల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డిని తరచూ కలుస్తున్నారు. గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ పదవిపై పోటీ పడుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వంశీ ఎంపీ టికెట్‌తో లింకు? లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒకరికి ఎంపీ టికెట్, మళ్లీ అదే కుటుంబం నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక వంశీకి లోక్‌సభ టికెట్ కావాలని అడుగుతున్న క్ర మంలో టికెట్ ఇస్తే, మంత్రి పదవి వదులుకుంటా రా? లేక టికెట్‌తో పాటు కేబినెట్లో చోటు కోసం పట్టుబడుతారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలయ్యే దాకా ఈ సమస్య తేల్చ కుడా, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసే అవకాశం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలో పాలన పరంగా ఇబ్బంది లేకుండా, స్థా నికంగా మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానంలో మంత్రి సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమెతోనే పాలన కొనసాగిస్తారా? లేక ఇక్క డి ఎమ్మెల్యేల్లో ఎవరికై నా అవకాశం కల్పిస్తారా?.. అనే విషయం తేలేవరకూ వేచిచూడాల్సిందే. ‘పీఎస్సార్’కు పెద్దల హామీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశార నే మంచి పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఉంది. కష్టకాలంలో పార్టీలో కేడర్‌ను కాపాడినట్లు చెప్పుకొంటారు. ఆ సమయంలో గడ్డం సోదరులు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. రెండేళ్ల క్రితం బీఎస్పీ నుంచి వినోద్, ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ కాంగ్రెస్‌లో చేర డం తెలిసిందే. వీళ్లిద్దరి కంటే పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కష్టపడ్డారని, పీఎస్సార్‌కే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగ సభ సక్సెస్ చేసి పార్టీలో ఉత్తేజం నింపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను సక్సెస్ చేశారు. మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికపైనే పీఎస్సార్ వచ్చే ప్రభుత్వంలో మంచిహోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
‘పెద్దపల్లి మార్కు’ తీర్పు
సాక్షి, పెద్దపల్లి : లోక్‌సభ నియోజకవర్గంలో సింగరేణి కార్మిక వర్గం ప్రభావం ఎక్కువ. సింగరేణి కార్మికుల్లో రాజకీయ చైతన్యమూ ఎక్కువే. కొత్త పార్టీలను ఆహ్వానిస్తూ పాత పార్టీలకు వీడ్కోలు పలుకుతూ తమ మార్కు తీర్పును తెలియచేస్తుంటారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో పనిచేసిన పీడీఎఫ్, తెలంగాణ తొలిదశ పోరాటంలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసమితి, టీడీపీ, తెలంగాణ మలిదశ పోరాటంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీలను పెద్దపల్లి గద్దె మీద ఆసీనులను చేశారు కార్మికులు. రాష్ట్రవ్యాప్తంగా నడిచే పొలిటికల్ ట్రెండ్లు, వేవ్‌లకు భిన్నంగా ఇక్కడ తీర్పులు వెలువడుతుంటాయి. ఎప్పుడు ఎలాంటి తీర్పునిచ్చారో ఓసారి చూస్తే.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం 1952 నుండి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ విలక్షణ తీర్పునే ఇచ్చింది. 1952, 1957లో కరీంనగర్ ద్విసభ్య లోక్‌సభగా ఉన్న సమయంలో పీడీఎఫ్ (పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులను గెలిపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు. ఆ రెండుసార్లు పీడీఎఫ్ అభ్యర్థి ఎంఆర్. కృష్ణ విజయం సాధించారు. హైదరాబాద్ బొల్లారానికి చెందిన కృష్ణ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, జైలు జీవితం అనుభవించారు. తెలంగాణ విముక్తి అనంతరం పీడీఎఫ్ అభ్యర్థిగా ద్విసభ్య లోక్‌సభలో రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణ పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్స్థానం నుంచి రెండుసార్లు వరుసగా (1962, 1967) విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం మలిదశ పోరాటం ఊపందుకున్న వేళ 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా నాగర్‌కర్నూల్‌కు చెందిన తులసీరామ్ పోటీ చేశారు. ఉద్యమ ఊపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ఎంఆర్.కృష్ణను తెలంగాణవాదులు గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకొని టీపీఎస్ అభ్యర్థి తులసీరామ్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఓటర్లు గొట్టె భూపతి (టీడీపీ)ని గెలిపించారు. 1998, 1999లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణకుమారిని గెలిపించి, అప్పటి సిట్టింగ్ ఎంపీ వెంకటస్వామిని ఓడించారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయం అది. మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా ఆమెకు కలిసొచ్చింది. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్.. కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి తనయుడు వివేక్ చేతిలో 47 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా, 2014 ఎన్నికల్లో 2 లక్షల 91వేల భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌కు పదవి కట్టబెట్టారు పెద్దపల్లి ఓటర్లు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారిని గుర్తిస్తూ తీర్పునిచ్చారు. హ్యాట్రిక్ ప్లస్.. కృష్ణ పెద్దపల్లి లోక్‌సభ విజేతలు వరుస విజయాలను మూటగట్టుకున్నారు. ఎంఆర్. కృష్ణ.. కరీంనగర్, పెద్దపల్లి ద్విసభ్య లోక్‌సభగా ఉన్న సమయంలో పీడీఎఫ్ పార్టీ నుంచి 1952, 1957లలో గెలిచారు. కరీంనగర్ (ద్విసభ్య) నుంచి పెద్దపల్లి విడిపోయి పార్లమెంట్ నియోజకవర్గంగా ఏర్పడింది. ఆయన పెద్దపల్లి నుంచి 1962, 1967లలో మరో రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్ ప్లస్‌వన్ రికార్డును సొంతం చేసుకున్నారు. డబుల్ హ్యాట్రిక్.. స్వామి 1989 నుంచి పెద్దపల్లి పార్లమెంట్ బరిలో తలపడిన వెంకటస్వామి 1989, 1991, 1996లో మూడు వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. మధ్యలో విజయాలకు దూరమైన వెంకటస్వామి 2004లో సుగుణకుమారిపై గెలిచారు. అయితే వెంకటస్వామి అంతకు ముందే సిద్దిపేట నుంచి మూడుసార్లు గెలిచిన హ్యాట్రిక్ ఎంపీగా రికార్డు సాధించి ఉన్నారు. సిద్దిపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పునర్విభజనలో మెదక్‌గా ఏర్పడడంతో వెంకటస్వామి పెద్దపల్లికి వచ్చారు. కార్మిక నాయకుడికి పట్టం పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బెల్లంపల్లి సింగరేణి కార్మికుడు కోదాటి రాజమల్లు 1980లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. కార్మికుల పక్షాన ఏఐటీయూసీలో కీలకపాత్ర పోషించిన కోదాటి రాజమల్లుది హైదరాబాద్. కానీ ఆయన చెన్నూరులో స్థిరపడ్డారు. చెన్నూరు అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారాయన. కార్మికులు రాజమల్లును కార్మికవర్గ నాయకునిగా, తమ ప్రతినిధిగా గుర్తించడంతో, వాళ్లే ఆయన వెన్నంటి ఉండి పార్లమెంట్‌కు పంపించారు. – నరేంద్రచారి, పెద్దపల్లి -
రణమా... శరణమా!
సాక్షి, ఆదిలాబాద్: సుదీర్ఘకాలం పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడిగా వ్యవహరించిన దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) వారసత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వ్యాపార రంగంలో ఉంటూ వెంకటస్వామి వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి వచ్చీ రాగానే ఎంపీ అయిన గడ్డం వివేకానంద్ కేవలం ఐదేళ్లు మాత్రమే ఎంపీగా కొనసాగారు. రాజకీయంగా నిలకడ లేని నిర్ణయాలతో ఇబ్బందిపడిన వివేకానంద టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన షాక్‌తో అయోమయానికి గురయ్యారు. కేసీఆర్ గురువారం ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో వివేక్‌కు చోటు దక్కలేదు. ఈ జాబితాలో గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున చెన్నూరు నుంచి పోటీకి దిగి టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన బోర్లకుంట వెంకటేశ్ నేతను అదృష్టం వరించింది. దీంతో వివేకానంద్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాకా వారసుడిగా వచ్చిన వివేక్ పదేళ్లలోనే ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి రాజకీయంగా పతనం అంచులకు చేరడాన్ని వెంకటస్వామి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో చర్చించిన వివేక్ శనివారం ఉదయం 11 గంటలకు ఎన్టీపీసీలోని తన నివాసంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివేక్ వర్గీయులు, కాకా అభిమానులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో వచ్చే సూచనలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సుమన్ నేతృత్వంలో ఎమ్మెల్యేల ప్రణాళిక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్లోనే పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల పరిధిలో ముసలం పుట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ సిట్టింగ్‌లను ఓడించేందుకు వివేక్ కాంగ్రెస్ అభ్యర్థులతో కుమ్మక్కయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో ఉభయ తారకంగా కాంగ్రెస్ నేతలతోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించారని కేసీఆర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక వివేక్ అండతోనే ఆయన సోదరుడు వినోద్ ఏకంగా బీఎస్పీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య ఓటమికి ప్రయత్నించారని ప్రభుత్వ నిఘావర్గాలు సమాచారాన్ని చేరవేశాయి. ఈ నేపథ్యంలో గత జనవరి నుంచే వివేక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ముందు పెట్టి చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పావులు కదిపారు. వీరికి మిగతా ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో కేసీఆర్ పెద్దపల్లి సీటు పోటీ నుంచి వివేక్‌ను తప్పించారు. అయితే తనపై ఓడిపోయిన వెంకటేష్‌ను టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంలో కూడా బాల్క సుమన్ పాత్రే కీలకం. సామాజిక సమీకరణాల పేరుతో నేతకాని వర్గానికి చెందిన దుర్గం చిన్నయ్య ద్వారా మంత్రాంగం నడిపించారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉండి వివేక్ స్థానంలో వెంకటేశ్‌కు సీటు ఇవ్వాలని కోరడంతో వారి మాటకు విలువిచ్చిన కేసీఆర్ వెంకటేశ్‌ను పెద్దపల్లి అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, మంచిర్యాల గ్రంథాలయసంస్థ చైర్మన్, వెంకటేశ్ నేత ఎన్నికల ఏజెంట్ రేణికుంట్ల ప్రవీణ్ కలెక్టరేట్‌కు వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 25న వేలాది మందితో ర్యాలీగా వచ్చే వెంకటేష్ మరో సెట్ నామినేషన్ వేయనున్నట్లు సుమన్ ‘సాక్షి’కి తెలిపారు. తక్షణ కర్తవ్యం? పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతోనే రెండుసార్లు టీఆర్ఎస్లోకి వచ్చిన తనకు అన్యాయం జరిగిందని వివేక్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. చెన్నూరులో బాల్క సుమన్‌ను ఓడించడానికి వెంకటేశ్ నేతకు తాను సహకరించానని ప్రచారం చేస్తున్న సుమన్.. అదే వెంకటేశ్‌కు ఇప్పుడు టికెట్ ఎలా ఇప్పిస్తారని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లిలో తనను రాజకీయంగా బలిపశువును చేయాలనే ఈ కుట్రకు తెరలేపారని ఆయన సన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా ఎలాంటి అడుగు వేయాలనే దానిపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. 2013లో తండ్రి వెంకటస్వామి చెప్పినా వినకుండా టీఆర్ఎస్లో చేరడం, 2014 ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు ఇచ్చినా చెన్నూరు సీటును సోదరుడు వినోద్‌కుమార్‌కు ఇవ్వని కారణంగా పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత 2017లో మరోసారి టీఆర్ఎస్లోకి రావడం ప్రతిష్టకు భంగం కలిగించాయని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరుడు వినోద్ బీఎస్పీ తరఫున పోటీ చేయడం తన రాజకీయ భవిష్యత్‌కు గొడ్డలిపెట్టుగా మారిందని కూడా ఆయన కొందరు నాయకుల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం. ఈ పరిస్థితుల్లో మరోసారి పార్టీ మారి వేరే గుర్తు మీద పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే అంశంపై ఆయన దృష్టి సారించారు. ఈ మేరకు శనివారం జరగనున్న సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఎదురుచూపుల్లో బీజేపీ టీఆర్ఎస్లో పెద్దపల్లి టికెట్‌పై ఊహాగానాలు వస్తున్న సమయంలో బీజేపీ అప్రమత్తమైంది. పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే వివేక్‌తో మాట్లాడగా.. ఆయన పార్టీ మారే విషయమై స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. గతంలో కాంగ్రెస్ నుంచి రెండుసార్లు టీఆర్ఎస్లోకి రావడం, వినోద్ 2018లోనే మరో సారి పార్టీ మారి నగుబాటుకు గురైన నేపథ్యంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసిం ది. కాగా హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ వివేక్‌ను ఢిల్లీకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను పరిశీలిస్తే వివేక్ బీజేపీ నుంచి పోటీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొనడం గమనార్హం. కాగా వివేక్ బీజేపీ తరఫున పోటీకి నిరాకరిస్తే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా మాల సామాజిక వర్గానికే చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కుమార్, దళితమోర్చా రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చు. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్ దక్కక పోవడంతో వివేక్ రాష్ట్రప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తాననే హామీతోనే టీఆర్ఎస్లోకి ఆహ్వానించా రు. తెలంగాణ సాధన క్రమంలో నా చురుౖకైన భాగస్వామ్యానికి మెచ్చి పార్టీలోకి తీసుకున్నారు. కానీ నాకు ఇచ్చిన హామీ మేరకు టికెట్ ఇవ్వలేదు. నేను ఆ హోదాలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం పొందలేదు. నా రాజీనామాను ఆమోదించగలరు’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. -
‘రంగు’ మారుతోంది..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాజకీయ వలసలు నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాలుగున్నరేళ్లు అప్రతిహతంగా కొనసాగిన గులాబీ హవాకు సొంత పార్టీలోని కొందరు నాయకులే గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేస్తూ మరికొందరు నాయకులు టీఆర్ఎస్కు దూరమవుతున్నారు. టీఆర్ఎస్కు చెందిన రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లలో కొందరు ఇప్పటికే పార్టీకి దూరం కాగా, మరికొందరు లోపాయికారిగా సహాయ నిరాకరణ కార్యక్రమంలో మునిగిపోయారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే ఎక్కువ మంది నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నాలుగున్నరేళ్లు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను శాసించిన నేతలు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఎదురైంది. ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు వినోద్ మాజీ మంత్రి గడ్డం వినోద్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు వినోద్ మంగళవారం ఢిల్లీకి వెళ్లినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దసరా లోపు కాంగ్రెస్ పార్టీలో చేరి, ఈనెల 20వ తేదీన భైంసాలో జరిగే రాహుల్ సభ నుంచి క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. టీఆర్ఎస్ అగ్రస్థాయి నేతలు కూడా వినోద్ విషయంలో మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు అగ్రనేతలు వినోద్ సోదరుల విషయంలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల సీనియర్ నేత వి.హనుమంతరావు వినోద్‌ను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని, పార్టీ టికెట్టు ఇవ్వవద్దని బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయితే స్థానికంగా మాత్రం కాంగ్రెస్‌లో చేరాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వినోద్‌కు అండగా ఉన్న జెడ్పీ వైఎస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కూడా ఆయన వెంటనే కాంగ్రెస్‌లో చేరే యోచనలో ఉన్నారు. ఐకే రెడ్డికి అప్పాల గణేష్ షాక్ నిర్మల్ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన చేతిలో ఓడిపోయిన శ్రీహరిరావును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మచ్చిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఊహించని రీతిలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కౌన్సిల్‌లోని 21 మంది కౌన్సిలర్లతో కలిసి టీఆర్ఎస్కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఐకే రెడ్డి విజయానికి గణేష్ కృషి చేశారు. ఇక్కడ ఎంఐఎంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయితే గణేష్ చక్రవర్తి టీఆర్ఎస్ను వీడినప్పటికీ, ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. 20వ తేదీన భైంసా మీటింగ్‌లో రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. ముథోల్‌లో వేణుగోపాలచారి వర్గం చిచ్చు ముథోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డిని మార్చాలని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గం డిమాండ్ చేస్తోంది. విఠల్‌రెడ్డిని మార్చాలని గాంధీజీ విగ్రహానికి ఇప్పటికే రెండుసార్లు వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. విఠల్‌రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేయాలని స్వయంగా కేటీఆర్ సూచించినా చారి వర్గీయులు ససేమిరా అంటున్నారు. అయితే కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వేణుగోపాలచారి ఇప్పటివరకు నోరు విప్పలేదు. వేణుగోపాలచారిని సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సిర్పూరులో సమ్మయ్య షాక్... సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేయడం పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పకు మింగుడుపడడం లేదు. సమ్మయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని గతంలోనే ప్రయత్నించిన నాయకులు రాహుల్‌గాంధీ సభలో ఆయనను పార్టీ మారేలా చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అలాగే ఈ నియోజకవర్గంలో దహెగాం మాజీ జెడ్పీటీసీ చిలువేరు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చిలువేరు కల్పన, మాజీ సర్పంచ్ జయప్రద కాంగ్రెస్‌లో చేరారు. ఇదే మండలానికి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో చేరారు. పెంచికల్‌పేట, బెజ్జూరులో కూడా ఇదేరీతిన వలసలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పరంపర కొనసాగుతోంది. బోథ్‌లో కలిసిరాని ఎంపీ నగేష్ బోథ్ నియోజకవర్గంలో టికెట్టు మార్చాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పట్టుపడుతున్నారు. పార్టీ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు నగేష్ వర్గం సహాయ నిరాకరణ కొనసాగిస్తోంది. ప్రచారంలోకి వెళ్లకపోగా, బాపూరావు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నగేష్ ప్రచారానికి వెళ్లకుంటే ఇక్కడ బాపూరావుకు కష్టమని ఆపార్టీ కార్యకర్తలు చెపుతున్నారు. మంచిర్యాలలోనూ.. మంచిర్యాలలో ఎంపీపీ బేర సత్యనారాయణ టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీ చేస్తుండగా, ఇక్కడ టికెట్టు ఆశించి భంగపడ్డ పుస్కూరి రామ్మోహన్రావు అభ్యర్థి దివాకర్‌రావు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ వసుంధర, ఆమె భర్త రమేష్, పలువురు కౌన్సిలర్లు కూడా సహాయ నిరాకరణ కార్యక్రమంలో ఉన్నట్లు సమాచారం. -
‘కాకా’కు కన్నీటి వీడ్కోలు
* ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు * హాజరైన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, దిగ్విజయ్ సింగ్ * ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు శ్రద్ధాంజలి * కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్సీపీ అధినేత జగన్ * కదిలివచ్చిన కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామికి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో పంజాగుట్ట శ్మశానవాటికలో కాకా అంత్యక్రియలు జరిగాయి. ఆయన తనయుడు, మాజీ మంత్రి జి.వినోద్ తలకొరివి పెట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ తంతు ముగిసే వరకు రాహుల్ శ్మశానవాటికలోనే ఉన్నారు. మాజీ ఎంపీ వివేక్‌ను ఓదార్చిన రాహుల్ కాకా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న తదితరులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, డి.శ్రీనివాస్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితర నాయకులు కాకాకు అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఈ నేతలంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు. గాంధీభవన్‌లో కాకాకు కాంగ్రెస్ నేతల శ్రద్ధాంజలి కాకా పార్థివదేహాన్ని సోమవారం రాత్రి 11 గంటలకు కేర్ ఆసుపత్రి నుంచి సోమాజిగూడలోని ఆయన తనయుడు వివేక్ ఇంటికి తీసుకు వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పలువురు రాజకీయ ప్రముఖులు వెంకటస్వామి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. మధ్యాహ్నం తర్వాత కాకా పార్థివదేహాన్ని వివేక్ ఇంటినుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గాంధీభవన్‌కు ర్యాలీగా తీసుకువెళ్లారు. అక్కడ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాకా పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి, పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట శ్మశానవాటిక దాకా కాకా అంతిమయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వెంకటస్వామికి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. కాకా ఇద్దరు తనయులు, ముగ్గురు కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు ఆయన్ని కడసారి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాకా పెద్దకొడుకు వినోద్ తన తండ్రి చితికి నిప్పంటించారు. ‘కాకా’కు ప్రముఖుల నివాళి అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించిన కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మంగళవారం ఉదయం నుంచే సోమాజిగూడలోని ఆయన తనయుడు వివేక్ ఇంటికి కాకా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల రాక మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9.30 గంటలకు కాకా పార్థివ దేహాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కాకా భౌతిక కాయంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటిం చారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ‘వెంకటస్వామి జీవితం బడుగు బలహీన వర్గాలకు ఆదర్శం. పేదలకు అండగా ఉంటూ సేవలు అందించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. నిత్యం కార్మికుల కోసం తపించిన ఆయన, తన వారసత్వాన్ని సృష్టించి వెళ్లారు..’ అని ఏపీ సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటిం చారు. తెలగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం తపన పడిన కాకా.. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌ను కూడా విభేదించారని, హైదరాబాద్ వికాసంపై స్పష్టమైన అవగాహన ఆయనకు ఉండేదని, కాకా బతికి ఉంటే తెలంగాణకు మరింత మేలు జరిగేదన్నారు. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్ర సమరం నాటి రాజకీయ ఆఖరి దిగ్గజం కాకా. మా అందరకీ భీష్మ పితామహుడు. ఆయన మృతి తీరని లోటు. అన్ని కులాల వారూ కాకాను స్పూర్తిగా తీసుకోవాలి’ అన్నారు. తెలంగాణ కోసం నిత్యం తపన పడిన కాకా పేరు తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం గుర్తుండిపోయేలా ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. రాజకీయాలకతీతంగా స్పందించే కాకా.. సమాజంలో మార్పు కోసం శ్రీకారం చుట్టిన నేత అని, అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌తోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, డాక్టర్ రాజయ్య, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ తదితరులు కాకాకు శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్, సీపీఎం తెలంగాణ కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనమండళ్ల అధ్యక్షులు స్వామిగౌడ్, చక్రపాణి తదితరులు కాకాకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు వివేక్ నివాసానికి తరలివచ్చి కాకాకు నివాళులర్పించారు. -
నేడు కాకా అంత్యక్రియలు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు వెంకటస్వామి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం వెంకటస్వామి భౌతికకాయాన్ని ఊరేగింపుగా పంజగుట్ట శ్మశా న వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాకా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంకటస్వామి మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన వెంకటస్వామి.. సోమవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు వెంకటస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంకట స్వామి మృతదేహాన్ని సోమాజిగూడలోని వివేక్ ఇంటికి తరలించారు. -
నేడు వెంకటస్వామి అంత్యక్రియలు
-
వెంకటస్వామి కన్నుమూత
-
తెలంగాణ రాజకీయ భీష్ముడు
* ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం * కార్మిక పక్షపాతిగా పేరు తె చ్చుకున్న కాకా * 7 సార్లు ఎంపీగా విజయబావుటా * రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు * కేంద్రమంత్రిగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో బాధ్యతలు సాక్షి, హైదరాబాద్/గోదావరిఖని: రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామిది సుదీర్ఘ ప్రస్థానం. అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనను వరించిన పదవులు ఎన్నో. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో మల్లయ్య, పెంటమ్మ దంపతులకు జన్మించిన కాకాకు 1944లో వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న వెంకటస్వామి కార్మిక నేతగా మంచి గుర్తింపు పొందారు. 1957లో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీకి 1961-64 మధ్య అధ్యక్షుడిగా పనిచేశారు. పేదలకు గుడిసెలను నిర్మించాలనే లక్ష్యంతో ‘నేషనల్ హట్స్ సొసైటీ’ని ఏర్పాటు చేశారు. వేలాది మంది నిరుపేదలకు గుడిసెలు నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం 1973లో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో అంబేద్కర్ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి 1967, 1971, 1977లలో ఎంపీగా గెలిచిన ఆయన.. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రంలో ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావుల హయాంలో కార్మిక, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ర్టంలో శాసనమండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2009లో 15వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో వెంకటస్వామికి టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో తన తనయుడు వివేక్‌ను రాజకీయ అరంగేట్రం చేయించారు. కాకా మరో తనయుడు జి.వినోద్ కూడా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణను స్వప్నించి.. కనులారా వీక్షించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడి గా పనిచేసిన సమయంలో వెంకటస్వామి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. ప్రత్యేక తెలంగాణ రా్రష్ట్రాన్ని చూడడమే తన స్వప్నమని అనేకమార్లు పేర్కొన్న కాకా... రెండు మూడుమార్లు తీవ్ర అస్వస్థతకు గురైనా మళ్లీ కు దుటపడ్డారు. తెలంగాణ రా్రష్ట్రాన్ని చూసేం దుకే తాను బతికి ఉన్నానని ఆయన చెప్పేవారు. అనుకున్న ట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూశారు. కాంగ్రెస్‌లో వివాదరహితునిగా, దళిత నేతగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను ఆశించారు. అయితే రాజకీయ సమీకరణాల వల్ల ఆ పదవు లు పొందలేకపోయారు. ఈ అసంతృప్తితోనే 2011లో బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అ నంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా పని కిరారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా సీడబ్ల్యూసీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు. గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం కోసం.. సింగరేణి సంస్థలో 1996 కంటే ముందు గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఆ సమయంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రంతో మాట్లాడి గని కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. 1998లో జరిగిన వేతన ఒప్పందం సమయంలో సింగరేణి వద్ద డబ్బులు లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రూ.400 కోట్లు తీసుకుని కార్మికులకు వేతనం చెల్లించేలా చూశారు. కాజీపేట నుంచి సిర్పూర్కాగజ్నగర్ వరకు రామగిరి ప్యాసింజర్ రైలును వేయించారు. సింగరేణి కార్మికులు ఆయనతో తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు తీర్చుతూ కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. సింగరేణిలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు. కాకా రాజకీయ ప్రస్థానం * 1957-62, 1978-84 మధ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక, 1978-82 మధ్య రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు * 1967లో తొలిసారి లోక్‌సభకు ఎన్నిక * 1971, 1977, 1989, 1991, 1996, 2004 ఎన్నికల్లో ఎంపీగా గెలుపు * కేంద్ర కేబినెట్లో కార్మిక, పౌర సరఫరాలు, పునరావాసం, చేనేత, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు * 1961-64 మధ్య ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కొనసాగారు * 1982-84 మధ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు * కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ డిప్యూటీ లీడర్‌గానూ వ్యవహరించారు. ప్రముఖుల సంతాపం అంకితభావంతో సేవలందించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పార్లమెంటేరియన్ జి.వెంకటస్వామి మృతి రాష్ట్రానికి ఎంతో నష్టం. పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు అంకితభావంతో సేవలందించారు. ఆయన మృతితో రాష్ట్రం ముఖ్యనేతను కోల్పోయింది. - నరసింహన్, గవర్నర్ పేదల కోసం పాటుపడ్డారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి.వెంకటస్వామి మరణం బలహీన వర్గాలకు ఎంతో నష్టం. ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నా. - బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి తీరని లోటు వెంకటస్వామి మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు. - చంద్రబాబునాయుడు, ఏపీ ముఖ్యమంత్రి కార్మికుల కోసం ఎంతో కృషి చేశారు సీనియర్ పార్లమెంటేరియన్ జి.వెంకటస్వామి మృతికి ప్రగాఢ సంతాపం. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి. కార్మికులు, కర్షకుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. - జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ అధినేత ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి, కాకా మృతికి సంతాపం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. -ఎన్.రఘువీరారెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ కాంగ్రెస్‌కు భీష్మాచార్యుడు తెలంగాణ కాంగ్రెస్‌కు వెంకటస్వామి భీష్మాచార్యుడు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నా. - డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎంతో బాధ కలిగించింది వెంకట స్వామి మృతి చెందారన్న వార్త ఎంతగానో బాధ కలిగించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. - కె. జానారెడ్డి, టీసీఎల్పీ నాయకుడు దళిత ఉద్యమాలకు దిక్సూచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి దళిత ఉద్యమాలకు దిక్సూచిలా వ్యవహరించారు. అలాంటి నాయకుడు మృతి చెందడం దురదృష్టకరం. -జాన్ వెస్లీ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సంతాపం తెలిపారు. -
వెంకటస్వామి కన్నుమూత
* ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కాకా * తీవ్ర అస్వస్థతతో ఐదు నెలలుగా కేర్‌లో చికిత్స * అవయవాలు విఫలమవడంతో మృతిచెందిన కాకా * పంజాగుట్ట శ్మశాన వాటికలో నేడు అంత్యక్రియలు * అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం ప్రకటన * కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిగా, ఎంపీగా వెంకటస్వామి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా.. కాంగ్రెస్‌వాదుల్లో ‘కాకా’గా చెరగని ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(85) ఇకలేరు. కార్మిక నేతగా ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. సోమవారం రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురై దాదాపు ఐదు నెలలుగా ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారం క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలోకి మార్చారు. క్రమంగా శ్వాస సరిగా తీసుకోలేకపోవడంతోపాటు మూత్రపిండాల పనితీరు మందగించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి డయాలసిస్ చేస్తూ వచ్చారు. వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన కన్నుమూసే సమయంలో కుమారులు మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌తో పాటు కూతురు, మనుమళ్లు, మనుమరాళ్లు అక్కడే ఉన్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రజా గాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు కేర్ ఆసుపత్రికి చేరుకుని వెంకటస్వామి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వెంకట స్వామి మృతదేహాన్ని సోమాజిగూడలోని వివేక్ ఇంటికి తరలించారు. ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల సందర్శనార్థం మంగళవారం ఉదయం నుంచి ఆయన భౌతిక కాయాన్ని గాంధీభవన్‌లో ఉంచుతారు. అనంతరం ఊరేగింపుగా పంజగుట్ట శ్మశా న వాటికకు తీసుకువెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు కాకా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వెంకటస్వామి మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని సీఎం గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు కాకా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం నివాళులు అర్పించనున్నారు. -
కన్ను మూసిన కాకా
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి 1969 తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ముల్కీ ఉద్యమంలోనూ కీలక పాత్ర జిల్లా అభివృద్ధిలో విశేష కృషి సాక్షి, మంచిర్యాల : కాంగ్రెస్ కురువృద్ధుడు.. ఏఐసీసీ శాశ్వత సభ్యుడు.. ‘కాకా’గా సుపరిచితుడైన గడ్డం వెంకటస్వామి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఎస్సీ సామాజిక వ ర్గానికి చెందిన కాకా కాంగ్రెస్ పార్టీలో కే ంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కీలక రాజకీయ పదవులతోపాటు మంత్రి పదవులు చేపట్టారు. జిల్లా కీర్తిని దేశవ్యాప్తంగా చాటారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఇవ్వాలని తొలిసారిగా వాదించింది వెంకటస్వామియే. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వాదాన్నీ వినిపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. ముక్కు సూటిగా మాట్లాడే కాకా.. సమస్యల పరిష్కారం విషయంలో ప్రతిపక్షాలనే కాదూ స్వపక్షంలోనూ నాయకులపైనా విమర్శలు గుప్పించారు. పలుసార్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులను కూడా వదలిపెట్టలేదు. పార్టీ విధానాలకు కట్టుబడి పని చేసిన కాకా పార్టీ నిర్ణయాలు.. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో దిట్టగా పేరొందారు. ‘తెలంగాణ వచ్చిన తర్వాతే చస్తా..’ వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జన్మించారు. 1969లో తొలిసారిగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన గళం వినిపించారు. పదేళ్ల క్రితం జరిగిన మలి ఉద్యమంలోనూ ఆయన పాల్గొనడంతోపాటు తెలంగాణ వాదాన్ని చాటారు. ఆ సమయంలో ఆరోగ్య క్షీణించగా..‘నేను ఇప్పుడే చనిపోను.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే చనిపోతా..’ అని చెప్పిన మాటల్ని జిల్లా ప్రజలు నెమరువేసుకుంటున్నారు. జిల్లా అభివృద్ధిలో తనవంతు.. 1957 నుంచే వెంకటస్వామికి జిల్లాతో అనుబంధం ఉంది. సిర్పూర్ ద్విసభ్య నియోజకవర్గం ఉన్నప్పుడు 1957లో తొలిసారిగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పటి పీఎస్పీ పార్టీకి చెందిన రామన్నపై 8821 ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి తూర్పు ప్రాంతాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. మంచిర్యాలలో ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం.. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగాయి. రూ.24 కోట్ల వ్యయంతో మంచిర్యాల పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా పథకాన్ని కూడా కాకా హయాంలోనే ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించేందుకు విశేష కృషి చేసిన కాకా చివరకు అనుకున్నది సాధించారు. 1998 నుంచి కార్మికులు పెన్షన్ పొందుతున్నారు. కార్మిక సంఘాలను స్థాపించిన ఘనత కూడా కాకాకే దక్కింది. రాజకీయ ప్రస్ధానం..! వెంటకస్వామి.. మూడు సార్లు సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా, పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు గెలిచారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, పీవీ న రసింహారావు కేబినెట్లో కార్మిక, గ్రామీణాబివృద్ధి, జౌళిశాఖ మంత్రిగా పని చేశారు. 2002-04లో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడిగా, 1982-84 వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. రాష్ట్రంలో అంజయ్య, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వారి కేబినెట్లో సేవలందించారు. గడ్డం వినోద్‌కుమార్, గడ్డం వివేకానంద కాకా తనయులు. కాగా వారు రాజకీయంగా ఎదిగేందుకు తండ్రి ఆశీస్సులు ఎంతగానో ఉన్నాయి.