Gajarla Ravi
-
ఆర్కే, రవిలను విడుదల చేయాలి
వరవరరావు డిమాండ్ హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామకృష్ణ (ఆర్కే) అలియాస్ సాకేత్ అలియాస్ రాజన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, దుబాషి శంకర్ అలియాస్ అంకమ్బాబురావు అలియాస్ మహేందర్ తదితరులను వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. వీరందరినీ బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వారిని కోర్టులో హాజరు పరచాలన్నారు. మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మృతిచెందిన ప్రభాకర్ మృతదేహానికి గురువారం యాప్రాల్‌లో వరవరరావు జోహార్లు అర్పించారు. అడవి సంపదను దోచుకోవడానికే... ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రపంచ బ్యాంక్ ఎజెండాగా పనిచేస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ను కుట్రగా అభివర్ణించారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. ఇందులో కానిస్టేబుల్ మృతికి కాల్పులు కారణం కాదని.. కాలువలో పడి చనిపోయాడన్నారు. ఆదివాసీలపై ఎలాంటి కేసులూ పెట్టే అర్హత ప్రభుత్వాలకు లేదని, ఇప్పటికై నా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు కూంబింగ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పీడిత ప్రజలున్నంతకాలం విప్లవం... పీడిత తాడిత ప్రజలున్నంత వరకు విప్లవ ఉద్యమాలు ఆగవని వరవరరావు స్పష్టం చేశారు. ఆదివాసీల దీర్ఘకాలిక సమస్యలపై మావోయిస్టు పార్టీ 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రకటన చేయాలి: గద్దర్ విప్లవకారుల ఎన్కౌంటర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు ప్రభాకర్ మృతదేహానికి జోహార్లు అర్పిం చారు. బూటకపు ఎన్కౌంటర్లతో నక్సలిజాన్ని ఆపలేరని, మావోయిస్టుల అడ్డుతొలిగితే మార్గం సులువు చేసుకోవచ్చని చంద్రబాబునాయుడు కలలు కంటున్నాడని విమలక్క అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటాలను ఆపేదిలేదన్నారు. ఈ ఎన్కౌంటర్ వట్టి బూట కమని, పోలీసుల నాటకమని ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత క్రూరం గా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం మన్యం గిరి జనుల కడుపు నింపే అడవుల కింద కోట్లాది రూపాయల విలువచేసే బాకై ్సట్ ఖనిజం తవ్వకాల కోసమే బడా వ్యాపారవేత్తలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాయని రాజు ఆరోపించారు. ప్రొఫెసర్ కాశీం, స్నేహలత, చంద్రమౌళి, అంద్శై నలమాస కృష్ణ తదితరులు ప్రభాకర్‌కు నివాళులర్పించారు. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి ‘దోపిడి రాజ్యాన్ని కూల్చడానికి అడవిబాట పట్టి పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోతివా... కొడుకా ప్రభాకరా.. ఎంత పని చేస్తిరి... నీ పాట ఎటుపోయె కొడుకా... తెలంగాణ కోసం మధనపడితివి. నా ప్రాణం అంటివి. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయంటివి. దోపిడి రాజ్యాన్ని మారుద్దామంటివి. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి. మీ నాయన పోయినా రాకపోతివి. మాకు ఎవరు తోడుంటరు కొడుకా’ అంటూ ప్రభాకర్ తల్లి రత్నమ్మ గుండెలవిసేలా రోదించారు. కూంబింగ్ నిలిపివేయాలి... దండకారణ్యంలో కూంబింగ్‌ను నిలిపివేయాలి. సమాజంలో ఆర్థిక అసమానతలున్నంత కాలం నక్సలిజం ఉంటుంది. - ప్రభాకర్ సహచరి దేవేంద్ర -
గాజర్ల రవి సురక్షితం
మూడ్రోజుల ఉత్కంఠకు తెర సాక్షి, భూపాలపల్లి: మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్ చనిపోలేదని ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు తెలిపారు. ఎన్కౌంటర్ మృతుల్లో గాజర్ల రవి ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో గణేశ్ సోదరులు సమ్మయ్య, అశోక్ అలియాస్ ఐతు మల్కన్‌గిరికి వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం వారు ఎన్కౌంటర్లో చనిపోయినవారి మృతదేహాలను పరిశీలించారు. అందులో గణేశ్ మృతదేహం లేదని అశోక్ తెలిపారు. గణేశ్ వివరాల కోసం ఫోన్లో సంప్రదించగా ‘‘బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మల్కన్‌గిరి పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నాం. ఒక మృతదేహాన్ని చూసేందుకు ముగ్గురు కుటుంబ సభ్యులకు అనుమతించారు. నాతో పాటు మా అన్న సమ్మయ్య, వదిన విజయ వెళ్లాం. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్ని మృతదేహాలను చూశాం. అందులో గణేశన్న మృతదేహం లేదు. దీంతో గణేశన్న ఎన్కౌంటర్లో చనిపోలేదని నిర్ధారించుకున్నాం. వెంటనే ఈ కబురు వెలిశాల ప్రజలకు తెలిపాం. తేలికపడిన మనసుతో మల్కన్‌గిరి నుంచి హన్మకొండకు వస్తున్నాం’’ అని అశోక్ వివరించారు. అలాగే ఎన్కౌంటర్లో గణేశ్ భార్య ప్రమీల అలియాస్ జిలానీ బేగం చనిపోయిందని జరుగుతున్న ప్రచారానికి కూడా తెరదించారు. మృతదేహాల్లో జిలానీ బేగం లేదని స్పష్టం చేశారు. మల్కన్‌గిరి ఎన్కౌంటర్ కు రెండ్రోజుల ముందే మావోయిస్టు అగ్రనేతలంతా ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్లినట్లు అశోక్ తెలిపారు. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు చూసేందుకు మల్కన్‌గిరికి వచ్చిన మాజీ మావోలు, వారి కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్రనేతలు ఎవరూ ఈ ఎన్కౌంటర్లో చనిపోలేదని భావిస్తున్నట్లు వివరించారు. -
గాజర్ల రవి తప్పించుకున్నాడా?
12 మంది మహిళా మావోయిస్టులు మృతి మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: ఎన్ కౌంటర్లో గాజర్ల రవి అలియాస్ ఉదయ్ మృతి చెందాడా? లేక తప్పించుకున్నాడా? అన్న అంశంపై స్పష్టత కొరవడింది. ఇటు పోలీసులు కానీ, అటు మావోయిస్టుల వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మల్కన్‌గిరి, విశాఖపట్నం ఎస్పీలు కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. సోమవారం ఉదయం రవి మరణించాడనే ప్రచారం సాగింది. దీంతో మల్కన్ గిరి జిల్లాలో కలకలం రేగింది. అయితే కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారని, సురక్షితంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. మరో 4 మృతదేహాలు లభ్యం ఎన్కౌంటర్లో మరణించినవారి సంఖ్య 28కి చేరింది. సంఘటన ప్రాంతంలో గాలిస్తున్న కూంబింగ్ దళాలకు మంగళవారం ఉదయం మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కూడా ఉంది. దీంతో ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళల సంఖ్య 12కు చేరింది. మావోయిస్టు నేత మురళి మృతదేహాన్ని అతని కుమారుడికి అప్పగించారు. ఇంకా 14 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. వీటిలో ఎక్కువ మృతదేహాలు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులవిగా పోలీసులు చెబుతున్నారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని, ఎన్కౌంటర్ జరిగినప్పుడు తీవ్రంగా గాయపడిన మావోయిస్టులు అడవిలో ప్రాణాలు వదిలే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అంటున్నారు. మరో ఎన్కౌంటర్! ఎన్ కౌంటర్ జరిగిన అడవుల్లో ఏపీ డీజీపీ సాంబశివరావు మంగళవారం ఏరియల్ సర్వే చేశారు. మంగళవారం లభించిన నాలుగు మృతదేహాల విషయంలో డీజీపీ కథనం మరోలా ఉంది. సోమవారం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోలు మంగళవారం కూడా కాల్పులు జరిపారని, పోలీసులు అప్రమత్తమై ఎదుర్కోవడంతో మరో నలుగురు మావోలు మృతి చెందారని చెప్పారు. ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ సీనియర్ కమాండో మహ్మద్ అబు బాకర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.40 లక్షల ప్రత్యేక పరిహారాన్ని (స్పెషల్ ఎక్స్‌గ్రేషియా) అందజేసింది. గుర్తించిన మృతుల వివరాలు.. 1. బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ అలియాస్ ప్రసాద్ (ఎస్జేసీఎం, ఈస్ట్ విశాఖ, బాకూరు విలేజ్, విశాఖ జిల్లా) 2. శ్యామల కిష్టయ్య అలియాస్ దయ, (ఎస్జేసీఎం, కోరాపుట్ /శ్రీకాకుళం డివిజన్ సెక్రటరీ) 3. ఐనాపర్తి దాసు అలియాస్ మధు (డీజీఎం, టెక్‌టీం, వెస్ట్ గోదావరి) 4. గెమ్మెలి కేశవరావు అలియాస్ బిస్రు (డీసీఎస్, ఫస్ట్ సీఆర్టీ, తాడపాలెం, విశాఖ జిల్లా) 5. లత అలియాస్ పద్మ, (డీసీఎం, వైఫ్ ఆఫ్ మహేందర్, ఎస్‌జెడ్‌సీఎం, హైదరాబాద్) 6. రాజేష్ అలియాస్ సీమల్ (డీసీఎం, ఫస్ట్ సీఆర్సీ, సీజీ) 7. బొట్టు తుంగనాలు అలియాస్ మమత (డీజీఎం, వైఫ్ ఆఫ్ సురేష్, ఎస్‌జెడ్‌సీఎం ఆఫ్ శ్రీకాకుళం జిల్లా) 8. ఎమలపల్లి సింహాచలం అలియాస్ మురళి, అలియాస్ హరి (డీసీఎం, విజయనగరం) 9. స్వరూప అలియాస్ రిక్కి, (డీసీఎం, ఎక్స్ ఆర్టీసీ కండక్టర్, తూర్పు గోదావరి జిల్లా) 10. శ్వేత, ఏసీఎం, పెదబయలు ఏరియా 11. బుద్రి, ఏసీఎం, ఆర్కే సెక్యూరిటీ గార్డ్ 12. మున్నా, ఆర్కే కుమారుడు, 13. రైనో, డీసీఎం 14. కిల్లో సీత, సప్లై టీం మెంబర్, చింతపల్లి డివిజన్, విశాఖపట్నం జిల్లా