gandhi nager
-
రాహుల్.. మీ మాటలు బాధించాయి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణా అద్వానీని చెప్పుతో కొట్టి.. స్టేజీ నుంచి దింపేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రాహుల్.. అద్వానీ మాకు తండ్రి లాంటి వారు. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో బాధించాయి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత పాటిస్తే బాగుంటుంది’ అని సుష్మా ట్వీట్ చేశారు. శుక్రవారం నాగపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘ బీజేపీ హిందుత్వం గురించి మాట్లాడుతుంది. హిందుత్వంలో గురు-శిష్య పరంపరకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూమతంలో గురువును గొప్పగా చూస్తారు. మోదీ గురువు ఎవరు? అద్వానీ. ఆయనను చెప్పుతో కొట్టి స్టేజీ నుంచి దింపేశారు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అద్వానీకి టికెట్ నిరాకరించి.. ఆయన స్థానంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి నిలబెట్టిన సంగతి తెలిసిందే. అద్వానీని బలవంతంగా రాజకీయాల నుంచి మోదీ తప్పించారని, గురువుకు గౌరవం ఇవ్వకపోవడం హిందూ సంప్రదాయం కాదని రాహుల్ పేర్కొన్నారు. -
అద్వానీ స్ధానంలో అమిత్ షా..
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగుతుందో ఊహించలేం. వయసు మీద పడిందనో, ఆరోగ్యం సహకరించడం లేదనో కాకలుతీరిన నేతలను కరివేపాకులా తీసివేస్తున్న కమలనాధుల తీరుకు ఆ పార్టీ వెల్లడించిన తొలి జాబితా అద్దం పడుతోంది. బీజేపీ దిగ్గజ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పక్కనపెట్టింది. అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాను బరిలో నిలిపింది. బీజేపీ గురువారం వెల్లడించిన పార్టీ అభ్యర్ధుల తొలిజాబితాలో అద్వానీ స్ధానంలో గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీచేయనున్నట్టు వెల్లడించింది. అద్వానీని దూరం పెట్టడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపుతుందని భావిస్తున్నారు. ఇక 1991లో అద్వానీ గాంధీనగర్ లోక్‌సభ స్ధానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆయనకు నరేంద్ర మోదీ సహకరిస్తుండగా, వారివెనుక అమిత్ షా నిల్చున్న ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరోవైపు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అద్వానీ స్ధానంలో అమిత్ షాకు చోటు కల్పించడంతో సోషల్ మీడియాలోనూ ఇదే టాపిక్ ట్రెండ్ అవుతోంది. -
ఈత సరదాతో ఇద్దరు బాలలు మృతి
మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన దోమలపల్లి వెంకటమ్మ కుమారుడు సాయిక్రిష్ణ (14), దోమలపల్లి లింగమ్మ కుమారుడు సందీప్ (12)లు గ్రామానికి సమీపంలోని లయోలా స్కూల్లో చదువుతున్నారు. సాయిక్రిష్ణ, సందీప్‌లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని నీటి ట్యాంక్‌లో ఈత కొట్టేందుకు వెళ్ళారు. ఎక్కువ సేపు ఈత కొట్టటం వారికి చేతకాకపోవటంతో నీటిలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.