గంగమ్మ ఒడికి గౌరీపుత్రుడు
గణాధిపతి... సిద్ధిబుద్ధి ప్రదాత... తొలి పూజలందుకున్న గౌరీ నందనుడు గంగమ్మ ఒడికి చేరాడు. వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చిన కొండంత దేవుడు మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకున్నాడు. 9 రోజులు పత్రి, గరిక పూజలు అందుకొని.. పండ్లు, పాయసం, ఉండ్రాళ్లు ఆరగించిన బొజ్జ గణపయ్య ఆదివారం నిమజ్జనానికి వెడలాడు.
విగ్రహాల శోభాయూత్ర అంగరంగ వైభవంగా జరిగింది. యువతీ యువకుల కోలాటాలు, నృత్యాలు, బ్యాండుమేళాలు, డప్పుచప్పుళ్ల సందడి మధ్య గణేష్ మహరాజ్ జలాధివాసానికి తరలాడు. మూషిక వాహనుడికి లారీలు, ట్రాక్టర్లు... అన్నీ వాహనాలయ్యూరుు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఆయూ చెరువులు, జలాశయూల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కనులపండువగా జరిగింది.
హన్మకొండ కల్చరల్ : తొమ్మిది రోజుల పాటు జిల్లా ప్రజల ను అలరించి భక్తిసాగరంలో ముంచెత్తిన పార్వతీ తనయుడు గణనాథుడి విగ్రహాలను భక్తులు ఘనంగా నిమజ్జనం చేశా రు. రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పుటికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వడంతో గణనాథుల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. నగరంలో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన వినాయక నిమజ్జనం అర్ధరాత్రి వరకు కొనసాగింది. యువకులు, యువతులు, మహిళలు, పిల్లలు, పెద్దలు ఊరేగింపు వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు.
గణపతి బొప్పామోరియా, జైబోలో గణేష్ మహరాజ్‌కీ జై అంటూ వీరభక్తిని చాటుకున్నారు. కాషాయ రిబ్బన్లు, టోపీలు, జెండాలు ధరించి హోలీ రంగులు చల్లుకుంటూ బాణసంచా పేళుల్లు, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. గణపతులకు ఘనంగా స్వాగతించడానికి వరంగల్ మహానగర గణపతి నవరాత్రి ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. వరంగ ల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, జిల్లా అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి సాయంత్రం 6.00 గంటలకు బంధంచేరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి
హన్మకొండలోని వినాయకులు పలు వీధుల నుంచి ఊరేగిం పుగా వచ్చి చౌరస్తా మీదుగా పద్మాక్షి గుండం, సిద్ధేశ్వ గుం డం, ములుగు రోడ్డులోని కోటచెరువు వైపు తీసుకువేళ్లారు. హన్మకొండ చౌరస్తా శక్తిస్థల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి గుజ్జుల నరసయ్య, రామానుజం తదితరులు వినాయక ఊరేగింపులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాత్రి 7.00 గంటలకు ఈ వేదికపై నుంచి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ప్రకటించారు. కాజీపేట వైపు నుంచి బంధం చెరువు దిక్కు వచ్చే వినాయకులను దర్గాసెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి శ్రీనివాస్‌రావు తదితరులు, వరంగల్ వైపు నుంచి చిన్నవడ్డేపల్లి చెరువుకు వస్తున్న వినాయకులను పోచ్చమ్మమైదాన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి నందాల చందర్బాబు, భైరిశ్యామ్సుందర్ ఆధ్వర్యంలో ఆహ్వనించారు.
రాత్రి 12 గంటల వరకు జిల్లా మొత్తం మీద 8000 వినాయకులను నిమజ్జనం చేశారు. కాజీపేట బంధం చెరువులో 500, సిద్ధేశ్వర గుండంలో 500, కోటచెరువులో 800, చిన్నవడ్డేపల్లి చెరువులో 1500, ఉర్సు రంగసముద్రంలో 400ల వినాయక విగ్రహలను నిమజ్జనం చేశారు. నగరం మొత్తం మీద 3700 విగ్రహాలను నిమజ్జనం చేశారు. జిల్లా పోలీస్, రెవెన్యూశాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నిమజ్జనం సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. వేలాది మంది ప్రజలు చెరువుల వద్దకు తరలివచ్చారు.
వేడి తగ్గిన వేలం పాటలు
బోజ్జ గణపయ్య లడ్డూ తింటే భలే రుచి మాత్రమే కాదు కలిసొస్తుందని భక్తుల నమ్మకం. అయితే నగరంలోని పలుచోట్ల గణేష మండళ్లు నిర్వహించిన లడ్డూ వేలం పాటలు గతంలో కంటే తక్కువకు పోయాయి. కొన్నిచోట్ల గజానన మండలివారే జోక్యం చేసుకుని కొనుగొలు చేయాల్సివచ్చింది. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని శ్రీగజానన మండలిలో నిర్వహించిన వేలం పాటలో నూతన గజానన మండలి కమిటీవారే రూ.35,116లకు గణపతి లడ్డూ కైవసం చేసుకున్నారు. ఎక్సైజ్ కాలనీలోని శ్రీనాగేంద్రస్వామి శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీఆభయాంజనేయస్వామి సహిత శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో జరిగిన వేలంపాటలో ఏనుగుల సాంబరెడ్డి, మంజుల దంపతులు రూ.2,116లకు లడ్డూ దక్కించుకున్నారు.