gangstar nayeem
-
నయీం కేసులో పలువురు టీఆర్ఎస్ నేతలు
-
‘ మాండ్ర ’ అక్రమాలకు అడ్డుకట్ట వేయండి
కర్నూలు (న్యూసిటీ): నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నియోజవకర్గ ప్రజలు డిమాండ్ చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, ప్రజలు మంగళవారం కర్నూలు తరలివచ్చి నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో గ్యాంగ్‌స్టర్ నయూమ్ బినామీ శివానందరెడ్డి అంటు ఫ్లెక్సీలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాకు నియోజకవర్గానికి చెందిన తువ్వా మల్లారెడ్డి, స్వామిరెడ్డి, చట్టా మురళీ, షరీఫ్, రమేష్‌నాయుడు తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక మాఫియాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, శివానందరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ అధికారులను బెదిరించి ఇద్దరు వ్యక్తులను విడిపించుకున్నారన్నారు. నిరుపేదలకు పింఛన్లు మంజూరు చేయించేందుకు కూడా రూ.10 వేలు లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. గృహాలు, ఇతరత్రా సంక్షేమ పథకాలన్ని తన కనుసన్నల్లోనే నడవాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. మాండ్ర అక్రమాలను నిలువరించి నిజాయితీగా పని చేస్తున్న అధికారులకు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నాయకులు కళ్యాణ్, కే వెంకటరమణ, బన్నూరు చంద్రారెడ్డి, బీ రామాంజనేయులు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్–2 ఎస్ రామస్వామిని కలిసి వారు వినతి పత్రాన్ని అందించారు. ఆతర్వాత ఎస్పీ ఆకే రవికృష్ణను కలసి వినతి పత్రం అందజేశారు. -
నయీం బావను కాల్చేసిన ప్రాంతం పరిశీలన
శంషాబాద్ రూరల్: ఎన్ కౌంటర్ తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోన్న గ్యాంగ్‌స్టర్ నయీం ఉదంతాల్లో అత్యంత పాశవికమైనదిగా భావిస్తోన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నయీం తన బావ(సోదరి భర్త)ను కిరాతకంగా చంపి, దహనం చేసిన కేసులో నయీంతోపాటు ఫర్హానా, సలీమాలు కూడా నిందితులు. ప్రస్తుతం తమ కస్టడీలో ఉన్న వీరిద్దరినీ శంషాబాద్ పోలీసులు శుక్రవారం హత్యజరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి పలు విధాలుగా ప్రశ్నించారు. శంషాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. 2013, ఫిబ్రవరి 2న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సాతంరాయి సమీపంలోగల పప్పు ఫాం హౌస్ లో నయీం.. తన సోదరి సలీమా భర్త, భువనగిరికి చెందిన విజయ్ కుమార్ అలియాస్ నదీమ్ ను దారుణంగా హతమార్చాడు. ఫాం హౌస్ లోని ఒక గదిలో నదీమ్ తలపై రాడ్డుతో మోది, ఫర్హానా సాయంతో నదీమ్ ను హాలులోకి తీసుకొచ్చి చున్నీని మెడకు బిగించి చంపారు. అనంతరం నదీమ్ మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించి పెద్దతూప్ర సమీపంలోని నిర్జన ప్రదేశంలో దహనం చేశారు. నదీమ్ మృతదేహాన్ని తరలించిన వాహనంలో నయీంతో పాటు డ్రైవర్ ఫయీం, సమీప బంధువు ఫర్హానా, మరో మహిళ, ఇద్దరు బాలికలు ఉన్నారు. మహిళలు, బాలికలు వాహనంలోనే ఉండగా.. నయీం మృతదేహాన్ని కాల్చి వేశాడు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం ఈ హత్య వెలుగు చూడగా.. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఫర్హానా, సలీమాను శంషాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం వీరిద్దరిని పెద్దతూప్ర వద్ద సంఘటనా స్థలానికి తీసుకెళ్లి పరిశీలించారు. సీఐ ఉమామహేశ్వర్రావు, ఎస్ఐ భాస్కర్ వారి నుంచి వాంగూల్మం నమోదు చేసుకున్నారు. -
‘నయీం’ సినిమా షురూ
-
‘నయీం’ సినిమా షురూ
- అమరావతిలో క్లాప్ కొట్టిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తుళ్లూరు రూరల్ (గుంటూరు): గ్యాంగ్‌స్టర్ నయీం జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా పట్టాలెక్కింది. అమరావతిలోని మందడం గ్రామంలోగల శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఏపీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాకు 'ఖయీం భాయ్' అనే టైటిల్ ను ఖరారుచేశారు. పి. వెంకట్ రెడ్డి, ఎ. ప్రభాకర్‌రెడ్డిలు ఈ సినిమా నిర్మాతలు. మందడం గ్రామానికి చెందిన కట్టా రాంబాబు అనే నటుడు 'ఖయీం భాయ్' టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయీం పేరును రాంబోగా పిలుస్తారు. ముహుర్తం షాట్ గా.. గణేష్ విగ్రహం ఎదుట నయీం కేరక్టర్ అయిన రాంబాబు కొబ్బరికాయ కొట్టి నృత్యం చేసే దృశ్యాలను చిత్రీకరించారు. బెంగళూరుకు చెందిన మౌని ఈ సినిమాలో హీరోయిన్. ముమైత్ ఖాన్, తనికెళ్ల భరిణి, ఎల్బీ శ్రీరాం, బెనర్జీ, రాం జగన్, ఫిష్ వెంకట్, శివ సత్యనారాయణ, హేమ, ప్రగతి, జ్యోతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 'ఖయీం భాయ్'కి మాటలు గోపి మోహన్, సంగీతం శేఖర్ చంద్ర అందిస్తుండగా కెమెరామెన్ గా శ్రీధర్నార్ల, మేకప్ సూర్యచంద్ర, కాస్ట్యూమ్ వలి, కో–డైరెక్టర్ పీవీ రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ క్రిష్ణారెడ్డి, జేవీ నారాయణరావులు వ్యవహరిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. కాగా, ఈ సినిమా ఎక్కువ భాగం ఏపీ రాజధాని ప్రాంతంలో, కీలకమైన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని పాతబస్తీ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇదిలాఉంటే, దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం నయీం కథ ఆధారంగా మూడు సినిమాలను తీస్తానని గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ప్రారంభించిన వివరాలేవీ వెల్లడించలేదు. ఇంతలోనే 'ఖయీం భాయ్' సెట్స్ పైకి రావడం, గోపీ మోహన్ లాంటి పేరున్న రచయిత మాటలు, భరత్ డైరెక్షన్ వహిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. -
నయీం ఆత్మ.. శేషన్న ఇతనే!
హైదరాబాద్: నేరసామ్రాజ్యానికి నయీం రాజైతే.. సైన్యాధికారి శేషన్న! టార్గెట్ ను ఎంచుకోవడం మొదలు, రెక్కీలు నిర్వహించడం, స్కెచ్ వేయడం, దాన్ని పక్కాగా అమలుచేయడం.. ఇవన్నీ నయీం గ్యాంగ్ లో నంబర్ 2గా కొనసాగిన శేషన్న పనులు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన శేషన్న.. గ్యాంగ్ లీడర్ గా మళ్లీ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇన్నాళ్లు ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలియని శేషన్న ఫొటో శనివారం మీడియాకు లభించింది. ఎన్ కౌంటర్ తర్వాత నయీం స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా రంగంలోకి దిగిన సిట్..ఇప్పటికే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నయీం అనుచరులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. కాగా, నయీంకు 'ఆత్మ' లాంటివాడైన శేషన్న దొరికితే దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందని పోలీసుల భావన. అంతే కాకుండా బెదిరింపులు, కబ్జాల ద్వారా నయీం వసూలు చేసిన భారీ మొత్తంలోని డబ్బును డంప్ ల రూపంలో దాచి ఉండొచ్చని, ఆ డంప్ లు ఎక్కడెక్కడున్నాయో శేషన్నకు కచ్చితంగా తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనాసరే శేషన్నను పట్టుకోవాలనుకుంటున్న సిట్ కావాలనే అతని ఫొటోను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఎవరీ శేషన్న? మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శేషన్న గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. బయటికి వచ్చీరాగానే.. అప్పటికే దందాలు నడుపుతోన్న నయీం పంచన చేరాడు. క్రమక్రమంగా గ్యాంగ్ లో నంబర్ 2గా ఎదిగాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూరు, అచ్చంపేట, కల్వకుర్తి,షాద్‌నగర్ తోపాటు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తదితర ప్రాంతాలు శేషన్న ఆధిపత్యంలో ఉండేవి. ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు నయీం తరఫున డీల్స్ చేసింది శేషన్నేనని అరెస్టయిన అనుచరులు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు మహబూబ్‌నగర్ జిల్లాల్లో ముగ్గురు ప్రజాసంఘాల నేతల హత్యల్లో శేషన్న సూత్రధారిగా ఉన్నాడు. మాజీ మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి, తిరిగి వారిని నయీం గ్యాంగ్ లో చేర్చుకోవడంలో శేషన్నదే కీలకపాత్ర. నయీంను ఎవరెవరు కలిశారు? అతని ముఠాతో ఎవరెవరికి సంబంధాలున్నాయనే పూర్తి ఆధారాలు శేషన్న దగ్గరే ఉన్నాయని అనుచరుల ద్వారా తెలిసిన సమాచారం. అందుకే ఈ కేసులో శేషన్న అరెస్టు లేదా లొంగుబాటు కీలకంగా మారింది. -
12 కేసులు.. 18 మంది అరెస్టు
సిట్ చీఫ్ నాగిరెడ్డి సాక్షి, హైదరాబాద్: నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు నమోదు చేసి, 18 మందిని అరెస్టు చేసినట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం డీజీపీ కార్యాలయ ఆవరణలో మాట్లాడుతూ.. నయీమ్ అనుచరులపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల నమోదైన 12 కేసులు తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు. నయీమ్ అనుచరుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ల్యాండ్ డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.2.61 కోట్ల నగదు, రెండు కిలోల 14 గ్రాముల బంగారం, 599 ల్యాండ్ డాక్యుమెంట్లు లభించినట్లు తెలిపారు. వీటిలో చాలా వరకు నయీమ్ సమీప బంధువుల వద్దే దొరికినట్లు పేర్కొన్నారు. అలాగే 19 ఆయుధాలు లభించాయని వాటిలో ఏకే 47 గన్స్, కంట్రిమేడ్, తపంచాలున్నాయని వివరించారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎలా లభించాయనే దానిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నగదు, బంగారు ఆభరణాలు కూడా అక్రమంగా, బెదిరించి తీసుకున్నట్లు తెలుస్తోందని, వాటి వివరాలను ఐటీ, డీఆర్ఐ, ఈడీ సంస్థలకు సమాచారం అందిస్తామన్నారు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. సిట్ సభ్యులతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యం గా ఉంచుతామని చెప్పారు. ఫిర్యాదులు చేసేందుకు 94406 27218 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. ఇప్పటి వరకు తమ విచారణలో పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు వెల్లడి కాలేదని, భవిష్యత్తులో తెలిస్తే వివరాలు వెల్లడిస్తామన్నారు. -
నయీం కేసులో 18మంది అరెస్ట్
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ఇప్పటివరకూ 18మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు. సోదాల్లో రాష్ట్రవ్యాప్తంగా 599 ల్యాండ్ డాక్యుమెంట్లు, 19 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నాగిరెడ్డి తెలిపారు. 2 కిలోల బంగారం, 2.88 కోట్ల నగదు, 6కార్లు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ 12 కేసులు నమోదు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. బాధితులెవరైనా ఉంటే తమను ఆశ్రయించవచ్చని నాగిరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నయీంకు గల సంబంధాలపై డీజీపీ ఆదేశిస్తూ విచారణ చేస్తామన్నారు. అలాగే నయీం ఇంట్లో అదుపులోకి తీసుకున్న 9మంది చిన్నారులను బాలసదన్‌కు తరలించినట్లు నాగిరెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్ నగర్లో ఎన్కౌంటర్ జరిగిన ఇంటి నుంచి రెండు ఏకే-47 గన్లు, స్టెన్‌గన్, 4 రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 17 సెల్ఫోన్లు, మారుతీ డిజైర్, హోండా అమేజ్, స్కూటీని సీజ్ చేశారు. రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం, వ్యవసాయ భూములకు సంబంధించిన 121 డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నారు. అలాగే సంఘటనా స్థలంలో భువనగిరికి చెందిన సలీమాబేగం, మిర్యాలగూడకు చెందిన మతీన్ భార్య ఖలీమ, నయిముద్దీన్ భార్య హసీనాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు తవ్విన కొద్దీ నయీం ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా నయీం అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నయీం భూదందాలు, సెటిల్మెంట్లపై ఆరా తీస్తున్నారు. భువనగిరి, బొమ్మలరామారంలో వందల ఎకరాలు గుర్తించారు. నయీం ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సిట్ లేఖలు రాసింది. నయీం, అతడి అనుచరుల రియల్ దందాలపై సిట్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. -
నయీం బెడ్ రూంలో సిట్ సోదాలు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తుకు నియమించిన సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) రంగంలోకి దిగింది. సిట్ ప్రత్యేక అధికారి నాగిరెడ్డి బుధవారం సాయంత్రం నార్సింగిలోని నయీం ఇంట్లో స్వయంగా సోదాలు చేపట్టారు. నయీం బెడ్ రూమ్, పర్సనల్ రూమ్ లో డి తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కపురి టౌన్షిప్లో నయిం ఇంట్లో 60కి పైగా ఖరీదైన వాచీలు, డైమండ్ రింగ్స్, ఏకే-47 గన్ ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నయీం కుటుంబసభ్యులు, అనుచరులలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వనస్థలిపురం ద్వారకామయినగర్లో నయీం అనుచరుడు ఖయ్యూమ్ ఇంటిని బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లోనే మరో ఇద్దరు అనుచరులు నరేష్, సుధాకర్ ఉంటున్నారు. అయితే నయీం ఎన్కౌంటర్ తర్వాత వారు అక్కడి నుంచి పరారయ్యారు. ఖయ్యూమ్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిద్దరు రిటైర్డు ఏసీపీ ఇంటి సమీపంలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అలాగే మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో కూడా పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. నయీం అనుచరులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఓ లాడ్జిలో ముగ్గరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.