garla dinne
-
కన్నీటి సాగరమైన గార్లదిన్నె
అనంతపురం,గార్లదిన్నె: బోసినవ్వులు, అమాయకపు చూపులతో అందరినీ సంతోష సాగరంలో ముంచిన ఆ చిన్నారులు.. తెల్లటి వస్త్రంలో నిస్తేజంగా ఉండడాన్ని చూసిన జనం కన్నీటిసాగరంలో మునిగిపోయారు. చిన్నారులను చంపడానికి చేతులెలా వచ్చాయంటూ శాపనార్థాలు పెట్టారు. దారుణహత్యకు గురైన మీనాక్షి, ఆమె పిల్లలు కీర్తి, వితేష్ మృతదేహాలు పోస్టుమార్టం అనంతరం గురువారం మండల కేంద్రానికి తరలించారు. స్థానికులు మృతదేహాలను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారి మృతదేహాలను చూసి చలించిపోయారు. మీనాక్షి తల్లిదండ్రులు కుమార్తె, మనమడు, మనమరాలును చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. త్వరలో కేసు ఛేదిస్తాం మీనాక్షి, ఆమె పిల్లల హత్య కేసును త్వరలో ఛేదిస్తామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మృతురాలి భర్త నల్లప్ప ఫిర్యాదు మేరకు అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మీనాక్ష్మి చిన్నాన్న కుమారుడు హరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే మీనాక్షిని హత్య చేశానని నిందితుడు చెప్పినట్లు సమాచారం. మీనాక్షి, ఆమె పిల్లలను చంపుతానని ఆమె భర్తను నిందితుడు హెచ్చరించినట్లు తెలుస్తోంది. -
మద్యం మత్తులో పాఠశాలకు..
గార్లదిన్నె: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఓ ప్రధానోపాధ్యాయుడు మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు. దీంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఎర్రగుంట గ్రామంలోని ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విజయ్‌భాస్కర్ పని చేస్తున్నారు. కాగా విజయ్‌భాస్కర్ పాఠశాలకు మద్యం మత్తులో హాజరవుతున్నట్లు విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన డీఈవో విజయ్‌భాస్కర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
గార్లదిన్నె రైల్వేస్టేషన్లో తనిఖీలు
గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె రైల్వేస్టేషన్లో బుధవారం రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రైల్వేశాఖ అడిషనల్ డీజీపీ కిషోర్‌కుమార్, రైల్వే ఎస్పీ సుబ్బారావు పాల్గొన్నారు. మార్చి 27, ఏప్రిల్ 6 న గార్లదిన్నె స్టేషన్ సమీపంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో వరసగా దొంగతనాలు చోటుచేసుకోవడంతో అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు.