garnepudi Venkata Ratnakar Rao
-
వీరినీ ఆదుకోండి
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అల్పాదాయ మధ్య తరగతి కుటుంబాలకు ప్రయోజనం కలగడం లేదు. ముఖ్యంగా ఏడాదికి లక్షా యాభై వేల రూపాయలకు పైబడిన ఆదాయం ఉన్న వారి విషయానికివస్తే, ప్రభుత్వం పేదలకు అం దిస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం వీరికి వర్తించ దు. మధ్య తరగతి ప్రజలు ఏడాదికి రూ. రెండు, మూడు లక్షలు సంపాదిస్తున్నా నిత్యావసరాల ధరలు, పెరిగిన ఇంటి అద్దెలు, పిల్లల చదువుకు ఫీ జులు కట్టలేక వైద్య ఖర్చులు భ రించలేక ఇబ్బందులు పడుతుం టారు. సమాజంలో నిరుపేదల బతుకు కన్న అటు ఇటు కాని మధ్య తరగతి ప్రజల జీవితం రాను రానూ దుర్భరమైపోతోంది. కాబట్టి ప్రభు త్వాలు మధ్యతరగతి ప్రజల బతుకులపై అధ్య యనం చేయించి వారికి న్యాయం చేయాలని, సంక్షేమ పథకాలను వీరికీ వర్తింపచేయాలని విజ్ఞప్తి. - గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, వరంగల్ -
రూ.15 లకే కిలో బియ్యం!
ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అతి ముఖ్యమైనది పేదవారికి కిలో బియ్యం కేవలం రూ.1కి అందించడం. ఐతే లక్షలాది మందికి ప్రయోజ నం కలిగిస్తున్న ఈ విశిష్ట పథకం ఏ చిన్న తరగతి ప్రభుత్వ ఉద్యోగికీ వర్తించదు. అలాగే చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఈ పథకానికి అర్హులు కారు. అయితే వారు కూడా నిత్యం ఆర్థిక ఇబ్బందులతో ఎంతగానో సతమతవుతుంటారు. ఇలా ఉద్యో గాలు చేస్తున్నప్పటికీ సమస్యలతో ఇక్కట్ల పాలవుతున్న వారందరికీ తగు మాత్రంగా సంక్షేమ పథకాలను వర్తింప జేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నిరుపేదలకు ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇవ్వడం, ఆ స్థాయికి వెలుపల ఉన్న మిగతా వారు బహిరంగ మార్కెట్లో రూ.40లకు కిలో బియ్యం కొనుక్కోవాల్సి రావడంలో ఏమాత్రం న్యాయం కనపడటం లేదు. ఏ సంక్షేమ పథకాల పరిధిలోకీ రాని వర్గాల ప్రజలకు కూడా సన్నబియ్యం కిలో రూ.10 నుండి రూ.15కు లభ్యమయ్యేట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారిపై భారం గణనీయంగా తగ్గుతుంది. ఒకవైపు సంక్షే మ పథకాలను అర్హులైన వారికే ఇవ్వడం ఎంతైనా సమంజసమే కానీ.. ప్రస్తుత సమాజ సంక్షోభం నేపథ్యంలో అటూ ఇటూ కాకుండా పోతున్న మధ్యతరగతి వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకో వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. - గర్నెపూడి వెంకటరత్నాకర్రావు విద్యారణ్యపురి, వరంగల్