Gateman
-
పూటుగా మద్యం తాగి గేట్‌మ్యాన్ నిద్ర.. ఆగిన రైలు
నంద్యాల రూరల్: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్ వద్ద కాపలా ఉన్న గేట్‌మ్యాన్ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్ వేయలేదని గమనించిన లోకోపైలెట్ రైలును ఆపి హారన్ మోగించారు. స్థానికులు రూమ్‌లో ఉన్న గేట్‌మ్యాన్‌ను నిద్రలేపారు. గేట్ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్‌మ్యాన్‌ను విచారించారు. అతడు మద్యం తాగాడని తెలుసుకుని విధుల నుంచి తొలగించారు. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ -
గేటు తెరవలేదని చేతులు నరికేశారు
న్యూఢిల్లీ: రైల్వే లెవెల్ క్రాస్ గేటును తెరవడానికి నిరాకరించాడని గుర్తు తెలియని వ్యక్తులు గేట్‌మన్ చేతులు నరికేసిన ఘటన ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని నరేలాలో చోటు చేసుకుంది. కుందన్పాఠక్ (28) అనే వ్యక్తి నరేలా–రత్దానా మధ్య 19వ నంబర్ రైల్వే గేట్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గేట్ తెరవాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఆ సమయంలో మూరి ఎక్స్‌ప్రెస్ వస్తున్నదని పాఠక్ గేట్ తెరిచేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముష్కరులు పాఠక్‌ను చావబాది చేతులను నరికివేశారు. ఈ దాడిలో పాఠక్ కాళ్లు, మెడకూడా దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావమైన అతడిని ఆస్పత్రికి తరలించారు. పాఠక్ చేతులకు శస్త్రచికిత్స జరుగుతోందని, కోలుకునే వరకు రైల్వే తరఫున అన్నివిధాలా సాయం అందిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. -
'మేనకా గాంధీ నన్ను కొట్టారు'
కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనను కొట్టారని ఓ ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన మేనక.. అడవుల్లో తరచూ మంటలు చెలరేగడంపై ఫారెస్టు అధికారుల్ని నిలదీశారు. స్థానిక రైతులు గోధుమ పంటల్ని తగలబెట్టడం వల్లే మంటలు అడవులకు వ్యాపిస్తున్నాయని చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న 57 ఏళ్ల కాపలాదారు రాంగోపాల్ వర్మ మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మాట్లాడుతుండగా మధ్యలో కలిగించుకున్న కాపలాదారుపై మంత్రి అంతెత్తున ఎగిరిపడ్డారు. 'అసలు అడవులు తగలబడటానికి కారణం నువ్వే' అంటూ చెంపపై ఒక్కటిచ్చారు. ఊహించని పరిణామానికి రాంగోపాల్ వర్మ బిత్తరపోయాడు. ఆ సమయంలో ఫారెస్టు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మేనకాగాంధీ తనపై దౌర్జన్యం చేశారని బాధితుడు పురాణ్పూర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కౌశలేంద్ర కుమార్ తెలిపారు.