Gattu Srikanth Reddy
-
జీహెచ్ఎంసీ ఎన్నికలకు వైఎస్సార్ సీపీ దూరం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టీఆర్ఎస్ గురువారం విడుదల చేసింది. 20 మందితో రెండో జాబితాను ప్రకటించింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 125 మంది టీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. చదవండి : గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. -
గ్రామ సచివాలయం నుంచే పరిపాలన
సాక్షి, గుంటూరు: తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఒకటి.. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో దేశానికి పూర్తి స్థాయి స్వతంత్రం లభించిగా.. రెండు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయనున్నారని తెలిపారు. రెండున్నర నెలల పాలనలో సీఎం జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా అభివృద్ధి: గట్టు శ్రీకాంత్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోటస్ పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. గట్టు శ్రీకాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించుకొని యావత్తు దేశం తమ వైపు చూసే విధంగా అభివృద్ధి చెందాలని కోరారు. -
‘ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ఓ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చంద్రబాబు మద్దతు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. దేశమంతా అమర జవాన్లకు సంఘీభావం చెబుతుంటే.. నువ్వు మాత్రం ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు చెబుతావా అంటూ మండిపడ్డారు. దేశ వ్యవహారాలలో బాధ్యతతో వ్యవహరించాలని చెప్పారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లాలో బాబు చర్యల వల్ల ఓ బీసీ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పోలీసుల చర్యల వల్ల కోటయ్య చనిపోయాడని కోటయ్య కుటుంబసభ్యులే చెబుతుంటే.. వైఎస్సార్ సీపీ కుల రాజకీయాలు చేస్తోందంటారా అంటూ మండిపడ్డారు. మీరు తప్పు చేస్తే భాద్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నించవద్దా?.. రైతును చంపండి, సైనికుడ్ని చంపండి ఇలా ఎవర్ని చంపినా ప్రశ్నించకుండా ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ రైతు చనిపోయినా, ఇక్కడ సైనికుడు చనిపోయినా మీరు డైరక్షన్ చేస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. సమాజం తలదించుకునేలా చింతమనేని మాట్లాడారని, అతని మాటలను కనీసం చంద్రబాబు ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ స్వార్థం కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవద్దని చంద్రబాబును కోరారు. -
జోగిపేటలో వైఎస్సార్సీపీ పాదయాత్ర
జోగిపేట(అందోల్): వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేస్తున్న పాదయాత్ర వెయ్యి కి.మీ పూర్తయిన సందర్భంగా ఆయనకు మద్దతుగా జోగిపేటలో సోమవారం అందోల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, మెదక్ జిల్లా అధ్యక్షుడు బి.సంజీవరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. మార్కెట్ యార్డు, బసవేశ్వర విగ్రహం, హనుమాన్ చౌరస్తా, అంబేడ్కర్ విగ్రహం మీదుగా అన్నాసాగర్ గ్రామ సమీపంలోని ముర్షద్ వరకు పాదయాత్ర కొనసాగింది. వైఎస్.జగన్ నాయకత్వం వర్థిల్లాలి, వైఎస్సార్ అమర్ రహే, వైఎస్సార్సీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు పాదయాత్రలో భాగంగా స్థానిక పబ్బతి హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నాసాగర్ దర్గాలో ప్రార్థనలు చేశారు. వైఎస్.జగన్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని వేడుకున్నారు. హనుమాన్ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టిన అనంతరం ముందుకు కదిలారు. వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని, దానికి ఆయన చేపడుతున్న పాదయాత్రలకు వస్తున్న ప్రజా స్పందనే సాక్ష్యంగా చెప్పవచ్చని మెదక్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బి.సంజీవరావు, రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు డీజీ మల్లయ్య యాదవ్ అన్నారు. ప్రజల ఆదరాభిమానాల మధ్య చేపడుతున్న పాదయాత్ర నేటికి వెయ్యి కి.మీకు చేరుకుందని చెప్పారు. రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పాదయాత్రలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో కూడా పార్టీ పటిష్టంగా తయారవుతోందన్నారు. దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయన్నారు. నియోజకవర్గంలో యువత పార్టీ వైపు బాగా ఆకిర్షతులవుతోందని అన్నారు. కార్యకర్తలు రాజకీయ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రసిడెంట్ బాగయ్య, మెదక్ జిల్లా యువత విభాగం అధ్యక్షుడు రాజేందర్, మండల శాఖ అ«ధ్యక్షుడు జీ.శంకర్, జోగిపేట పట్టణ అధ్యక్షుడు రాకేష్, సోషల్‌మీడియా ఇన్చార్జి పవన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీలు రమేశ్, పరిపూర్ణ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాండు, జిల్లా నాయకులు బుచ్చయ్య నవీన్, నరేష్, కార్తీక్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు. -
గడ్డాలు పెంచితే అభ్యర్థులు గెలుస్తారా..
⇒ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సర్వే పచ్చి బూటకం ⇒ వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, సూర్యాపేట: ‘ఆచరణకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టడం పోయి వారికి మద్దతుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 70 స్థానాలు ఎలా గెలుస్తుంది.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డాలు, మీసాలు పెంచినంత మాత్రాన అభ్య ర్థులు గెలువరు’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్ చేయించిన సర్వేలో రాష్ట్రంలో 70 స్థానాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం విడ్డూమన్నారు. ఆ సర్వే వట్టి బూటకం అని విమర్శించారు. మూడు నెలల క్రితం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సర్వే చేయించామని, దాంట్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలు గెలవడం కష్టమన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయ కులు తమ పార్టీ నుంచి ఒకొక్కరు వలసలు వెళ్తున్నా వారిని నిరోధిం చడంలో విఫలమయ్యారని విమ ర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ఆయన కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించారని కొనియాడారు. వైఎస్సార్ లాంటి నాయకుడు ప్రస్తుతం కాంగ్రెస్‌లో లేరన్నారు. వైఎస్ హయాం కాంగ్రెస్‌కు స్వర్ణయుగం లాంటిదని, ఆరోజులు ఇక రావని శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడూ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించకపోవడం శోచనీయ మన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్ రాక చదువులు మధ్యలోనే ఆపేస్తు న్నారని, ఆరోగ్యశ్రీ పథకానికి తిలోదకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నా ఏ నాయకుడూ నోరు మెదపడంలేదని పేర్కొ న్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్య దర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్లతో ఉత్తమ్ కుమ్మక్కు
మోడల్ కాలనీ పేరుతో కోట్లు దండుకున్నారు: గట్టు హుజూర్నగర్: పేదలకు నిలువ నీడ కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విడుదల చేస్తే నిర్మాణాలు చేపట్టకుండా కాంట్రాక్టర్లు కోట్లు దండుకున్నారని, వారితో స్థానిక ఎమ్మెల్యే, అప్పటి గృహ నిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నగర పంచాయతీ పరిధిలోని ఫణిగిరి గట్టు వద్ద ఉన్న మోడల్ కాలనీని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సుమారు రూ.100 కోట్లతో మోడల్ కాలనీలో 2,160 జి ప్లస్‌వన్ భవన నిర్మా ణాల పనులు ప్రారంభించారని చెప్పారు. అయితే నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వైఫల్యం వల్లే మోడల్ కాలనీ పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. తర్వా త అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాలనీని పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియో గం అవుతోందన్నారు. భవన నిర్మాణానికి రూ.5 లక్షల వ్యయాన్ని చూపి, భారీ అవి నీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మోడల్ కాలనీ నిర్మాణాలపై జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.