gaurd
-
చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..
జైలులోని ఖైదీలకు మంచి ఆహారం ఇవ్వరనే ఆరోపణలను వింటుంటాం. ఖైదీలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారని కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఇటీవల మిచిగన్‌లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆందోళన చెలరేగింది. ఇక్కడి సెయింట్ లూయీస్ ఫెసిలీటీలోని ఖైదీలు మంచి ఆహారం కోసం హడలెత్తించే పనిచేశారు. ఖైదీలంతా కలసి 70 ఏళ్ల గార్డును బంధించారు. తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు జైలును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ జైలులో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరు తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. వీటిని తక్షణం నెరవేర్చాలని కోరుతూ 70 ఏళ్ల గార్డును బంధించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపపద్యంలో జైలు ఉన్నతాధికారి డేల్ గ్లాస్ రాజీనామా చేశారు. ఇది కూడా చదవండి: అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా! -
స్టేట్ బ్యాంకు గార్డు నిజాయితీ
దొరికిన రూ.75 వేల నగదు బ్యాంకు అధికారులకు అప్పగింత గార్డు వెంకటరావు నిజాయితీ జి.సిగడాం : వాండ్రంగి స్టేట్‌బ్యాంకు గార్డు జి.వెంకటరావు తన నిజాయితీతో అందరి మన్ననలు పొందాడు. వివరాల్లోకి వెళ్తే...వాండ్రంగి సమీపంలోని ఎస్బీఐ ఏటీఎం గదిలో సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో పొందూరు మండలం మజ్జిలపేటకు చెందిన గురుగుబిల్లి ప్రసాదరావు తన ఇంటి నుంచి రూ.75వేలతో ఏటీఎంకు వచ్చి మరో రూ.25వేలు ఏటీఎం నుంచి తీసి మెుత్తం రూ.లక్ష ఒకరికి అప్పు తీర్చాలనుకున్నాడు. అయితే ఏటీఎం పనిచేయకపోవడంతో రూ.75 వేలు బ్యాగును మరచిపోయి...వేరే ఏటీఎంకు వెళ్లిపోయాడు. ఇంతలో స్టేట్‌బ్యాంకులో పని చేస్తున్న గార్డు జి.వెంకటరావు ఏటీఎం పరిశీలించేందుకు వచ్చి బ్యాగును గమనించాడు. వెంటనే బ్యాగును స్థానిక బ్యాంకు మేనేజర్ ప్రసాదరావు, సీఈవో సతీష్‌కు అందజేశారు. ఆ బ్యాగులో రూ.75 వేల నగదు ఉంది. బ్యాగులో ఉన్న సమాచారం మేరకు ప్రసాదరావుకు విషయాన్ని తెలియజేశారు. ఆయనకు ఆ బ్యాగుతో పాటు నగదు మెుత్తాన్ని అందజేశారు. ప్రసాదరావు పొందూరు మండలం కొల్లిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. గార్డు వెంకటరావు నిజాయితీకి మేనేజర్ ప్రసాదరావు, సీఈవో సతీష్, సర్పంచ్ బూరాడ వెంకటరమణ, మాజీ సర్పంచ్ సనపల త్రినాధరావు తదితరులు అభినందించారు.