Gazit notification
-
ఏపీఈఆర్సీకి మరిన్ని అధికారాలు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు డిస్కంలకు మార్గం సుగమం చేస్తూ మరో గెజిట్ ఇచ్చింది. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం విద్యుత్ చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో గెజిట్ రూపంలో వీటిని తెచ్చింది. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ నియమావళిని సవరించింది. ఈ నెల 21 నుంచే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు గల ఏపీఈఆర్సీకి ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏడాదికోసారి ఆదాయ, వ్యయాల నివేదిక (ఏఆర్ఆర్)లను సమర్పిస్తున్నాయి. ఆ నివేదికలపై బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మరుసటి ఏడాది విద్యుత్ చార్జీల (టారిఫ్) పెంపును మండలి నిర్ణయిస్తుంటుంది. డిస్కంలు మధ్యంతరంగా సమర్పించే ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలపై అవసరానికి అనుగుణంగా అనుమతులు జారీ చేస్తుంటుంది. విద్యుత్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంటుంది. కేంద్రం ఇచ్చిన తాజా గెజిట్ ప్రకారం విద్యుత్ కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆదాయ వ్యయాలు, రాయితీల గణాంకాలు వంటి నివేదికలను ప్రతి డిస్కం మూడు నెలలకోసారి ఏపీఈఆర్సీకి సమర్పించాలి. వీటిని విద్యుత్ నియంత్రణ మండలి క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాత నెల రోజుల్లోగా కేంద్రానికి పంపించాలి. అలాగే ఇప్పుడు చేస్తున్నట్లుగానే విద్యుత్ చార్జీల సవరణ ఆదేశాలు కూడా సకాలంలోనే చేయాలి. ఇందుకోసం డిస్కంలు సమరి్పంచే లెక్కలు వాస్తవమో కాదో తేల్చాల్సిన బాధ్యత మండలిపై ఉంటుంది. దీంతో ఏపీఈఆర్సీ మరింత అప్రమత్తంగా, కఠినంగానూ వ్యవహరించాల్సి ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
గెజిట్ నోటిఫికేషన్ ను అందరూ స్వాగతించాలి : జీవీఎల్
-
మాస్కు ధర రూ. 8, శానిటైజర్ ధర రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులను అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాధారణ మాస్కును ఎనిమిది రూపాయల ధరకు మించి అమ్మకూడదని పేర్కొంది. అదే విధంగా 200 మిల్లీ లీటర్ల శానిటైజర్ ధర వంద రూపాయలకు మించి అమ్మవద్దని.. అంతకు తక్కువ పరిమాణం ఉన్న బాటిల్‌ను సైతం అదే నిష్పత్తిలో అమ్మాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 నాటికి ఉన్న ధర మించకూడదని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది.(ఆ రాష్ట్రం దాదాపు 40శాతం మూతపడినట్లే!) ఐక్యంగా ఉన్నామని చాటేందుకే.. ప్రజల కోసమే ఆదివారం జనతా కర్ఫ్యూ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మనమంతా ఐక్యంగా ఉన్నామని చాటడానికి ఇది ఉపయోగపడుతుందని.. అంతా కలిసి మహమ్మారి కరోనాను ఎదుర్కొందామని పిలుపునిచ్చింది. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల ఆరోగ్యశాఖల కార్యదర్శులకు సూచనలు చేసినట్లు వెల్లడించింది. అయితే ప్రజలు కూడా సామాజిక దూరం పాటించి.. తమను తాము కాపాడుకోవాలని కోరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 111 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్న ఆరోగ్యశాఖ... ప్రైవేట్ రంగంలోని ల్యాబ్‌లకు అనుమతిపై సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రాల అవసరాల మేరకు ల్యాబ్‌ల పెంపుపై పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (కరోనా: 2 కోట్ల సబ్బులు ఉచితం, ధరల కోత) అదే విధంగా కరోనా వ్యాప్తి గురించి వదంతులు నమ్మి భయాందోళనకు గురికావద్దని కేంద్ర ఆర్థికశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎలాంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని.. అయితే అందరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎన్ 95 మాస్కులు ఆస్పత్రుల్లోనే ఉపయోగిస్తారని.. మాస్క్‌లకు సంబంధించి మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించింది. సాధారణ మాస్కులు ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా... విపత్తు నిర్వహణ నిధుల వినియోగంపై రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. (కరోనా అలర్ట్: ఆ రాష్ట్రంలో 65 కేసులు) -
ముహూర్తం..11:13
►దసరా రోజున ఇదే సమయంలో అన్ని కొత్త జిల్లాల ప్రారంభోత్సవం ► దాదాపు 300 ఉత్తర్వుల విడుదలకు ఏర్పాట్లు ► తొలుత కొత్త జిల్లాల ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ ► ఆ వెంటనే కలెక్టర్, ఎస్పీల నియామకాలు.. ► ఉద్యోగులకు ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులు ► 11.13 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ ► ఏర్పాట్లు చేసుకొనేందుకు అధికారులకు ముందుగానే మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజున అంటే ఈ నెల 11వ తేదీన ఉదయం 11.13 గంటలకు కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరుగనుంది. అన్ని జిల్లాల్లోనూ ఇదే సమయంలో ప్రారంభోత్సవం జరగాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దసరా పండుగ రోజే ఉత్తర్వులన్నీ జారీ చేయనుంది. ఆ రోజు ఉదయమే దాదాపు 300కు పైగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. తొలుత కొత్త జిల్లాల ఏర్పాటును ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఆ వెంటనే కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ అవుతాయి. తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా ఆర్డర్ టు సర్వ్ విధానంలో అధికారులను నియమిస్తారు. అయితే కొత్త జిల్లాలకు వెళ్లి తమ కార్యాలయాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం ముందుగానే మౌఖిక ఆదేశాలు జారీ చేయనుంది. మొత్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు, అన్ని శాఖల కార్యాలయాల ప్రారంభోత్సవాలను ఘనంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉదయం 11.13 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసు పరేడ్‌ను నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రులు, జిల్లాధికారులు తమకు నిర్దేశించిన జిల్లాల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. నమూనా ఉత్తర్వులు సిద్ధం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు ప్రభుత్వ ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ విధానంలో కేటాయించేందుకు జారీ చేయాల్సిన తాత్కాలిక ఉత్తర్వుల నమూనాను శనివారం సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసింది. ఆ నమూనాను అనుసరించి అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు ఈ నెల 11న కొత్త జిల్లాల్లో విధుల్లో చేరే విధంగా వారిని సంబంధిత అధికారులు తక్షణమే రిలీవ్ చేసేలా ఆదేశించాలని.. ఇందుకోసం శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన తుది ప్రకటన సిద్ధమయ్యాక ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు సంబురాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీ చేయనుంది. త్వరలో కొత్త పోస్టుల మంజూరు జిల్లా కలెక్టరేట్లు, కొత్త మండలాలకు తహసీల్దార్లు సహా వివిధ పోస్టులను మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. 119 మండలాలకు ఓఎస్డీలు, ఎంఈవోలు, వ్యవసాయాధికారుల పోస్టులను మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, విద్యా, వ్యవసాయ శాఖలు ఉత్తర్వులు జారీ చేయనున్నాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల ముసాయిదాలో 27 జిల్లాలను ప్రకటించగా.. అనంతరం వాటిని 31కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో అదనంగా పెరిగిన నాలుగు జిల్లాలకు కలెక్టర్, జేసీ, ఎస్పీ, అదనపు ఎస్పీ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయనుంది.