Gibraltar chess tournament
-
జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో హరికృష్ణకు ఐదో స్థానం
ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఐదో స్థానాన్ని సంపాదించాడు. గురువారం ముగిసిన ఈ టోర్నీలో హరికృష్ణ ‘మాస్టర్స్’ విభాగంలో 7.5 పాయింట్లు సాధించి మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... హరికృష్ణకు ఐదో స్థానం దక్కింది. భారత్‌కే చెందిన సేతురామన్ 4వ, అభిజిత్ గుప్తా 10వ, విదిత్ 18వ, లలిత్‌బాబు 30వ, సందీపన్ చందా 39వ, విశ్వనాథన్ ఆనంద్ 41వ స్థానాల్లో నిలిచారు. -
హరికృష్ణ గేమ్ డ్రా
జిబ్రాల్టర్: భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ... జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్లో తొలి డ్రా నమోదు చేశాడు. రోయిజ్ మైకేల్ (ఇజ్రాయిల్)తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 31 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు.. హు యిఫాన్ (చైనా)ల మధ్య జరిగిన గేమ్ కూడా 41 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. డానియెల్ సోరమ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్నూ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక డ్రాతో సరిపెట్టుకుంది. -
హరికృష్ణ మరో విజయం
జిబ్రాల్టర్: భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్లో రెండో విజయం సాధించాడు. గురువారం జరిగిన గేమ్‌లో హరి 52 ఎత్తుల్లో క్వాంటన్ డ్యూకర్మన్ (హాలండ్)పై విజయం సాధించాడు. ఎండ్ గేమ్‌లో ప్రత్యర్థి వద్ద అదనంగా ఒక పావు ఉన్నా...హరికృష్ణ తన అత్యుత్తమ ఆటతీరు కనబర్చి క్వాంటన్పై పైచేయి సాధించడం విశేషం. ఇతర మ్యాచ్‌లలో ఎంఆర్ లలిత్ బాబు, మార్తా బార్తల్ (పోలండ్)పై విజయం సాధించగా... ద్రోణవల్లి హారిక, హికరు నకముర (జపాన్) చేతిలో ఓడింది.