భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ... జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్‌లో తొలి డ్రా నమోదు చేశాడు.
జిబ్రాల్టర్: భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ... జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్‌లో తొలి డ్రా నమోదు చేశాడు. రోయిజ్ మైకేల్ (ఇజ్రాయిల్)తో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 31 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు.
గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు.. హు యిఫాన్ (చైనా)ల మధ్య జరిగిన గేమ్ కూడా 41 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. డానియెల్ సోరమ్ (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌నూ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక డ్రాతో సరిపెట్టుకుంది.