దళిత హక్కుల నేతపై భూఆక్రమణ కేసు
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిజ్జవరపు జయరాజుపై భూఆక్రమణ కేసు నమోదైంది. చాణక్యపురిలోని తన స్థలాన్ని జయరాజు ఆక్రమించారని బాలకృష్ణ అనే వ్యక్తి ఏలూరు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు జయరాజుపై శిక్షాస్మృతిలోని 447, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేస్తారన్న సమాచారం తెలియడంతో జయరాజు సరెండర్ పిటిషన్ తో జడ్జి ముందు లొంగిపోయారు. జయరాజుపై పలు భూకబ్జా ఆరోపణలున్నాయి.