ginger crop
-
ఎత్తు మడులపై అల్లం నాటారో.. ఇక లాభాలే!
సాధారణ బోదెలపైన అల్లం విత్తుకోవటం కన్నా వెడల్పాటి ఎత్తు మడులపై రెండు సాళ్లుగా నాటుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు మడులపై అల్లం సాగు వల్ల వేరుకుళ్లు వంటి తగుళ్ల సమస్య తీరిపోతుందని, కనీసం 30–40% అల్లం దిగుబడి పెరుగుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన రైతులతో పనిచేస్తున్న వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎస్. కిరణ్ తెలిపారు.సాధారణంగా రైతులు బోదెలు తోలి అల్లం విత్తుకుంటూ ఉంటారు. వర్షాలకు కొద్ది రోజులకే బోదె, కాలువ కలిసిపోయి నీరు నిలబడటం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా వేరుకుళ్లు వంటి తెగుళ్లు వస్తుంటాయి. నీటి ముంపు పరిస్థితుల్లో పంట దిగుబడి భారీగా దెబ్బతిని ఖర్చులు కూడా రాని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.ఈ సమస్యల నుంచి బయటపడి పంట విషలం కాకుండా మంచి దిగుబడి పొందాలంటే ఎత్తుమడులపై విత్తుకోవటమే మేలని వికాస సంస్థ పాడేరు, అరకు ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ తోడ్పాటుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత ఖరీఫ్ నాటికి రెండేళ్లలోనే 543 మంది రైతులకు విస్తరించిందని డా. కిరణ్ వివరించారు. అడుగు ఎత్తున, రెండు నుంచి రెండున్న అడుగుల వెడల్పుతో ఎత్తు మడులను పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి.రెండు వరుసలుగా అల్లం లేదా పసుపు విత్తుకోవచ్చు. అల్లం సాగులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. ఎత్తుమడులపై విత్తుకోవటం, మురుగునీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయటంతో పాటు ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం, 25 కిలోల వేపపిండి వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం (ఏటా 600 లీటర్లు) మొక్కల మొదళ్లలో పోస్తున్నారు. ఎకరానికి కనీసం 14–15 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారని డా. కిరణ్ వివరించారు.బోదెలు తోలి సాగు చేసే సాధారణ పద్ధతిలో సగటున ఎకరానికి 9–11 టన్నుల దిగుబడి వస్తుంటుందని, ఎత్తుమడుల పద్ధతిలో సగటున ఎకరానికి 5–6 టన్నులు అదనపు దిగుబడి వస్తోందన్నారు. ఎత్తుమడుల వల్ల కలుపు తీయటం సులభం అవుతుంది. పంట విఫలమై రైతు నష్టపోయే ప్రమాదం తప్పుతుంది. మైదానప్రాంతాల రైతులు కూడా ఎత్తు మడుల పద్ధతిని నిశ్చింతగా అనుసరించవచ్చని డా. కిరణ్ (98661 18877) భరోసా ఇస్తున్నారు.– డాక్టర్ కిరణ్13 నుంచి తిరుపతిలో సేంద్రియ ఎఫ్పిఓల మేళా..కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నాబార్డ్ సహకారంతో ఈ నెల 13,14,15 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం (టౌన్‌క్లబ్)లో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, ఎఫ్పిఓల మేళాను నిర్వహించనుంది. కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నెలకో సేంద్రియ సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.13 ఉ. 11 గంటలకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ సీజీఎం గో΄ాల్ మేళాను ప్రారంభిస్తారు. ΄ాత విత్తనాల ప్రదర్శన ఉంటుంది. 14న ఉదయం అమేయ కృషి వికాస కేంద్రం (భువనగిరి) వ్యవస్థాపకులు, ప్రముఖ రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి ఉద్యాన పంటల్లో గ్రాఫ్టింగ్‌పై శిక్షణ ఇస్తారు.15న ప్రకృతి చికిత్సా పద్ధతులపై నేలకొండపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా. కె. రామచంద్ర, ప్రకృతి సేద్యంపై గ్రామభారతి అధ్యక్షులు సూర్యకళ గుప్త, ప్రసిద్ధ అమృతాహార ప్రచారకులు ప్రకృతివనం ప్రసాద్, ఆరుతడి వరి సాగుపై ఆదర్శ రైతు శ్రీనివాస్ (గద్వాల్) వివరిస్తారు. ఇతర వివరాలకు 63036 06326. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ఇవి చదవండి: బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే! -
సేంద్రీయ పద్ధతిలో అల్లం సాగు..తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడి..!
-
అల్లం సాగుతో అద్భుత లాభాలు
-
అల్లం సాగు అదిరిపోయే లాభాలను పెంచుతుంది
-
అల్లం.. సస్యరక్షణతో మేలు
- తెగులు నివారిస్తే అధిక దిగుబడి - ఎనిమిది నెలల పంట - పెట్టుబడి అధికం - ఏడీఏ వినోద్‌కుమార్ సలహాలు, సూచనలు జహీరాబాద్ ప్రాంతంలో రైతులు అల్లం పంటను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సారవంతమైన ఎర్ర నేలల్లో అల్లం దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వ ఉండని నల్ల రేగడిలోనూ పండుతుంది. ఎనిమిది నెలలకు చేతి కొచ్చే ఈ పంట సాగుకు ఖర్చు అధికం. దిగుబడి కూడా అంతేస్థాయిలో ఉండడంతో రైతులు అల్లం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో సాగుచేస్తూ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని జహీరాబాద్ వ్యవసాయ శాఖ ఏడీ వినోద్‌కుమార్ (సెల్: 72888 24499) తెలిపారు. - జహీరాబాద్ టౌన్ విత్తన రకాలు: - అల్లంలో మారన్, మెదక్, సుపభ్ర, సురచి, సురభి, వైనాడ్, నదియా వంటి రకాలున్నాయి. - జహీరాబాద్ ప్రాంత నేలలకు మారన్ రకం అనుకూలం. - ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి విత్తనం సేకరించాలి. - విత్తనం పొడుగు 4.5 సె.మీ., 30 గ్రాముల బరువు రెండు నుంచి మూడు కన్నులండాలి. - 500 గ్రాముల ఎం 45 మందును తగినంత నీటిలో కలిపి అల్లం విత్తనం నానబెట్టాలి. - విత్తనం నుంచి చిన్న చిన్న మొలకలు మొలిచేంతవరకు అంటే రెండు రోజులపాటు ఆరబెట్టాలి. - ఎకరానికి 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. సాగు విధానం: - సారవంతమైన ఎర్ర, నల్ల రేగడి నేలలు అల్లం సాగుకు అనుకూలం. - పొలాన్ని లోతువరకు దున్ని దుక్కిచేసుకోవాలి. - ఎకరానికి 10 టన్నుల పశువుల (సేంద్రియ) ఎరువు, 300 నుంచి 500 కిలోల వేప పిండి, 200 గ్రాముల సింగల్ సూపర్ ఫాస్పేట్ 25 గ్రాముల మైక్రో న్యూట్రిన్స్ కలిపి తయారు చేసిన బెడ్‌పై వేయాలి. - బెడ్‌ను తడిగా చేసి ముందుగా సిద్ధం చేసుకున్న విత్తనం నాటాలి. - క్రమం తప్పకుండా నీటి తడులు పెడుతుండాలి. - డ్రిప్ విధానం చాలా మంచిది. యాజమాన్య పద్ధతులు: - విత్తనం నాటిన 25-40 రోజుల మధ్య 3 కిలోల అమోనియా సల్ఫేట్, 0.5 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్లను కలిపి డ్రిప్ పైపుల ద్వారా నీటిలో వదలాలి. - 40-100 రోజుల వ్యవధిలో 1.5 కిలోల యూరియా, 0.25 గ్రాముల పాస్పరిక్ యాసిడ్, ఒక గ్రాము మిరెట్ ఆఫ్ పొటాష్ కలిపి రెండు నెలల పాటు పంటకు అందించాలి. - 100-150 రోజుల వ్యవధిలో యూరియా 1.5 కిలోలు, కాల్షియం నైట్రేట్ 1 కి.గ్రా, మ్యారిట్ ఆఫ్ పొటాష్ లేదా సల్ఫేట్ 1.5 గ్రాములు కలిపి నీటి ద్వారా అందించాలి. - 150-180 రోజుల మధ్య మ్యారిట్ ఆఫ్ పొటాష్ ఒక గ్రాము వేయాలి. తెగులు నివారణ: రైజోమ్వాట్: ఈ తెగులు ఆశిస్తే మొక్క ఎండిపోతుంది. ఆకులు పసుపు రంగుగా మారుతాయి. ఈ తెగులు ఆశిస్తే మాటల్ ఎక్సిల్ 2 కి.గ్రా మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రైజోమాప్లే: ఈ తెగులు సోకితే అల్లం కుళ్లిపోతుంది. ఎకరానికి 4 కిలోల ఫ్లోరేడ్ గ్రానివల్స్ను వేయాలి. లీఫ్ బైట్: ఈ తెగుల కారణంగా ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించకుండా పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కార్బన్‌డిజమ్ కిలోను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అల్లం పంటలో అంతర పంటలు కూడా సాగుచేసుకోవచ్చు. ముఖ్యంగా మినుము, పెసర, మొక్కజొన్న తదితర పంటలు వేసుకోవచ్చు. మామిడి తోటల్లో కూడా అల్లం పంటను సాగుచేసుకోవచ్చు. -
అల్లం ఎండుతుందో.. పండుతుందో!
ఈసారి తాను ఫాంహౌస్‌లో బాగా సంపాదించగలనో లేదో తనకే తెలియని పరిస్థితి ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో.. కేసీఆర్ తన ఫాంహౌస్‌లో బంగారం పండిస్తున్నారని, ఆయన లాగే తెలంగాణ రైతులందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు కావాలంటూ పలువురు ప్రతిపక్షాల సభ్యులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను ఫాంహౌస్‌లో వేసిన అల్లం పంట విషయాన్ని సీఎం కేసీఆర్.. బుధవారం నాడు తాను ఇచ్చిన సమాధానంలో ప్రస్తావించారు. తాను ఈసారి 30-40 ఎకరాల్లో అల్లం పంట వేశానని, అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నందువల్ల తాను వేసిన అల్లం పండుతుందో, ఎండుతుందో తనకే తెలియదని ఆయన చెప్పారు. కేసీఆర్ మంచి టోపీ పెట్టుకుని అందంగా కనపడతారని, రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో ప్రతిరైతు ఆయనలాగే సంపాదించి, టోపీలు పెట్టుకుని అందంగా కనపడాలని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.