‘గురుకులం’లోకి గుర్తు తెలియని యువకుడు
జోగిపేట, న్యూస్‌లైన్: మద్యం మత్తులో అర్ధరాత్రి ఓ యువకుడు స్థానిక బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో చొరబడి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివా రం అర్ధరాత్రి ఒంటి గంటల ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు పాఠశాలలోని ఒకటవ అంతస్తులో ఎనిమిదో తరగతి విద్యార్థినులు ఉండే గదిలోకి ప్రవేశించాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన విద్యార్థినులు పలువురు అలాగే పడుకున్నారు. అయితే సదరు యువకుడు గదిలోని లైట్లు వేయడం.. ఆర్పేయడంతో చేశారు. దీంతో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. గుర్తు తెలియ ని యువకుడు మౌనిక అనే అమ్మాయి కాళ్ల వద్ద పడకున్నాడు. దీంతో గదిలోని విద్యార్థినులు ఒక్కసారిగా అరుస్తూ బయటకు వచ్చేశారు. ఈ కేకలకు యువకుడు బయటకు పారిపోయాడు. దీంతో విషయాన్ని విద్యార్థినులు వాచ్‌మన్ నరసింహులకు తెలియజేశారు. ఆ రాత్రం తా విద్యార్థునులు జాగరణ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు : ప్రిన్సిపాల్
ఆదివారం అర్ధరాత్రి పాఠశాలలో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కే మాధురీ దేవి తెలిపారు. పాఠశాల అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్ వద్ద పనిచేసే డ్రైవర్‌గా తాము అనుమానిస్తున్నామన్నారు. పాఠశాల పరిసరాల్లో రాత్రిళ్లు పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులను కోరినట్లు ఆమె తెలిపారు.
పాఠశాలను సందర్శించిన తహ శీల్దారు, ఎస్ఐ
సంఘటన వివరాలను తెలుసుకునేం దుకు అందోల్ తహశీల్దారు సీహెచ్ కృష్ణ య్య, ఎస్ఐ వై రవీందర్‌లు సోమవారం పాఠశాలను సందర్శించారు. సంఘటన వివరాలను విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌ల ను అడిగి తెలుసుకున్నారు. అనుమాని తునిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని ఎస్ఐ తెలిపారు.