Glamorous actress
-
వైల్డ్ ఫైర్‌లా 'జాతిరత్నాలు' చిట్టి అందాల జాతర (ఫొటోలు)
-
శ్రీలీల బాత్రూం స్టిల్స్.. గ్లామర్ డోస్ పెంచేసింది! (ఫొటోలు)
-
‘నన్నింకా గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారు’
చెన్నై: కోలీవుడ్‌లో తననింకా గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారని హీరోయిన్ నికీషా పటేల్ వాపోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది భామ ఆ చిత్రం పెద్దగా ఆడక పోవడంతో చాలా నిరాశకు గురైందనే చెప్పాలి. అయితే ఆ తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి నారదన్, కడయోరం లాంటి కొన్ని చిత్రాలలో నటించినా ఆ చిత్రాలు ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పారు. అప్పటి నుంచి గోల్డెన్ ఛాన్స్‌కోసం నికీషా పటేల్ పోరాడుతూనే ఉంది. గత ఏడాది ఒకటి రెండు చిత్రాలలో నికిషా నటించినప్పటికీ ఆ చిత్రాలు ఏవీ విడుదల కాలేదు. తాజాగా 7 నాట్కళ్ అనే తమిళ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్న నికీషా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఉంది. ‘నిజమే, ఈ ఏడాది నేను నటించిన ఒక్క చిత్రం తెరపైకి రాలేదు. అలాగని ఖాళీగా కూర్చున్నానని అనుకోరాదు. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగానే ఉన్నాను. శక్తి పి.వాసుకు జంటగా నటించిన 7 నాట్కళ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. ఇందులో శక్తి పి.వాసు చాలా డిఫరెంట్‌గా కనిసిస్తారు. క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాకు, శక్తి పీ.వాసులకు మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఇకపోతే కోలీవుడ్‌లో నన్నింకా గ్లామరస్ నటిగానే చూస్తున్నారు. అయితే తెలుగులో కొన్ని నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటున్నాను. ఇక్కడ గ్లామర్ ఇమేజ్ను బ్రేక్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతం మాలీవుడ్ తరహాలో కోలీవుడ్‌లో కూడా చాలా రియలిస్టిక్ కథా చిత్రాలు వస్తున్నాయి. ఇక తెలుగులో షరా మామూలుగానే కమర్షియల్ కథా చిత్రాలే అధికంగా వస్తున్నాయి.’ అని పేర్కొంది. నికీషా పటేల్ ప్రస్తుతం మలయాళ చిత్రం 100 డిగ్రీ సెల్సియస్ తమిళ రీమేక్‌లోనూ, ఓ తెలుగు చిత్రంలో పాటు ఒక ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. -
నన్ను ఎవరూ అలా చేయలేరు!
చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకూ ఎదిగిన రకుల్‌ప్రీత్‌సింగ్ ఇప్పుడక్కడ టాప్ హీరోయిన్గా ఎదిగింది. దీంతో కోలీవుడ్‌లోనూ స్టార్ హీరోల చిత్రాలు వరిస్తున్నాయి. త్వరలో కార్తీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ భామను గ్లామరస్ పాత్రలో నటించాలని కొందరు దర్శక నిర్మాతలు అడుగుతున్నారట. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్ ఏమంటున్నారో చూద్దాం. నన్నెవరూ గ్లామరస్ నటిగా మార్చలేరు. ఇంతకు ముందు గ్లామరస్‌గా నటించారుగా అంటున్నారు. నిజమే మొదట్లో అందాలారబోశాను. అప్పట్లో నాకు నటిగా పరిపక్వత లేదు. ఎలాగైనా మార్కెట్‌ను సంపాదించుకోవాలన్న ధ్యేయంతో అలాంటి పాత్రల్లో నటించాను. ఇప్పుడు నేను ప్రముఖ నటిగా ఎదిగాను. ఇక స్కిన్ షోలతో నా స్థాయిని నిలబెట్టుకోవాలనుకోవడం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి పాత్రలే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. కమర్షియల్ కథా చిత్రాలైనా నా పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అదే విధంగా అధిక పారితోషకానికి ఆశపడి అందాలారబోత పాత్రల్లో నటించను. పది కాలాల పాటు గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నాను. హిందీ నటి కరీనాకపూర్ పాత్రల తరహాలో నటించి నటిగా రాణించాలన్నదే నా లక్ష్యం.