నన్ను ఎవరూ అలా చేయలేరు! | Rakul Preet Singh first phase only act to Glamorous roles | Sakshi
Sakshi News home page

నన్ను ఎవరూ అలా చేయలేరు!

Published Wed, Mar 22 2017 1:08 AM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

నన్ను ఎవరూ అలా చేయలేరు!

నన్ను ఎవరూ అలా చేయలేరు!

చిన్న చిత్రాల నుంచి భారీ చిత్రాల వరకూ ఎదిగిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇప్పుడక్కడ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోల చిత్రాలు వరిస్తున్నాయి. త్వరలో కార్తీతో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది. ఈ భామను గ్లామరస్‌ పాత్రలో నటించాలని కొందరు దర్శక నిర్మాతలు అడుగుతున్నారట. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఏమంటున్నారో చూద్దాం. నన్నెవరూ గ్లామరస్‌ నటిగా మార్చలేరు. ఇంతకు ముందు గ్లామరస్‌గా నటించారుగా అంటున్నారు. నిజమే మొదట్లో అందాలారబోశాను. అప్పట్లో నాకు నటిగా పరిపక్వత లేదు. ఎలాగైనా మార్కెట్‌ను సంపాదించుకోవాలన్న ధ్యేయంతో అలాంటి పాత్రల్లో నటించాను. ఇప్పుడు నేను ప్రముఖ నటిగా ఎదిగాను.

ఇక స్కిన్‌ షోలతో నా స్థాయిని నిలబెట్టుకోవాలనుకోవడం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అలాంటి పాత్రలే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. కమర్షియల్‌ కథా చిత్రాలైనా నా పాత్రలకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అదే విధంగా అధిక పారితోషకానికి ఆశపడి అందాలారబోత పాత్రల్లో నటించను. పది కాలాల పాటు గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలని ఆశపడుతున్నాను. హిందీ నటి కరీనాకపూర్‌ పాత్రల తరహాలో నటించి నటిగా రాణించాలన్నదే నా లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement