global financial institutions
-
ఫారిన్ కంపెనీలన్నీ ఇక్కడే స్టోర్ చేయాలి!
న్యూఢిల్లీ : స్థానికంగా డేటా స్టోర్ చేయాలంటూ... అంతర్జాతీయ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తుది గడువును ఇంకా పొడిగించే లేదంటూ కూడా ఆర్బీఐ తేల్చేసింది. ఇప్పటికే డేటాను స్థానికంగా స్టోర్ చేసుకునేందుకు కంపెనీలకు ఆరు నెలల సమయం ఇచ్చినట్టు ఆర్బీఐ సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతో నేటి నుంచే ఈ స్థానిక స్టోరేజ్ నిబంధనలను విదేశీ కంపెనీలు పాటించాల్సి వస్తోంది. అంటే గ్లోబల్ ఫైనాన్సియల్ టెక్నాలజీ కంపెనీలన్నీ దేశీయ కస్టమర్ల లావాదేవీల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలి. తుది గడువును పొడిగించాలని కోరుతూ... వీసా, మాస్టర్‌కార్డు, పేపాల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని ఈ నెల ప్రారంభంలో కలిశారు. కానీ అప్పటికే ఆరు నెలల సమయమిచ్చిన ఆర్బీఐ, ఇక పొడిగింపు ఇవ్వనని చెప్పింది. వాట్సాప్ తాము ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలను పాటిస్తున్నట్టు పేర్కొంటోంది. భారత్‌లో పేమెంట్ సంబంధిత డేటాను స్టోర్ చేసే సిస్టమ్‌ను రూపొందించినట్టు ఈ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం వాట్సాప్‌కు భారత్‌లో 200 మిలియన్ మంది యూజర్లున్నారు. మెసేజింగ్ మాధ్యమంగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ, దేశీయ పేమెంట్ రంగంలో తనదైన ముద్ర వేసుకునేందుకు పేమెంట్స్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. దేశీయ కంపెనీలు ఆర్బీఐ మార్గదర్శకాలను స్వాగతిస్తున్నాయి. అయితే గ్లోబల్ కంపెనీలు మాత్రం ఆర్బీఐ మార్గదర్శకాలపై కాస్త అసంతృప్తిగానే ఉన్నాయి. స్థానిక సర్వర్లను ఇప్పడికప్పుడు ఏర్పాటు చేయడం అంటే ఖర్చుతో కూడుకున్న పని అంటూ గ్లోబల్ కంపెనీలు భయపడుతున్నాయి. ఖర్చుల పెరుగుదలను నివారించేందుకు భారత్‌లో ఒరిజినల్ డేటాకు బదులు, మిర్రర్ డేటాను అందిస్తామని గ్లోబల్ కంపెనీలు ఇటీవల ఆర్బీఐతో జరిపిన సమావేశంలో చెప్పాయి. అయితే ఆ ప్రతిపాదనకు ఆర్బీఐ ఒప్పుకోలేదు. కచ్చితంగా డేటాను ఎండ్-టూ-ఎండ్ లావాదేవీగా అందించాలని ఆదేశించింది. పేమెంట్ ఇన్స్ట్రక్షన్ మేరకే సమాచారాన్ని సేకరించడం, ప్రాసెస్ చేయడం జరుపాలని తెలిపింది. -
ప్రపంచ ఆర్థిక సంస్థలు..భారత్ కృషిని గుర్తించడంలేదు
• ఆర్థిక సంస్కరణలపై అరుణ్‌జైట్లీ విశ్లేషణ • ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కృషి, ఫలితాలను ప్రపంచ ఆర్థిక సంస్థలు పూర్తిగా గుర్తించడం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. దేశంలో వ్యాపార కార్యకలాపాల మెరుగుదలకు భారత్ గడచిన రెండున్నర సంవత్సరాల్లో పలు చర్యలు తీసుకుందని తెలిపారు. ఎకనమిక్ ఎడిటర్స్ సదస్సును ఉద్దేశించి గురువారం ఇక్కడ ఆర్థికమంత్రి ప్రసంగించారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేకపోరుునా, ఆయా సవాళ్లను ఎదుర్కొని భారత్ పనిచేస్తోందని వివరించారు. ‘‘ఆర్థికవృద్ధి బాటలో ఎన్నో చర్యలు తీసుకున్నాం. అరుుతే చేస్తున్న కృషికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల నుంచి పూర్తి స్థారుు గుర్తింపు లభించడం లేదు’’ అని జైట్లీ అన్నారు. ఎటువంటి ఇబ్బందులూ లేని వ్యాపార నిర్వహణ విషయమై భారత్‌కు అంతర్జాతీయ బిజినెస్ ఇండెక్స్‌లో ప్రపంచబ్యాంక్ 130వ స్థానాన్ని ఇవ్వడం, వచ్చే రెండేళ్లూ భారత్ రేటింగ్‌ను పెంచేది లేదని గ్లోబల్ రేటింగ్ సంస్థ- స్టాండెర్డ్ అండ్ పూర్ (ఎస్అండ్పీ) స్పష్టం చేయడం నేపథ్యంలో జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తు తం ఎస్అండ్పీ లాంగ్‌టర్మ్‌కు సంబంధించి ‘బీబీబీ-’ రేటింగ్ ఇస్తుండగా, షార్ట్ టర్మ్‌గా ‘ఏ-3’ సావరిన్ క్రెడిట్ రేటింగ్ ఇస్తోంది. ఇక మరో అంతర్జాతీయ ఆర్థిక రేటింగ్ దిగ్గజం- మూడీస్ కూడా వచ్చే రెండేళ్లలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి విముఖత వ్యక్తం చేసింది. జైట్లీ ఇంకేమన్నారంటే... ⇔ 2014 మేలో అధికారంలోకి రావడంతో మోదీ ప్రభుత్వం తొలుత దృష్టి పెట్టిన అంశం- నిర్ణయ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడం. తగిన సమయంలో అవసరమైన నిర్ణయాలను తీసుకోడానికి కేంద్రం ఎన్నడూ వెనకాడలేదు. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుంది. ⇔ వస్తు సేవల పన్ను (జీఎస్టీ), దివాలా చట్ట సంస్కరణలు, సరళతర వ్యాపార నిర్వహణకు తగిన నిబంధనల సరళీకరణ వంటి అంశాలు ప్రభుత్వం తీసుకున్న చొరవల్లో కొన్ని. ట్రంప్‌పై ఇలా...: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయంపై అడిగిన ఒక ప్రశ్నకు జైట్లీ సమాధానం చెబుతూ, ‘‘ఒక పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన ఒక తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించి తీరాల్సిందే’’ అని అన్నారు. డిజిటల్ లాకర్స్‌పై వార్తలు సరికావు... ప్రభుత్వ తదుపరి చర్య బ్యాంక్ లాకర్ల డిజిటలైజేషన్ అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తోసిపుచ్చారు. ఇందులో ఎటువంటి నిజం లేదని అన్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలోనే బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసేలా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జైట్లీ ఒక వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరణ ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డంలో భాగంగా గురువారం రాత్రి నుంచే అన్ని ఏటీఎంల సేవల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.