goa tourists
-
అతిథి దేవోభవ మరిచారా మంత్రిగారూ?
పణజి : చిన్నప్పుడు అతిథి దేవోభవా అంటూ మాష్టారు నేర్పించిన పాఠాలను గోవా మినిస్టర్ మరిచిపోయినట్లున్నారు. అందుకేనేమో గోవాకు వచ్చే టూరిస్టులపై వివాదాస్పద ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్టు బయట నిద్రపోతున్న ప్రయాణికులను ఉద్దేశిస్తూ ఇలాంటి చీప్ టూరిస్టులు గోవాకు అవసరమా? మనకు ‘నాణ్యమైన’ వారు కావాలి. బ్రాండ్ గోవా ఇంత చీప్‌గా రాజీపడదని గోవా ఫార్వర్డ్ పార్టీ ఉపాధ్యక్షుడు కూడా అయిన దుర్గాదాస్ కమత్ గోవా ఎయిర్‌పోర్టు బయట బేస్మెంట్పై నిద్రిస్తున్న ప్రయాణికులను ఉద్దేశిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ‘ఒకసారి గోవా ఎయిర్‌పోర్టును చూడండి? ఇలాంటి చీప్ టూరిస్టులు మనకు అవసరమా? గోవా విమానాశ్రయం దీనిపై చర్య తీసుకోవాలి. గోవాను సందర్శించడానికి మాకు ఇలాంటి ధూళి, దుమ్ము అవసరం లేదు. మాకు నాణ్యమైన పర్యాటకులు కావాలి, వారే గోవా అందాలను ఆస్వాదిస్తారు. బ్రాండ్ గోవా ఏ ధరకైనా రాజీ పడదు’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ఫోటోలో నిద్రిస్తున్న వారు పొద్దునే బయలుదేరే విమాన ప్రయాణికులు. ఎయిర్‌పోర్టులో సరైన సదుపాయాలు లేకపోవడంతో పాపం ఇలా బేస్‌మెంట్‌పైనే పడుకున్నారు. దుర్గాదాస్ ట్వీట్‌పై నెటిజనులు మండిపడ్డారు. మీకు గెస్ట్‌లు ధూళిలాగా కనిపిస్తున్నారా?. బ్రాండ్ గోవా అని మాట్లాడేకన్నా ముందు ఎయిర్‌పోర్టులో సరైన సౌకర్యాలు కల్పించండని ఒకరు ట్వీట్ చేయగా, ముందు గోవాకు ఆదాయం తీసుకొచ్చే టూరిస్టులను విమర్శించడం మానేసి బ్రాండ్ గోవా అని మీరు చెప్తున్న గోవాలో మాఫియాను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని మరొకరు ట్వీట్ చేశారు. ఇక మరో ట్విటర్ కాస్తా ఘాటుగా స్పందించాడు. గోవా గోవా వారికోసమే అనేది వారి పార్టీ సిద్ధాంతమని, భారతదేశంలో ఎక్కడికైనా ప్రయాణించే హక్కు రాజ్యాంగం మనకు ప్రసాదించిందని, ఇలాంటి వేర్పాటువాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చాడు. -
గోవా పర్యాటకులకు చేదు వార్త
సాక్షి, గోవా: చాలా మంది చాలాసార్లు గోవాకు వెళ్లాలని అనుకొని ఉంటారు. ఎంజాయ్ చేయడానికి, సరదగా, జాలీ ట్రిప్‌గా గోవానే ఎక్కువ మంది ఎంచుకుంటారు. ఇంక యువత సంగతి అయితే సరేసరి. బీచ్‌లో రెండు పెగ్‌లు వేసి సరదాగా తిరగాలి అనుకుంటారు. చాలా మంది వెళ్లేది కూడా బీచ్ లు చూడ్డానికి, నాలుగు గుక్కలు ముందు వేసుకోవడానికే. అందుకే సెలవులొస్తే చాలా మంది గోవా వెళ్లాలనుకుంటారు. అయితే, ఇపుడు గోవాలో ఆస్వేచ్ఛను అదుపుచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తరచూ పర్యాటకులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తీసుకోవడం కుదరదని రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా రోడ్ల మీద మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని, మద్యం షాపుల లైసెన్సులను కూడా రద్దు చేస్తామని సీఎం ప్రకటించారు. రోడ్లపక్కన కూర్చొని మద్యం తాగి, బాటిళ్లను పగలగొట్టి కొంతమంది పర్యాటకుల్లో అభద్రతా భావం సృష్టిస్తున్నందున నిషేధం విధిస్తున్నామని పారికర్ తెలిపారు. గత ఏడాది నుంచే బీచ్‌లోని కొన్ని ప్రదేశాలను ‘నో ఆల్కాహాల్ జోన్’ లుగా ప్రకటించారు. గోవా అంటేనే బీచ్, కెసినోలకు సుప్రసిద్ధం. గోవాకు పర్యాటకులు పెద్ద ఎత్తున రావడానికి కారణం ఎక్కడ పడితే అక్కడ బార్లు, పబ్‌లు, మద్యం దుకాణాలు. తాజాగా ముఖ్యమంత్రి నిర్ణయం గోవా పర్యాటకులను నిరుత్సాహ పరుస్తోంది. అంతేకాకుండా మద్య వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుందని వ్యాపారులు వాపోతున్నారు. ఇక ముందు గోవాలో మద్యం తాగాలంటే లోపలెక్కడో నాలుగు గోడల మధ్యే తాగాలి. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత బీచ్‌లో ఈత కొట్టకూడదనే కొత్త నియమాన్ని తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయిని సమాచారం.