goats died
-
చిరుత దాడిలో రెండు మేకలు మృతి
పెంబి(ఖానాపూర్): నిర్మల్ జిల్లా తాండ్ర రేంజ్ పరిధిలోని పస్పుల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల మందపై చిరుత దాడిచేసి రెండు మేకలను హతమార్చింది. పెంబి మండలం హరిచంద్‌తండాకు చెందిన పశువుల కాపరి టేకం రాజేశ్ బుధవారం మేకల మందతో పస్పుల అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మందపై చిరుత దాడి చేసింది. రాజేశ్ కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అటవీ సిబ్బందికి సమాచారం అందించగా ఎఫ్ఎస్వో ప్రభాకర్, ఎఫ్‌బీవో నరేశ్, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి జీవాల కళేబరాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుత దాడిచేసిన ప్రాంతంలో అటవీ సిబ్బంది సీసీ కెమెరాలను బిగించారు. వాటిని గురువారం పరిశీలించగా, మేకల కళేబరాలను చిరుత ఎత్తుకెళ్లినట్లు నమోదైంది. -
80 మేకలు సజీవ దహనం
ఆమనగల్లు : ఆమనగల్లు మండలం రాంనుంతల గ్రామ పరిధిలోని చిన్నతండాలో బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు మేకలదొడ్డికి నిప్పంటుకోవడంతో దొడ్డిలో ఉన్న 80 మేకలు సజీవ దహనమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. చిన్నతండాకు చెందిన పాత్లావత్ గోప్యానాయక్ వ్యవసాయ భూమి లేకపోవడంతో మేకల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి మేకలను మేపి చిన్నతండా సమీపంలోని వాగు వద్ద ఉన్న మేకల దొడ్డిలో ఉంచి ఇంటికొచ్చాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు దొడ్డికి నిప్పంటుకోవడంతో అందులో ఉన్న 80 మేకలు సజీవదహనం అయ్యాయి. మంటలకు తాళలేక మేకలన్నీ ఒకదానిపై ఒకటి పడి కాలిన తీరు చూసి పలువురు రైతులు కంటతడి పెట్టారు. మేకల పెంపకం ఆధారంగా జీవిస్తున్న గోప్యానాయక్ కుటుంబం మేకల మృతితో వీధిన పడినట్లు అయ్యింది. విషయం తెలియడంతో గురువారం ఉదయం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి, ఆమనగల్లు జెడ్పీటీసీ సభ్యులు కండె హరిప్రసాద్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోప్యానాయక్‌ను పరామర్శించి వ్యక్తిగతంగా కొంత ఆర్థికసాయం అందించారు. సంఘటనా స్థలాన్ని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పత్యానాయక్, ఎంపీటీసీ సభ్యురాలు వల్లి పంతునాయక్, సర్పంచ్ శ్వేతాఆనంద్‌నాయక్, మాజీ సర్పంచ్‌లు శ్రీరాములు, హుమ్లానాయక్, కడ్తాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, ఆమనగల్లు ఎస్సై మల్లీశ్వర్‌లు పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు గోప్యానాయక్ కోరుతున్నారు. -
15 ఇళ్లు దగ్ధం...70 మేకలు సజీవదహనం
సాక్షి, విజయనగరం: భోగాపురం పంచాయతీ వనుంపేటలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 15 ఇళ్లు దగ్ధం కాగా, మంటల్లో చిక్కుకుని 70 మేకలు సజీవదహనమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ అస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ తీగలు తెగిపడి 25 గొర్రెల మృతి
కోడుమూరు(కర్నూలు): విద్యుత్ తీగలు తెగిపడి 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో జరిగింది. బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామ శివారులోని పంటపోలాల్లో ఉన్న 11 కెవీ విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో అక్కడ గొర్రెలు ఉండటంతో.. ఎర్త్ అయి విద్యుదాఘాతానికి గురై 25 గొర్రెలు మృతిచెందాయి. -
షార్ట్‌సర్కూట్‌తో మేకలు మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని బిందితాండాలో గిరికొండ శంకర్‌కు చెందిన ఒక బోద కొట్టం షార్ట్‌సర్కూట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో కొట్టం పూర్తిగా దగ్ధమైంది. దీంతో అందులోని మూడు మేకలూ అక్కడికక్కడే మృతిచెందాయి. (ఇంద్రవెల్లి)