goes missing
-
టికెట్ నిరాకరణ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం
మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
అర్ధరాత్రి అదృశ్యమైన రుద్రవరం ఎస్ఐ
సాక్షి, ఆళ్లగడ్డ : రుద్రవరం పోలీస్‌స్టేషన్ ఎస్ఐ విష్ణునారాయణ శనివారం అర్ధరాత్రి అదృశ్యమయ్యారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఆళ్లగడ్డ డీఎస్పీ పోతురాజు ఎదుట హాజరయ్యారు. దీంతో జిల్లా పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రుద్రవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ కేసు విషయంలో ఎస్ఐ విష్ణునారాయణను, శిరివెళ్ల సీఐ విక్రమసింహను మూడు రోజుల క్రితం.. జిల్లా ఎస్పీ కర్నూలుకు పిలిపించారు. రెండు రోజులు కార్యాలయంలో ఉండాలని ఆదేశించారు. దీంతో మనస్తాపం చెందిన ఎస్ఐ.. శనివారం రాత్రి రుద్రవరం చేరుకుని పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో ‘ ఈ మెస్సేజ్ చదివే సమయానికి నేను బతకవచ్చు.. లేక చనిపోవచ్చు.. దయచేసి నన్ను చెడుగా అనుకోవద్దు’అని మెస్సేజ్ పెట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆళ్లగడ్డ డీఎస్పీని అప్రమత్తం చేయడంతో ఆయన, ఆళ్లగడ్డ సీఐ రమణ, శిరివెళ్ల సీఐ విక్రసింహ, అందుబాటులో ఉన్న ఎస్ఐలు రుద్రవరానికి వెళ్లి..ఎస్ఐ విష్ణునారాయణకు నచ్చజెప్పారు. ఆయనకు ముఖ్యుడైన మరో ఎస్ఐని అక్కడే ఉంచి వచ్చారు. అయితే రాత్రి ఇంటికి వెళ్లిన విష్ణు నారాయణ తన సరీ్వస్ రివాల్వర్‌తో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు వారించారు. తెల్లవారు జామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. సెల్‌ఫోన్‌కూడా స్విచ్ఛాప్ కావడంతో ఆందోళన చెందారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారుల దృష్టికి తీసుకు పోవడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సమయానికి ఆయన నడుపుతున్న కారు చాగలమర్రి టోల్‌గేట్‌లోనుంచి కడప వైపు వెళ్లిందని సమాచారం వచ్చింది. అయినప్పటికీ ఎక్కడకు వెళ్లాడు.. ఏం చేసుకున్నాడో అని ఆందోళన చెందుతున్న సమయంలో ఆదివారం సాయంత్రం సెల్‌ఆన్ కావడంతో ఫోన్ చేసి మాట్లాడారు. మనసు బాగాలేక బ్రహ్మంగారి మఠం వెళ్లానని చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్పీ కార్యాలయం చేరుకున్న ఎస్ఐ విష్ణు నారాయణ మాట్లాడుతూ.. కుటుంబ సమస్యలు, పని ఒత్తిడిని తట్టుకోలేక మానసిక ప్రశాంతత కోసం తమ స్వగ్రామమైన వైఎస్సార్ జిల్లా తొండూరు మండలం సంతకొవ్వూరుకు వెళ్లానని చెప్పారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జరిగిన విషయంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
అజ్ఞాతంలోకి మహ్మద్ షమీ!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని భార్య హాసిన్ జహాన్ షమీ వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, చంపడానికి ప్రయత్నించాడని, మానసికంగా ఎంతో వేధించినట్లు ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు గృహహింస, అత్యాచారం, హత్యాయత్నం కింద్ర షమీ, అతని కుటుంబ సభ్యులపై శుక్రవారం కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు అనంతరం ఈ స్టార్ క్రికెటర్ అందుబాటులో లేకుండా పోయాడు. షమీ తన మొబైల్ ఫోన్ స్విచ్చ్ ఆఫ్ చేసుకోని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని మొబైల్ లోకెషన్ ప్రకారం చివరి సారిగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అతని సోదరుడితో ఘజియాబాద్ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో కొందరు కోల్‌కతాలోని తన భార్య కుటింబీకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. షమీ మాత్రం మీడియాకు దూరంగా ఉండమని తన కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షమీ, అతని సోదరుడు ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. -
హెచ్ సీయూ విద్యార్థి అదృశ్యం
హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం ఇటీవలే కాస్త చల్లబడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సీయూ)లో మరో విద్యార్థి అదృశ్యం కలకలకం రేపుతోంది. పీహెచ్ డీ చదువుతోన్న డి. సురేశ్ జోసెఫ్(28) కొద్ది రోజులుగా కనిపించకుండాపోవడం విద్యార్థులతోపాటు అధికారులను కలవరపెడుతోంది. ఇదే విషయమై వర్సిటీ అధికారులు గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. తప్పిపోయిన విద్యార్థి సురేశ్ జోసెఫ్ కేరళకు చెందినవాడని, కొద్దికాలంగా అతడి మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని హెచ్ సీయూ సీఎంఓ రవీంద్ర కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేపట్టారు. -
షీనా కేసులో కీలక ఆధారాలు మాయం!
సంచలనం రేపుతున్న షీనా బోరా హత్య కేసులో గంట గంటకూ కొత్త విషయాలు బయటికొస్తున్నాయి. కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న మూడు వస్తువులు మాయం అయినట్లు తాజా సమాచారం. షీనా బోరాను హత్యచేసి కాల్చి, పూడ్చిపెట్టిన ప్రదేశం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న గులాబి రంగు వస్త్రం, ఒక దంతం, కుడి చేతి ఎముక ఏమైపోయాయో, ఎక్కడున్నాయో ఎంతకీ అంతుచిక్కడంలేదు . ఆ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు పోలీస్ రికార్డుల్లో ఉన్నప్పటికీ.. ల్యాబ్ అధికారులు మాత్రం అలాంటిదేమీలేదని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసులో నిందితురాలిగా భావిస్తున్న ఇంద్రాణియే తన పలుకుబడిని ఉపయోగించి ఆధారాలను మాయం చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుర్వాసన వస్తోందని.. రాయ్‌గఢ్ జిల్లా పేన్ తాలూకా గగోబె బుద్రుక్ గ్రామస్తులు.. 2012, మే 23న పేన్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. గ్రామం సమీపంలోని అటవీప్రాంతం నుంచి దుర్వాసన వస్తున్నదని, ఓ సారి వచ్చి చూడాల్సిందిగా కోరారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు అక్కడే పడిఉన్న ఒక వస్త్రం, దంతం, ఎముకలను స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం కలీనాలోని ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపారు. సీన్ కట్ చేస్తే.. డ్రైవర్ వాగ్మూలంతో బట్టబయలైన షీనా బోరా హత్యోదంతాన్ని పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల.. పేన్ పోలీసులు స్వాధీనం చెసుకున్న వస్తువుల గురించి తెలిసింది. దీంతో ముంబై పోలీసులు వెంటనే పేన్కు వెళ్లి రికార్డులను పరిశీలించారు. అటుపై కలీనాలోని ఎఫ్ఎస్ఎల్కు వెళ్లారు. కానీ అక్కడ ఆ ఆధారాలు కనిపించలేదు. పైగా పేన్ పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు ఒక మహిళకు సంబంధించిన మూడు వస్తువులేవీ తమ వద్దకు రాలేదని తేల్చిచెప్పారు. దీంతో కంగుతిన్న ముంబై పోలీసులు.. 2012లో ల్యాబ్ ఇన్చార్జిలుగా పనిచేసిన వారందరినీ ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. పొరపాటునగానీ ఈ ఆధారాలు మరో ల్యాబ్ కు చేరి ఉంటాయా? అనే అనుమానంతో ముంబైలోని జేజే హాస్పిటల్ ల్యాబరేటరీ రికార్డులను కూడా పరిశీలించారు. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది.