Google India Survey
-
టీవీలు, ఏసీలు ఆన్‘లైనే’...
న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్లైన్లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజిటల్ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు. ‘ప్రస్తుతం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు 28% విక్రయాలు డిజిటల్ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63%కి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు ఆన్లైన్ విక్రయాలే ఉంటాయని అంచనా‘ అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, చిన్న గృహోపకరణాలు, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై 33% డిజిటల్ ప్రభావం ఉంటోంది. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ ప్రభావం.. నివేదిక ప్రకారం.. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలుకు ముందు దాదాపు 80% మంది డిజిటల్ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2–3 వారాలు ఆన్లైన్లో అధ్యయనం చేశాకే కొంటున్నారు. సెర్చి, సోషల్ మీడియా, బ్లాగ్లు, ఆన్లైన్ వీడియోలు మొదలైనవి ఆన్లైన్ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ డైరెక్టర్ (సేల్స్) వికాస్ అగ్నిహోత్రి చెప్పారు. -

సొంతింటి ఎంపికలో ఇంటర్నెట్టే కీలకం
సాక్షి, హైదరాబాద్: ‘ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం ఓ కుగ్రామంలా తయారైంది’ అని అన్నదెవరోగానీ.. అది అక్షరాలా నిజం. క్షణం తీరికలేని నగరవాసులు సొంతింటి ఎంపికలో ఇంటర్నెట్నే ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నెట్ ద్వారానే 50 శాతం నిర్ణయాలు తీసుకుంటున్నారని గూగుల్ ఇండియా సర్వేలో తేలింది. ఇటీవల దేశ వ్యాప్తంగా 15 నగరాల్లో నిర్వహించిన సర్వేలోని కొన్ని కీలకాంశాలివే.. * ఇప్పటివరకు స్థిరాస్తి సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతికే పోకడ మెట్రో నగరాలకే పరిమితమైంది. కానీ, మూడేళ్లుగా ఇది ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించింది. స్థిరాస్తి సమాచారంలో ఇంటర్నెట్ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో ప్రింట్ మీడియా, సేల్స్ బ్రోకర్స్ ఆఫీసులున్నాయి. * సొంతింటి కొనుగోలు కోసం 74 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తే, అద్దె ఇంటి కోసం 26 శాతం మంది వినియోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్ట్‌లు, వెంచర్ల గురించి ఇంటర్నెట్ను 47 శాతం మంది వినియోగిస్తే, 23 శాతం మంది రీ-సేల్ ప్రాపర్టీల గురించి, మరో 30 శాతం మంది నిర్మాణంలో ఉన్న కొత్త ప్రాజె క్ట్‌ల కోసం నెట్‌ను వినియోగిస్తున్నారు. * ఏటా దేశ వ్యాప్తంగా ు43 బిలియన్ డాలర్లు స్థిరాస్తి వ్యాపారం (నివాస, వాణిజ్య, అద్దె 3 విభాగాలు కలిపి) ఇంటర్నెట్ ద్వారానే జరుగుతోంది. ఇందులో నివాస సముదాయాల వాటా ు31 బిలియన్ డాలర్లుగా ఉండగా.. వాణిజ్య సముదాయాల వాటా ు12 బిలియన్ డాలర్లుగా ఉంది. -
అన్వేషణలో హైదరాబాద్‌కు అగ్రస్థానం!
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈ ఏడాది నెటిజన్ల హాట్ ఫేవరేట్‌గా నిలిచింది. మన దేశంలో అత్యధిక మంది నెటిజన్లు భాగ్యనగరం కోసం ఇంటర్నెట్లో శోధించారు. సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో 2013లో ఎక్కువ మంది హైదరాబాద్ సమాచారం కోసం అన్వేషించారు. మెట్రో నగరాలు ముంబై, బెంగళూరులను వెనక్కి నెట్టి 'మన సిటీ' కోసం వెతికారు. ఫిబ్రవరిలో దిల్‌షుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు సంభవించడంతో హైదరాబాద్ సమాచారం కోసం ఎక్కువ మంది ఆన్లైన్లో అన్వేషించారు. జంట పేలుళ్లకు 17 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన జూలై, ఆగస్టు మాసాల్లో కూడా హైదరాబాద్ కోసం అత్యధికులు శోధించారు. సెప్టెంబర్‌లో ఐపీఎల్, తీవ్రవాది యాసిన్ భత్కల్ను హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించినప్పుడు, అక్టోబర్‌లో వాల్వో బస్సు దుర్ఘటన జరిగినప్పుడు భాగ్యనగరం కోసం నెటిజన్లు ఆతృతగా శోధించారని గూగుల్ ఇండియా వెల్లడించింది. -
'గూగుల్'లో మోడీ టాప్!
కమలం పార్టీ ప్రధాని అభ్యర్థిగా జాతీయ రాజకీయ యవనికపైకి దూసుకొచ్చిన నరేంద్ర మోడీ తన హవా కొనసాగిస్తున్నారు. కాషాయ పార్టీని కేంద్రంలో మళ్లీ పట్టాలెక్కించగల సత్తా ఉన్న నేతగా నీరాజనాలు అందుకుంటున్న ఈ గుజరాతీ నాయకుడు తదనుగుణంగా పనిచేసుకుపోతున్నారు. ప్రగతిపథంలో గుజరాత్‌ను పరుగులెత్తించిన మోడీపై భారం వేసి వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు బీజేపీ సిద్ధమయింది. 'నమో' మంత్రంతో యూపీఏ హ్యాట్రిక్‌ను అడ్డుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. జాతీయ స్థాయిలో మోడీకి ఆదరణ పెరుగుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ఆన్‌లైన్‌లోనూ ఆయన హవా నడుస్తోంది. ఇంటర్నెట్లో వెతికిన రాజకీయ నాయకుల్లో మోడీదే మొదటిస్థానం. గూగుల్‌లో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో సెర్చ్ చేసిన భారత రాజకీయ నాయకుల్లో మోడీ టాప్‌లో నిలిచారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా చెప్పబడుతున్న రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తృతీయ స్థానంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్, అరవింద్ కేజ్రీవాల్, జయలలిత, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, సుష్మా స్వరాజ్, దిగ్విజయ్ సింగ్ మోస్ట్ సెర్చెడ్ పొలిటీషియన్ల జాబితాలో ఉన్నారు. ఇక రాజకీయ పార్టీల విషయానికొస్తే బీజేపీ కోసం నెటిజన్లు ఎక్కువగా శోధించినట్టు ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీలు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఓటరు గుర్తింపు ఎలా పొందాలనేది అత్యధికులు వెదికిన అంశం. ఎలక్ట్రోరల్ నెంబర్ ఎలా గుర్తించాలి, ఆన్లైన్లో ఓటరు గుర్తింపు పొదడం ఎలా, ఓటు ఎలా వేయాలనే దాని గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఎన్నికల్లో ఎవరికి ఓటేయ్యాలో పట్టణ ఓటర్లలో 42శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదట. 'అర్బన్ ఇండియన్ ఓటర్స్' పేరుతో గూగుల్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడయింది. పార్టీని చూసి ఓటేస్తామని 35 శాతం మంది తెలిపారు. స్థానిక అభ్యర్థికే మద్దతిస్తామని 36 మంది పేర్కొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరనేది చూసి ఓటేస్తామని 11శాతం మంది చెప్పడం విశేషం. పట్టణ యువత ఆన్‌లైన్‌తో గాఢమైన బంధాన్ని కొనసాగిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని భావిస్తున్నట్టు గూగుల్ ఇండియా సర్వేతో తేలింది.