goutham kumar
-
చిరంజీవిగారు మా సినిమాను మెచ్చుకున్నారు
‘‘దేశంలో దొంగలు పడ్డారు’ సినిమా టీజర్‌ని చిరంజీవిగారు విడుదల చేయడం వల్లే మా సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మా సినిమాకి అలీగారు యాడ్ అయినప్పటి నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది’’ అని డైరెక్టర్ గౌతమ్ రాజ్‌కుమార్ అన్నారు. ఖయ్యూమ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘దేశంలో దొంగలు పడ్డారు’. మొహమ్మద్ అలీ సమర్పణలో రమా గౌతమ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. గౌతమ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ బ్యాగ్రౌండ్లో పనిచేస్తున్న వ్యక్తులను తీసుకుని దొంగలు అనే కాన్సెప్ట్‌ని యాడ్ చేశాం. అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ చుట్టూ సాగే కథ కాదిది. మంచి కాన్సెప్ట్ ఉండడం వల్లే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సెలెక్ట్ అయింది. చిరంజీవిగారు కేవలం అలీగారి కోసమే మా సినిమా మొత్తం చూసి, బాగుందని మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. స్టార్ హీరోలున్నంత మాత్రాన సినిమా చూడరు. కొత్త హీరోలైనా సినిమా బావుంటే చూస్తున్నారు. ఈ చిత్రకథ డార్క్ జానర్ కావడంతో సహజంగా రామ్‌గోపాల్ వర్మగారే గుర్తొస్తారు. అందుకే అలీగారు నన్ను వర్మగారితో పోల్చి ఉంటారు’’ అన్నారు. -
ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట
కారులో డబ్బు కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి నల్లమాడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు గౌతంకుమార్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఉత్తమ్‌కు చెందిన కారులో డబ్బులు తీసుకెళ్తున్నారంటూ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులుగా ఉన్న హోం శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకర్, సూర్యాపేట ఇన్స్పెక్టర్లకు నోటీసులిచ్చారు. ఏప్రిల్ 30న సూర్యాపేట శివార్లలోని భవానీ దాబా దగ్గర ఓ ఇన్నోవా కారు బాయ్నెట్ నుంచి పొగలొస్తుండటాన్ని ఎన్నికల అధికారులు గమనించడం, దాన్ని తెరిచి చూడగా కొన్ని రూ.1,000, రూ.500 నోట్లు కాలిపోయిన స్థితిలో కనిపించడం తెలిసిందే. -
బాల్య వివాహానికి ఏర్పాట్లు.. అడ్డుకున్న అధికారులు
ఆలంపల్లి, న్యూస్‌లైన్: అధికారులు ఓ బాల్య వివాహ ఏర్పాట్లను అడ్డుకొని బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. బాల్య వివాహం చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఈ సంఘటన గురువారం వికారాబాద్ మండలం మదన్‌పల్లిలో చో టుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కిష్టయ్య, కిష్టమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు(15) స్థానికంగా ఆరో తరగతి చదువుతోంది. బాలికకు మర్పల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. శుక్రవారం ఉదయం వివాహం చేసేందుకు ఇరువర్గాల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం ఉదయం వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్, ఎస్ఐ హన్మ్యా నాయక్, అధికారులు మదన్‌పల్లికి చేరుకొని వివాహ ఏర్పాట్లను అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహం చేయాలని, లేదంటే జైలుపాలవుతారని హెచ్చరించారు. చిన్నతనంలో పెళిళ్ల్లు చేస్తే జరిగే పరిణామాలను వివరించి వారికి కౌన్సెలింగ్ చేశారు. బాల్య వివాహాల గురించి తమకు సమాచారం అందించాలని అధికారులు స్థానికులకు చెప్పారు. ఎస్ఐ హన్మ్యానాయక్ మాట్లాడుతూ.. అం టరానితనం రూపుమాపాలని చెప్పా రు. అమ్మాయిలకు మైనారిటీ తీరిన తర్వాతే వివాహం చేయాలని సూచిం చారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని చెప్పారు. గ్రామ సర్పంచ్ మాణెమ్మ, వీఆర్ఓ నర్సింహారెడ్డి, వీఏఓ రమాదేవి తదితరులు ఉన్నారు.