ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట | Uttam Reddy gets relief as High court grants stay for transporting cash in a car to distribute to voters | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట

Published Sat, May 10 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట

ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట

కారులో డబ్బు కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల
 సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి నల్లమాడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు గౌతంకుమార్‌లకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఉత్తమ్‌కు చెందిన కారులో డబ్బులు తీసుకెళ్తున్నారంటూ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులుగా ఉన్న హోం శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకర్, సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌లకు నోటీసులిచ్చారు. ఏప్రిల్ 30న సూర్యాపేట శివార్లలోని భవానీ దాబా దగ్గర ఓ ఇన్నోవా కారు బాయ్‌నెట్ నుంచి పొగలొస్తుండటాన్ని ఎన్నికల అధికారులు గమనించడం, దాన్ని తెరిచి చూడగా కొన్ని రూ.1,000, రూ.500 నోట్లు కాలిపోయిన స్థితిలో కనిపించడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement