nalamada uttam kumar reddy
-
ఎంఐఎంకు ఇచ్చారు.. మాకు ఎందుకివ్వరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ట్రాఫిక్ క్లియర్ చేసి ఆరెస్సెస్ కవాతుకు ఎలా అనుమతిచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ వాళ్లు కర్రలతో భయానక వాతావరణం సృష్టిస్తే, దానికి పోలీసులు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ ర్యాలీకి సంబంధించిన వీడియోను పవర్‌పాయింట్ ద్వారా మీడియాకు చూపించాడు. గాంధీభవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికలు, చేపట్టాల్సిన ర్యాలీ, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘తిరంగ్ యాత్ర’, ‘సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్’కు అనుమతులివ్వడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. 130 కోట్ల మంది భారతీయులు హిందువులేనంటూ రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదని కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక 135వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు అన్ని జిల్లాల్లో జెండావిష్కరణ చేసుకుని ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ చేరుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేశామని హైదరాబాద్‌లో కూడా ర్యాలీ చేయాలనుకున్నామన్నారు. కానీ ట్రాఫిక్ సమస్య పేరుతో అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. తాము అంబేద్కర్ విగ్రహం దగ్గరికి మాత్రమే వెళతామంటున్నాం. కానీ అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు ఎలర్జీ అని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎంఐఎం సభకు ఎలా అనుమతి ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. మజ్లీస్, బీజేపీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఈ దేశంలో హిందువులు మాత్రమే కాదు.. అన్ని మతాల వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఇది సెక్యులర్ దేశమని నొక్కి చెప్పారు. ఆర్ఎస్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎలాగైనా రేపు సేవ్ ఇండియా-సేవ్ కాన్స్టిట్యూషన్ ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. -
రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్య«ధిక సీట్లు సాధించి కేంద్రంలో అ«ధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షడు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మునగాల మండలంలోని కలకోవ, జగన్నాథపురం, రేపాల, విజయరాఘవపురం, నారాయణగూడెం, ముకుందాపురం గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అయితే ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సాక్షి, మునగాల (కోదాడ): రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్య«ధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షడు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం మండలంలోని కలకోవ, జగన్నాథపురం, రేపాల, విజయరాఘవపురం, నారాయణగూడెం, ముకుందాపురం గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టే పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే పేద వర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి 16సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మట్టుబెట్టేందుకు ఓటర్లు నిర్ణయించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే మునగాలను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఉత్తమ్ హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ మండల అడ్‌హక్ కమిటీ సభ్యులు కొప్పుల జైపాల్‌రెడ్డి, నరంశెట్టి నర్సయ్య, దేవినేని రవికుమార్, నాగిరెడ్డి విజయమ్మ, కాసర్ల కోటయ్య, బెజవాడ కృష్ణయ్య, కాలె సామియేలు, చంద్రయ్య, వల్లపురెడ్డి రామిరెడ్డి, కాసర్ల శ్రీని వాస్‌రావు ఎలియాస్ బోస్, గంగుల హరిబాబు, కుంభజడ చైతన్యకుమార్, సొంపంగు గోపి, చిలకమర్తి గోవిందాచారి, సైదులు, బొళ్ల వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీను, వేలాద్రి పాల్గొన్నారు. -
పేలుతున్న మాటల తూటాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు, ఇతర నేతలు ఒకటి.. రెండంటూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చివరకు రాజకీయ విమర్శలు కాస్త.. వ్యక్తిగత విమర్శలకు దారితీస్తున్నాయి. దీంతో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిపై విమర్శల దాడిని మొదలు పెట్టారు. ఈ విమర్శలకు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తొలుత ప్రతి విమర్శకు పోకుండా ఒకింత సంయమనం పాటించారు. కాంగ్రెస్‌నుంచి వ్యక్తిగత విమర్శల దాడి పెరగడంతో వేమిరెడ్డి కూడా ప్రతివిమర్శలకు తెరలేపారు. మరోవైపు జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై, ప్రధానంగా అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డిలపై ఘాటైన విమర్శలే చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం మంత్రి జగదీశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పింది. దీం తో ఆయన జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, సమావేశాలు, రోడ్‌షోలలో పాల్గొంటూ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి ‘వేమిరెడ్డి’పై మాత్రం వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నాయకత్వం మండిపడుతోంది. ‘అభ్యర్థులకు ముఖం చెల్లకే .. కేసీఆర్‌ను చూ సి ఓట్లేయమని అడుగుతున్నారు. కేసీఆర్ డమ్మీలకు, భూ కబ్జాదారులకు టికెట్లు ఇచ్చి తెలగాణ ప్రజ లను అవమాన పరుస్తున్నారు. రా ష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాల ని టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఇది కేసీ ఆర్ నిరంకుశత్వానికి నిదర్శనం..’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రచారంలో తీవ్రస్థాయిలోనే టీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారు. ఉత్తమ్ చేస్తున్న విమర్శలను అటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఇటు టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తిప్పికొడుతున్నారు. ‘ఉత్తమ్‌కు ఓటమి భయం పట్టుకుంది. నాపై మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. నేను దేనికైనా సిద్ధం.. నిరూపించలేక పోతే ఉత్తమ్ ముక్కు నేలకు రాస్తాడా...’ అని వేమిరెడ్డి సవాల్ చేశారు. మరో వైపు మంత్రి జగదీశ్ రెడ్డి సైతం కాంగ్రెస్ అభ్యర్ధిపై తనదైన శైలిలో విరుచుకు పడుతున్నారు. ‘కాంగ్రెస్ నాయకుల మధ్య వారికి వారికే సమన్వయం లేదు. ఉత్తమ్ నాయకత్వంపై ఆ పార్టీ వారికే నమ్మ కం లేదు. అందుకే ఎమ్మెల్యేలు టీఆ ర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఆయన నా యకత్వంలో గాంధీభవన్‌కు తాళం పడడం ఖాయం.. ఏప్రిల్ 11తో కాంగ్రెస్ శని విరగడవుతుంది..’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రక్తి కడుతోంది. ‘ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. మంత్రిగా చేసినప్పుడు హౌసింగ్‌లో అవినీతికి పాల్పడ్డాడు. అది త్వరలోనే రుజువు అవుతుంది. కారులో నోట్ల కట్టలు తగలబెట్టుకుంది ఆయన కాదా..? నిన్న కూడా ఆయనకు సంబంధించిన డబ్బుల కట్టలు పట్టుబడ్డాయి.’ – వేమిరెడ్డి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ‘ఉత్తమ్ .. ఉత్తర కుమారుడు. ఎంపీగా గెలుస్తానని నమ్మకం ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలంటే పారిపోతుండు. ఉత్తమ్ నాయకత్వంలో గాంధీభవన్‌కు తాళం పడడం ఖాయం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. ఆయన తన ఓటమిని ముందే అంగీకరించాడు.’ – జి.జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ‘టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి. ఆయన డమ్మీ అభ్యర్థి. అలాంటి వ్యక్తి పార్లమెంటులో ఎలా మాట్లాడుతారు? రూ.100కోట్లు తీసుకుని టీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చింది..’ – ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి -
కాంగ్రెస్ సీనియర్లకు ‘వయసు’ గుబులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ‘వయసు’ గుబులు పట్టుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఉండదని, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకుంటామని ఇటీవల జరిగిన ప్లీనరీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించడంతో తమకు సీట్లు వస్తాయా రావా అనే సందేహం వారిని వేధిస్తోంది. రాహుల్ చెప్పినట్టు చేస్తే రాష్ట్రం నుంచి ఐదారుగురు ముఖ్య నేతల టికెట్లు గల్లంతయ్యే అవకాశముందన్న చర్చ టీపీసీసీ వర్గాల్లో జరుగుతోంది. ఈ లెక్కన ముఖ్యమంత్రి రేసులో ఉన్న నాయకుల టికెట్లు సైతం గల్లంతయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా సీనియర్ నేత కె.జానారెడ్డి, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, జాతీయ విపత్తు నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఉన్నారు. వీరందరి వయసు 70 కన్నా ఎక్కువ ఉండటంతో ఈసారి వీరికి టికెట్లు రావన్న చర్చ గాంధీభవన్‌లో జరుగుతోంది. లోలోన గుబులుగానే ఉన్నా తమకు టికెట్ కచ్చితంగా వస్తుందని వారు పేర్కొంటున్నా రు. పార్టీ అధికారంలోకి వస్తే సీఎం పగ్గాలు చేపట్టాలన్న ఆశతో ఉన్న జానారెడ్డి.. తనతోపాటు తన కుమారుడికి కూడా టికెట్ తెచ్చుకుంటానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఈసారి తన గెలుపు కచ్చితమన్న అంచనాతో ఉన్నారు. గీతారెడ్డి తన కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా.. ఈసారికి తానే పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇక జైపాల్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని మాజీ మంత్రి డీకే అరుణ ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుండటం సీనియర్లకు తలనొప్పిగా మారింది. జైపాల్‌కు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన మాత్రం మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మర్రిÔ¶ శశిధర్‌రెడ్డి పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌గా క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే టికెట్‌పై ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లోని కొందరు యువనేతలు ప్రచారం చేస్తున్నట్టు వీరి ఆశలు నిరాశలవుతాయా? లేదా రాహుల్ ప్రత్యేక నిర్ణయం తీసుకుని వీరికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాల్సిందే! వారసులొస్తారా? వచ్చే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వారు పోటీ చేసే అవకాశం లేదని పార్టీ కచ్చితంగా నిర్ణయిస్తే ఆయా నేతల వారసులకు లైన్‌క్లియర్ అవుతుందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతల్లో జైపాల్‌రెడ్డికి రాజకీయంగా వారసులు లేకపోయినా జానా కుమారుడు రఘువీర్‌రెడ్డి, పొన్నాల కోడలు వైశాలి, శశిధర్‌రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి, గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి లాంటి యువ నాయకత్వం ఈసారి బరిలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. రాహల్ మదిలో ఏముంది? వాస్తవానికి కాంగ్రెస్‌లో ఎప్పుడూ సీనియర్ల హవానే కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద వయసున్న నేతలే అటు పార్టీలోనూ, ఇటు ప్రజాక్షేత్రంలోనూ కనిపిస్తుంటారు. అయితే రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ముందే పార్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. పార్టీ అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన విభాగాలకు ఎన్నికలు నిర్వహించడం మొదలు పార్టీలో సీనియర్లు, జూనియర్లను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఆయన తనదైన ఆలోచనతో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ‘‘20–40 ఏళ్ల వయసున్న వారిని వర్కింగ్ యూత్‌గా, 40–60 వరకు సీనియర్ యూత్‌గా, 60–70 సలహా సంఘంగా, 70 కన్నా ఎక్కువ వయసున్న వారిని పూర్తిగా పార్టీకి ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. 60–70 ఏళ్ల వయసున్న వారికి టికెట్లు ఇచ్చే విషయంలో కొంత రిజర్వ్డ్గానే ఉండాలని ఆయన ఉన్నారు. ఇదే విషయాన్ని ప్లీనరీలో ప్రకటించారు’’ అని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఎక్కడా చెప్పలేదు: ఉత్తమ్ సీనియర్ నేతలకు టికెట్ల అంశంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. 70 ఏళ్లు దాటిన నాయకులకు టికెట్లు ఇవ్వబోమని పార్టీలో ఎక్కడా చెప్పలేదంటూనే.. ఈసారి యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని రాహుల్ చెప్పినట్లు వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఉత్తమ్‌కు హైకోర్టులో ఊరట
కారులో డబ్బు కేసులో తదుపరి చర్యలన్నీ నిలుపుదల సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి నల్లమాడ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు గౌతంకుమార్లకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఉత్తమ్‌కు చెందిన కారులో డబ్బులు తీసుకెళ్తున్నారంటూ ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సూర్యాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులుగా ఉన్న హోం శాఖ ముఖ్య కార్యదర్శి, నల్లగొండ జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారి ఎన్.ప్రభాకర్, సూర్యాపేట ఇన్స్పెక్టర్లకు నోటీసులిచ్చారు. ఏప్రిల్ 30న సూర్యాపేట శివార్లలోని భవానీ దాబా దగ్గర ఓ ఇన్నోవా కారు బాయ్నెట్ నుంచి పొగలొస్తుండటాన్ని ఎన్నికల అధికారులు గమనించడం, దాన్ని తెరిచి చూడగా కొన్ని రూ.1,000, రూ.500 నోట్లు కాలిపోయిన స్థితిలో కనిపించడం తెలిసిందే.