రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే | Congress Uttam Kumar Reddy: Our Party Will Form The Government In Delhi | Sakshi
Sakshi News home page

రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Published Sat, Apr 6 2019 2:14 PM | Last Updated on Sat, Apr 6 2019 2:14 PM

Congress Uttam Kumar Reddy: Our Party Will Form The Government In Delhi - Sakshi

మునగాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌

పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్య«ధిక సీట్లు సాధించి కేంద్రంలో అ«ధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షడు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మునగాల మండలంలోని కలకోవ, జగన్నాథపురం, రేపాల, విజయరాఘవపురం, నారాయణగూడెం, ముకుందాపురం గ్రామాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి  రాహుల్‌గాంధీ ప్రధాని అయితే ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.       

సాక్షి, మునగాల (కోదాడ): రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్య«ధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షడు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి నలమాద ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం మండలంలోని కలకోవ, జగన్నాథపురం, రేపాల, విజయరాఘవపురం, నారాయణగూడెం, ముకుందాపురం గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్‌గాంధీ ప్రవేశపెట్టే పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం హయాంలోనే పేద వర్గాల అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి 16సీట్లు వస్తాయని సీఎం కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని మట్టుబెట్టేందుకు ఓటర్లు నిర్ణయించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తనను ఎంపీగా గెలిపిస్తే మునగాలను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ  మండల అడ్‌హక్‌ కమిటీ సభ్యులు కొప్పుల జైపాల్‌రెడ్డి, నరంశెట్టి నర్సయ్య, దేవినేని రవికుమార్, నాగిరెడ్డి విజయమ్మ, కాసర్ల కోటయ్య, బెజవాడ కృష్ణయ్య, కాలె సామియేలు, చంద్రయ్య, వల్లపురెడ్డి రామిరెడ్డి, కాసర్ల శ్రీని వాస్‌రావు ఎలియాస్‌ బోస్, గంగుల హరిబాబు, కుంభజడ చైతన్యకుమార్, సొంపంగు గోపి, చిలకమర్తి గోవిందాచారి, సైదులు, బొళ్ల వెంకటరెడ్డి, లక్ష్మీనారాయణ, శ్రీను, వేలాద్రి పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement