gover general hospital
-
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ ఆస్పత్రిగా మారుస్తామన్న ఎమ్మెల్యే
-
ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శస్త్రచికిత్స జరిగింది. భోపాల్‌లోని హమిదియా హాస్పటల్లో ఆయన వేలుకు (ట్రిగ్గర్ ఫింగర్) వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది,. కొన్ని గంటలపాటు ముఖ్యమంత్రిని అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘కమల్ నాథ్ శనివారం ఉదయం 9 గంటలకు హమీదియా ఆసుపత్రిలో చేరారు. అతని కుడి చేతి ట్రిగ్గర్ వేలికి ఆస్పత్రి వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది’ అని గాంధీ మెడికల్ కాలేజీ డీన్ అరుణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీఎంకు కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. మరోవైపు హాస్పటల్లో ఇతర రోగులు, సిబ్బందికి అసౌకర్యం కలిగించవద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దంటూ కమల్‌నాథ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్‌నాథ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. -
రక్తశుద్ధికి.. నీటి కొరత!
నల్లగొండ టౌన్ : కిడ్నీ వ్యాధి్ర గస్తుల కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన రక్తశుద్ధి కేంద్రం (డయాలసిస్) ఆశించిన స్థాయిలో సేవలను అందించలేక పోతోంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు గతంలో హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే వారు. ప్రతి వారం హైదరాబాద్‌కు వెళ్లి డయాలసిస్ చేయించుకోవాలంటే నిరుపేదలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు నెలల కిందట డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పది మిషన్లతో పది మంది రోగులకు డయాలసిస్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేసింది. దీని నిర్వాహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. కానీ కేంద్రం నిర్వహణ కోసం అవసరమైన విద్యుత్, నీటి సౌకార్యాన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి బాధ్యులు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి ఉన్న ఒక్క నీటి మోటార్ ఆస్పత్రితోపాటు డయాలసిస్ కేంద్రానికి వినియోగిస్తున్నారు. ఒక్క మోటార్ నీరు ఆస్పత్రి అవసరాలకు మాత్రమే సరిపోతుండడంతో డయాలసిస్ కేంద్రానికి నీటికొరత ఏర్పడింది. రోజూ 13వేల లీటర్లు నీరు అవసరం ప్రతి షిఫ్టులో పది మంది చొప్పున రోజూ 40 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ చేయొచ్చు. ఇందుకు రోజూ 13 వేల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అయితే ఒకే ఒక్క మోటార్ ఉండడం వల్ల సరిపడా నీరు సరఫరా చేయకపోవడంతో కేవలం మూడు షిçఫ్టులుగా డయాలసిస్ చేస్తున్నారు. ఫలితంగా రోజూ పది మంది రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో డయాలసిస్ జరగక పోవడంతో రోగులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ డయాలసిస్ కేంద్రంలో 92 మంది కిడ్నీ రోగులు తమ పేర్లను నమోదు చేయించుకుని డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రతి కిడ్నీ రోగి మూడు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. నీటి వసతి సక్రమంగా లేకపోవడం వల్ల కొత్త రోగుల పేర్లను నమోదు చేసుకోవడం లేదు. దీంతో పాటు ఇప్పటికే నమోదు చేసుకున్న బాధితులకు కూడా సరైన డయాలసిస్‌ను సకాలంలో అందించలేక పోతున్నారు. అంతే కాకుండా, కిడ్నీ రోగులకు వాడాల్సిన ఎరిత్రోపొయిటిన్ ఇంజక్షన్ల కొరత తీవ్రంగా ఉందని సమాచారం. ఆస్పత్రి వీటిని సరఫరా చేయకపోవడంతో, రోగులే ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకుంటున్నారు. ఒక్కటే మోటార్‌తో ఇబ్బందులు జిల్లా కేంద్రంలోని డయాలసిస్ కేంద్రంలో పూర్తి స్థాయిలో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలను అందించాలంటే కేంద్రానికి అవసరమైన నీటిని అందించడానికి ప్రత్యేకంగా బోరు, మోటార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రానికి సరిపడా నీటిని అందించడానికి ఆస్పత్రి అధికారులు ఎందుకు చొరవచూపడం లేదో అర్థంకాని స్థితి. ఇప్పటికైన ఆస్పత్రి బాధ్యులు ప్రత్యేక బోరు, మోటార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందకుండా పోయే ముప్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మందుల సరఫరా లేదు కేంద్రంలో డయాలసిస్ చేయించుకున్న వారికి అవసరమైన మందుల సరఫరా లేకపోవడంతో రోగులు బయట డబ్బులను వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ చేయించుకున్న వారికి అక్కడే ఉచితంగా మందులను అందిస్తారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉచితంగా మందులను అందజేయాలని కిడ్నీ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక బోరును ఏర్పాటు చేయాలి డయాలసిస్ కేంద్రానికి ప్రత్యేక బోరు మోటార్‌ను ఏర్పాటు చేయాలి. సరైన నీటి వసతి లేకపోవడంతో డయాలసిస్‌కు చాలా ఆలస్యమవుతుంది. ఒక్కోసారి రెండు సార్లు వెళ్లాల్సి వస్తుంది. బోరు, మోటార్‌తో పాటుకేంద్రం క్లీనింగ్‌కు ఆయాలను ఏర్పాటు చేయాలి. మందులకు కూడా ఇబ్బందులు పడుతున్నాం. – వెంకటరమణ, పేషంట్ నీరు సరిపోవడం లేదు జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు డయాలసిస్ కేంద్రానికి ఒకే ఒక్క బోరు మోటా ర్ ఉన్నందున నీరు సరిపోవడం లేదు. త్వరలో కొత్తగా బోరు వేయించేందుకు కృషి చేస్తాం. డయాలసిస్ రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – డాక్టర్ టి.నర్సింగరావు,ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కనికరం లేకుండా..
పెద్దాసుపత్రిలో దారుణం –అర్ధరాత్రి నిండు గర్భిణిని బయటకు తోశారు –వైద్యం గురించి ఆరా తీసినందుకు.. –ప్రై వేటు ఆసుపత్రిలో ప్రసవం కర్నూలు(హాస్పిటల్): పెద్ద పెద్ద డాక్టర్లుంటారని, ఎలాంటి శస్త్రచికిత్సలైనా సమయాభావం లేకుండా చేస్తారన్న నమ్మకంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లిన ఓ నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. కష్టతరమైన ప్రసవ వేదనతో నరకయాతన అనుభవిస్తున్న ఆమెను అర్ధరాత్రి వైద్యులు నిర్ధాక్షిణ్యంగా బయటకు తోసేశారు. మీకు వైద్యం చేయం.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ వెళ్లగొట్టారు. దీంతో ఆ గర్భిణి నగరంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చేరి ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. డోన్‌కు చెందిన మనోహర్గౌడ్కు, వెల్దుర్తికి చెందిన రేవతికుమారికి ఏడాది క్రితం వివాహమైంది. మనోహర్‌గౌడ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యం బాగుంటుందని భావించి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రసవం కోసం రేవతికుమారిని చేర్పించారు. సాయంత్రం నుంచి నొప్పులు అధికం అవడం, బిడ్డ మెడకు పేగు చుట్టుకుపోతుండటంతో ప్రసవం కష్టంగా మారి నరకయాతన అనుభవించింది. ఆమె దీన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయిన కుటుంబసభ్యులు విషయాన్ని వైద్యులకు చెప్పారు. కొద్దిగా సీరియస్‌గా పట్టించుకోండంటూ వేడుకున్నారు. మాకే ఎలాంటి వైద్యం చేయాలో చెబుతావా అంటూ వైద్యులు వారిని మందలించారు. మిమ్మలను ఎవరు లోపలికి రమ్మన్నారు...మగవాళ్లు రాకూడదని, సెక్యూరిటీని పిలిచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసభ్యంగా మాట్లాడుతున్నారని, మీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైద్యులు హెచ్చరించారు. ఇందుకు తామేమి తప్పుచేశామని వారు గట్టిగా నిలదీయడంతో వారి పేషంటును బయటకు పంపించి వేయాలంటూ సిబ్బందికి సూచించారు. ఆ వెంటనే రేవతికుమారితో పాటు ఆమె బ్యాగ్‌లను రాత్రి 2 గంటలకు బయటకు విసిరేశారు. అప్పటికప్పుడు వారు రేవతికుమారిని నగరంలోని ఓ ప్రై వేటు ఆసుపత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించారు. శనివారం ఉదయం 8.40 గంటలకు ఆమె సిజేరియన్ ద్వారా మగబిడ్డను ప్రసవించింది. తమలాంటి బాధ మరెవ్వరికీ రాకూడదని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, రోగులను గిచ్చి,కొట్టి,తిట్టే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మనోహర్‌గౌడ్ కోరారు. కాగా ఈ విషయమై గైనకాలజి హెచ్‌వోడీ డాక్టర్ జ్యోతిర్మయిని వివరణ కోరగా గైనిక్ వార్డులోని ప్రసవ గదిలో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు గర్భిణిలు కాన్పు కోసం వచ్చి ఉన్నారని, రేవతికుమారి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా మంచం కావాలని కోరగా, అలా కుదరదని వైద్యులు చెప్పడంతో, వారే ప్రై వేటుకు వెళ్లిపోయారని వివరించారు.