governer esl narasimhan
-
సింధు సన్నాహాలకు సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా పీవీ సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వపరంగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీవీ సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీచంద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ బుధవారం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిశారు. తనకు వచ్చిన గోల్డ్ మెడల్‌ను కేసీఆర్‌కు సింధు చూపించింది. రెండు రాకెట్లను కూడా సీఎంకు బహూకరించింది. ఈ సందర్భంగా సింధుకు సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పి సన్మానించారు. ‘పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్‌షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేసింది. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యంకాదు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ సహా సింధు భవిష్యత్తులో పాల్గొనే టోర్నమెంట్లకు సమాయత్తం కావడానికి, ఇతరత్రా ఏర్పాట్లకు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు. టోక్యోలో స్వర్ణం ఖాయం: గవర్నర్ నరసింహన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తెలుగుతేజం పీవీ సింధుపై తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రశంసలు కురిపించారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె బంగారు పతకం సాధించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన సింధు నేటి తరానికి ఆదర్శమని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన సింధుతో పాటు, పారా బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన మానసి జోషిలను బుధవారం గవర్నర్ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ ‘పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చని సింధు, మానసి నిరూపించారు. వీరు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణం. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి మళ్లీ రాజ్‌భవన్‌కు రావాలని కోరుకుంటున్నా’ అని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తాము నెగ్గిన స్వర్ణ పతకాలను గవర్నర్‌కు చూపిస్తున్న మానసి, సింధు -
తిరుమలలో రాష్ట్రపతి కోవింద్
తిరుమల/రేణిగుంట(చిత్తూరు జిల్లా)/సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. సతీమణి సవితా కోవింద్‌తో కలసి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శనివారం రాత్రికి రాష్ట్రపతి తిరుమలలోనే బస చేశారు. ఆదివారం ఉదయం వరాహస్వామి దర్శనానంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించాక తిరుగు ప్రయాణమవుతారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. : అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం 5.10 గంటలకు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాష, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, డీసీసీబీ చైర్మన్ సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి, చిత్తూరు కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, డీఐజీ కాంతిరాణ టాటా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనశ్రేణిలో రోడ్డు మార్గాన తిరుచానూరుకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని దర్శించుకుని తిరుమలకు వెళ్లారు. శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో గవర్నర్ దంపతులు రేణిగుంట విమానాశ్రయం లాంజ్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముచ్చటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. -
‘హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తానని.. డర్టీగా మార్చారు’
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ గుళ్లు, గోపురాలు తిరిగే బదులు.. ఆస్పత్రులలకు వెళ్తే జనాలకు మేలు చేకురుతుందని సూచించారు టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ నిలిచిపోయిందన్నారు. దీనివల్ల పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలనాపరంగా సరైన చర్యలు తీసుకోనప్పుడు.. గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కానీ గవర్నర్ ఆ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తానని చెప్పి.. డర్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను.. బంగారు తెలంగాణగా మారుస్తారని నమ్మి ప్రజలు ఆయనను సీఎంగా ఎన్నుకున్నారని తెలిపారు. కానీ కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమి లేదని విమర్శించారు. ఈ నెల 3న రాహుల్ గాంధీ గద్వాల్, తాండూర్, హైదరాబాద్ నగరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి రోడ్ షో నిర్వహిస్తారని తెలిపారు. సోనియా గాంధీని మరోసారి రాష్ట్రానికి రావాల్సిందిగా కోరామని.. ఆమె ఆరోగ్యం సహకరిస్తే వస్తారని వెల్లడించారు. రాహుల్ గాంధీ కూడా ఈ నెల 5న మరోసారి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
గవర్నర్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
-
రాజమండ్రిలో గవర్నర్
తూర్పుగోదావరి(రాజమండ్రి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం రాజమండ్రిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కోటిలింగాలఘాట్‌ను పరిశీలించారు. కోరకొండ మండలం శ్రీరంగపట్నంలో ‘నీరు - చెట్టు’ కార్యక్రమంలో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.ఆలయంలో చిన్నారులు చేస్తున్న నృత్యాన్ని గవర్నర్ దంపతులు తిలకించారు.