governer speach
-
ఏపీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడంలో బిజీగా..
ఏ ప్రభుత్వమైనా తన రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీల ప్రభుత్వం రాష్ట్ర పరువు తీస్తున్నాయి. బ్రాండ్ ఇమేజీని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నాయి. శాసనసభ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంలో అధికారంలోకి కొత్తగా వచ్చిన తాము ఏమి చేయదలిచామో ప్రజలకు వివరిస్తారు. తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతామో తెలియచెబుతారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగంలో అంతా రివర్స్‌లో మాట్లాడించారు.ఎంతసేపు గత వైఎస్సార్సీపీ పాలనో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో నాశనమైపోయిందన్నట్లుగా ప్రచారానికి తప్ప నిర్మాణాత్మక వైఖరిని చెప్పడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. రోజూ చంద్రబాబు చేసే విమర్శలు, ఆరోపణలనే గవర్నర్ నజీర్‌తో చదివించడానికే అయితే అసలు ఈ కార్యక్రమమే అవసరం లేదు. మొక్కుబడిగా నాలుగు రాజకీయ ఆరోపణలు చేయించి పంపిస్తే సరిపోయేది. మరో వైపు రాష్ట్రంలో ఏవైనా పనులు జరుగుతాయని ఆశలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెప్పేశారు. అంటే ఏవేవో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాం కనుక, ఆ పవర్‌ను ఎంజాయి చేయండి తప్ప, కోరికలేవీ కోరవద్దని చెప్పినట్లుగా అర్థం అవుతుంది.గవర్నర్ ప్రసంగాన్ని పరిశీలించండి.. గత ప్రభుత్వపాలనలో ఏపీకి జరిగిన నష్టం అంచనాలకు అందడం లేదని చంద్రబాబు చెప్పించారు. ఏపీ ఇమేజీని కోరుకునేవారు ఇలాగా ఎవరైనా ఉపన్యసిస్తారా!? గవర్నర్ పదవి కేవలం ఫిగర్ హెడ్ కనుక ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ చిలకపలుకులే పలుకుతారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను పొగిడిన గవర్నర్ నోటితోనే ఇప్పుడు తిట్టించారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులలో గెలిచిన ఎమ్మెల్యేలు సంతోషించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే మార్గం లేదు. దేశంలో మొదటిసారి ఈ పరిస్థితి చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో అర్ధవంతమైన చర్చల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఈ స్పీచ్‌లో తెలిపారు. దీనిని బట్టి ఏమి అర్థం అవుతుంది. సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడుకు ఇప్పుడు పాలన చేతకావడం లేదనే కదా! ఎన్నికల ముందు ఎన్ని కోతలు కోశారు! చంద్రబాబు అనుభవంతో సంపద సృష్టిస్తారనే కదా! ఇప్పుడు ఇదేమిటి? ఇన్ని బీద ఏడుపులు అని ఎవరికైనా సందేహం రావచ్చు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో తన ప్రసంగాలలో ఎక్కడైనా టీడీపీపైనే ఆరోపణలు చేస్తూ కాలం గడిపిందా? కేవలం వంద కోట్ల నిల్వపెట్టి వెళ్లినా, ధైర్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపారే. తాను చేయదలచుకున్న కార్యక్రమాలు చేసి చూపించారే..! ఇప్పుడు ఎవరిది సమర్థ పాలన? వైఎస్ జగన్మోహన్ రెడ్డిదా? చంద్రబాబుదా? ఏపీకి జరిగిన నష్టం అంచనాకు అందడం లేదని చంద్రబాబు చెబుతారు.. మరో వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జీఎస్డీపీ దేశంలోనే అగ్రభాగాన ఉన్నరాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వరసగా మూడేళ్లు నెంబర్ ఒన్ పొజిషన్లో ఉంది కదా? మరి ఇందులో నాశనం ఏమి ఉంది. కేవలం ద్వేషంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప.ఏ ప్రభుత్వంలో అయినా లోటుపాట్లు ఉంటాయి. అవి కొన్ని చెప్పడం వరకు ఓకే. అసలు గత ఐదేళ్లు అంతా సర్వనాశనమే అంటూ పచ్చి అబద్ధాలను చెప్పి ప్రజలను మోసగించేయత్నం తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారులలో ఏపీపై నమ్మకం కొరవడిందని గవర్నర్‌తో దారుణమైన అసత్యాన్ని చెప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టైమ్‌లో గ్రీన్ ఎనర్జీకి రంగంలో వచ్చిన మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల మాటేమిటి? వాటిని చెడగొట్టడానికి ఈనాడు మీడియా చేయని ప్రయత్నం లేదు కదా? బద్వేల్ వద్ద సెంచరీ ప్లాంట్ ఎలా నిర్మాణం జరిగింది? ఫార్మాహబ్‌ను సాధించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? విశాఖలో ఆదాని డేటా సెంటర్ ఎవరు తెచ్చారు? ఇలా అనేకం ఉన్నాయి. ఇంకా రావాలని కోరుకోవచ్చు.కానీ ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా చంద్రబాబు వంటివారు ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టం తెస్తుంది. నిజానికి బ్రాండ్ ఇమేజీ నష్టపోతున్నది చంద్రబాబు టైమ్‌లోనే. నిత్యం రావణాకాష్టం మాదిరి ఏపీలో సాగుతున్న హత్యలు, విధ్వంసకాండతో ఏపీ బ్రాండ్ ఇమేజీ బాగా దెబ్బతింది. పుంగనూరు వద్ద వస్తున్న ఎలక్ట్రికల్ బస్‌ల కర్మాగారాన్ని భయపెడుతున్నది ఎవరు? పోర్టులు సైతం చంద్రబాబు టైమ్‌లో వచ్చాయిట. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి ఉందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామాయంపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల వద్ద చురుకుగా ఓడరేవుల నిర్మాణం చేపడితే వాటిని తనఖాతాలో వేసేసుకున్నారు. ఇక మిగిలిన అంశాలన్నీ చంద్రబాబు రోజువారీ మీడియాకు చెప్పే గోబెల్స్లో భాగమే తప్ప కొత్తవి లేవు.సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే వాటిని ఎలా అమలు చేసేది వివరించలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని గవర్నర్‌తో చెప్పించారు. అంటే దాని అర్థం హామీలు కొన్నింటిని మర్చిపోండని, లేదా ప్రజలే తమకు ఆ హామీలు వద్దు అని చెప్పాలన్నదే లక్ష్యం అని అర్థం అవుతూనే ఉంది. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారు? ఇప్పుడు ఎలా మాట మార్చారో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. పాపం.. ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా, దైర్యంగా ముందుకు సాగేవాడు నాయకుడు అవుతారు. ఆ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికు చంద్రబాబు సాటిరారనిపిస్తుంది. కనుక ఏపీ ఇమేజీని నాశనం చేస్తున్నది కూటమి నాయకత్వమే!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయం చేయదలచుకోలేదు: సీఎం స్టాలిన్
‘తమిళుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకోం.. రాష్ట్ర గౌరవాన్ని కాపాడేందుకు ఎందాకైనా వెళతాం’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలోని అంశాలకు ధన్యవాదాలు తెలుపుతూ, సభలో ఆయన వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయం చేయదలచుకోలేదని.. ప్రజా సంక్షేమం, తల్లి తమిళనాడును రక్షించడమే తమ ముందున్న అతిపెద్ద బాధ్యత అని ఉద్వేగంగా ప్రసంగించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర గౌరవాన్ని కాపాడుతూ.. అందరికీ సమ న్యాయం చేయడమే తమ లక్ష్యమని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముందుగా తమిళనాడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సభలో గవర్నర్ వ్యవహరించిన తీరుకు విచారం వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగం గురించి మాట్లాడి రాజకీయం చేయదలచుకోలేదన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమష్టి అభివృద్ధి, సమానత్వం, మహిళల హక్కులు, మత సామరస్యం వంటి సూత్రాలను అనుసరించి ద్రావిడ మోడల్ పాలనను రూపొందించామన్నారు. ప్రజల సంక్షేమం మాత్రమే తమ ఆలోచన అని, అదే ప్రజల హృదయాలను తాము గెలుచుకున్నామని పేర్కొన్నారు. నేను అంటే ఓ వ్యక్తి కాదని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన కెబినెట్, ప్రభుత్వం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకం అమలు చేయనున్నామని ప్రకటించారు. కొత్తగా సీఎం గ్రామీణ రోడ్డు అభివృద్ధి పథకాన్ని ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. శక్తిమంతమైన ఉద్యమం సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం, భాష, తమిళ హక్కులు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి నినాదాలతో శక్తిమంతమైన ఉద్యమాన్ని సాగిస్తున్నామన్నారు. ఏడాదిన్నర కాలంగా రాజీ లేకుండా ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నామన్నారు. తమిళనాడు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించామని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి, సామాజిక మార్పు, విద్యా అభివృద్ధి ఏక కాలంలో జరగాలని, తద్వారా అందరికీ మేలు జరగాలన్న కాంక్షతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంలో తమిళనాడు ప్రభుత్వం ఆశయాలు, జరిగిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణను క్లుప్తంగా పేర్కొన్నామని వివరించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేందుకు, బలాన్ని చాటేందుకు, శతాబ్దాల చరిత్ర కలిగిన అసెంబ్లీ విలువలను నిలబెట్టే విషయంలో వెనకడానని, ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని సూక్తులు, తమిళ కవిత్వాలను క్రోడీకరించారు. నిరంతరం శ్రమిస్తున్నాం... గడిచిన ఏడాదిన్నర కాలం తమిళనాడుకు సువర్ణ యుగాన్ని తలపించే రోజులు అని పేర్కొన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. కరోనా బారిన ప్రజలను రక్షించేందుకు రేయింబవళ్లు శ్రమించామని, తాను సైతం అనారోగ్య కారణాలతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తన గదిలో ఓ ‘డ్యాష్ బోర్డ్ ‘ ఉందని, ప్రతి రోజు అందులోకి వచ్చే సమాచారాలను, వివరాలను పరిశీలించి ఆయా శాఖల తీరుతెన్నులను పర్యవేక్షిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఏడాదిన్నర కాలంలో తన పర్యటనలు, ప్రభుత్వ ప్రగతి, నిధుల కేటాయింపు, తదితర అంశాలను సభకు సీఎం వివరించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని, ద్రావిడ మోడల్ పాలనకు లభించిన ఫలితం ఇది అని పేర్కొన్నారు. పథకాల విస్తరణ.. రాష్ట్రంలోని 1,545 పాఠశాలల్లో అల్పాహారం పథకం అమల్లో ఉందని.. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో ఈ పథాకాన్ని అమలు చేస్తామన్నారు. 15 నెలల వ్యవధిలో రైతులకు లక్షా 50 వేల ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని వివరించారు. గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం సీఎం పేరిట ప్రత్యేక పథకం అమలు చేయనున్నామన్నారు. ఈ పథకం కింద రూ.4 వేల కోట్లతో 10 వేల కి.మీ గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. మసీదులకు ఇది వరకు రూ. 6 కోట్లు రాయితీలు ఇచ్చామని, ఈ ఏడాది నుంచి ఆ సంఖ్యను రూ. 10 కోట్లకు పెంచుతున్నటు వెల్లడించారు. ప్రపంచ పెట్టుబడిదారుల మహానాడు 2024 జనవరి 10, 11 తేదీల్లో నిర్వహించనున్నామని తెలిపారు. ఇక్కడి పాలసీలు, మౌలిక వసతులను పెట్టుబడిదారులకు తెలియజేయడానికి విదేశీ పర్యటనలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. వందకుపైగా దేశాల నుంచి పెట్టుబడిదారులను ఈ మహానాడుకు ఆహ్వానించనున్నామన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు - కృష్ణగిరి, హోసూరు మధ్య వర్తక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని మంత్రి తంగం తెన్నరసు తెలిపారు. - పుదుకోటైను కార్పొరేషన్‌గా మార్చబోతున్నామని మంత్రి కేఎన్ నెహ్రు అన్నారు. - సీఎం బీమా పథకం అమల్లో దేశంలో తమిళనాడు రికార్డు సృష్టించిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ వివరించారు. - ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో రూ.2,37,850 కోట్లతో పనులు చేపట్టామని.. శరవేగంగా జరుగుతున్నాయని ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు. - ఈ ఏడాది 316 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని ఆ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రకటించారు. - అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి పేర్కొన్నారు. చివరగా సభలో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగ చట్టంలో సవరణలతో పాటు మరికొన్ని ముసాయిదాలు ఆమోదం పొందాయి. అనంతరం సభను స్పీకర్ అప్పావు వాయిదా వేశారు. -
ఈసారీ సేమ్ సీన్!.. గవర్నర్ ఉభయ సభల ప్రసంగం లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: ప్రొటోకాల్ అంశం మొదలుకుని ప్రభుత్వ బిల్లుల ఆమోదం వరకు ప్రగతిభవన్, రాజ్‌భవన్ నడుమ రోజుకో వివాదం తెరమీదకు వస్తోంది. గవర్నర్, ముఖ్యమంత్రి కార్యాలయాల నడుమ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు పలు సందర్భాల్లో వెల్లడైంది. గవర్నర్ వరుస మీడియా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన విమర్శలు చేస్తున్నారు. మరోవైపు రాజ్‌భవన్ బీజేపీ కార్యాలయంగా మారిందని టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ప్రొరోగ్ అంశం కూడా తెరమీదకు వస్తోంది. డిసెంబర్లో శీతాకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సుమారు ఏడాదిన్నరగా మూడు పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ప్రొరోగ్ కాకపోవడం ఈ వివాదాన్ని కొత్త మలుపులు తిప్పుతోంది. అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడంతో ఏడాదిన్నరగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం దక్కడం లేదు. నిబంధనల మేరకు అసెంబ్లీ ప్రొరోగ్ కానంత వరకు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే అవకాశం లేదు. తాజాగా ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగిసేంత వరకు అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుండానే సమావేశాలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే అప్పటివరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం లేనట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 11 సమావేశాలు .. ఏడుసార్లు ప్రొరోగ్ తెలంగాణ రెండో శాసనసభ 2018లో ఏర్పాటు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 11 పర్యాయాలు సమావేశమైంది. ఏడుసార్లు ప్రొరోగ్ అయ్యింది. రాష్ట్ర గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలంలో మూడు పర్యాయాలు రాష్ట్ర రెండో శాసనసభ సమావేశాలు జరిగాయి. తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎనిమిది సార్లు జరిగాయి. అయితే 2020 మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకసారి మాత్రమే తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదనే కారణంతో 2021, 2022 బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. గత ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాల అనంతరం 2021 జూన్‌లో శాసనసభ చివరిసారిగా ప్రొరోగ్ అయింది. ఆ తర్వాత గత ఏడాది సెప్టెంబర్, ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలు, సెప్టెంబర్‌లో జరిగిన వర్షాకాలం సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు ముగిసినా నేటికీ ప్రొరోగ్ నోటిఫికేషన్ వెలువడలేదు. రెండో శాసనసభ చివరివరకు ఇలాగే? తెలంగాణ రెండో శాసనసభ కాల పరిమితి వచ్చే ఏడాది డిసెంబర్లో ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్లో శీతాకాల సమావేశాలు, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాలు మొదలుకుని చివరి సమావేశం వరకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం లేదని టీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉభయ సభల ప్రొరోగ్‌ను ప్రభుత్వం కోరే అవకాశం లేదని తెలిపాయి. అసెంబ్లీని ప్రొరోగ్ చేసితీరాలనే ఖచ్చితమైన నిబంధన ఏదీ రాజ్యాగంలో లేదని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రొరోగ్ చేసినా గవర్నర్ ప్రసంగించాలనే నిబంధన కూడా లేదని అంటున్నాయి. నిబంధనల మేరకు అసెంబ్లీ సమావేశమయ్యేందుకు కేవలం స్పీకర్ నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుందని చెప్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏడాదికి పైగా అసెంబ్లీ ప్రొరోగ్ కాలేదనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. కౌశిక్‌రెడ్డి వివాదం మొదలుకుని బిల్లుల దాకా గవర్నర్ కోటాలో పాడి కౌశిక్‌రెడ్డిని శాసన మండలి సభ్యుడిగా నామినేట్ చేస్తూ గత ఏడాది ఆగస్టులో కేబినెట్ తీర్మానించింది. సుమారు రెండు నెలల అనంతరం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తిరస్కరించడంతో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ అంశం మొదలుకుని రాజ్‌భవన్, ప్రగతి భవన్ నడుమ విభేదాలు బహిర్గతమై తర్వాతి కాలంలో తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఇదీ చదవండి: సామాన్యుడి కోసం ధర్మపీఠం -
కేంద్రం తీరుపై గుస్సా
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో 9 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతోపాటు వార్షిక బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లులు, ప్రశ్నోత్తరాలు తదితర సందర్భాల్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు అధికారపక్షం ప్రాధాన్యతనిచ్చింది. మరో వైపు ఇటీవలి కాలంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందనే అంశానికి గణాంకాలు జోడిస్తూ సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. కేంద్రం నుంచి రూ. 28 వేల కోట్ల బకాయిలు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథకు ఆర్థిక సాయం వంటి విషయాలను మంత్రులు, అధికారపక్ష సభ్యులు ప్రసంగాల్లో ప్రస్తావించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, గంగుల కేంద్రం తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పనిచేస్తుంటే బీజేపీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని, బీజేపీకి స్వరాష్ట్ర భక్తి లేదని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆత్మనిర్భర్ ప్యాకేజీలో రూ. 20 లక్షల కోట్లు ఎక్కడని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిబంధనల మేరకు అప్పులు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రస్తావించారు. నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సంద ర్భంగా జరిగిన చర్చతోపాటు బడ్జెట్, పద్దులపై చర్చలో తమకు సమయం కేటాయించట్లేదని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం అందుబాటులో ఉండటం లేదంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి రికార్డుల నుంచి తొలగించగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తమకు సభలో తగిన సమయం ఇవ్వట్లేదంటూ భట్టి విక్రమార్క స్పీకర్‌కు లేఖ రాయడంతోపాటు ఆ పార్టీ సభ్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన దుబ్బాక బీజేపీ శాసనసభ్యుడు ఎం.రఘునందన్ రావు పలు అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ సమస్యలతోపాటు వివిధ అంశాలను ప్రస్తావించారు. పీఆర్సీ సహా కీలక ప్రకటనలు శాసనసభ సమావేశాల వేదికగా సీఎం కేసీఆర్, మంత్రులు పలు అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 22న ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 61 ఏళ్ల ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై సీఎం ప్రకటన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్లో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మాజీ ఎమ్మెల్యేలకు, జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులకు వేతనాల పెంపు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల పెంపు హమీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ హామీ వంటి కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కరోనా పరిస్థితుల్లో భౌతికదూరం పాటించడం, పాస్‌ల జారీలో ఆంక్షలు అమలు చేయగా వివిధ అంశాలకు సంబంధించి పలు సంఘాలు అసెంబ్లీ ముట్టిడికి ప్రయత్నించాయి. కరోనా పరిస్థితుల్లో శాసనమండలి కేవలం 5 రోజులు సమావేశమవగా సీఎం కేసీఆర్ పెద్దల సభకు హాజరు కాలేదు. -
‘గాంధీ విధానాలు భావితరాలకు ప్రేరణ’
సాక్షి, విజయవాడ : యువతకు గాంధీజీ ఇచ్చిన సందేశాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సమకాలీనంగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ పాఠశాల విద్యాశాఖ, గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ స్మారక నిధి సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘గాంధీజీ ఫోటో ఎగ్జిబిషన్’ను బిశ్వభూషణ్ ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధులను గవర్నర్ సన్మానించి అభినందనలు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం గ్రంథాలయ వయోజన విద్యోద్యమాల మాసపత్రిక, గ్రంథాలయ సర్వస్వం పుస్తకాన్ని, సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో నమస్కారం చెప్పి మాట్లాడుతూ.. గాంధీజీ 150వ జయంతి నాడు ఆయన చెప్పిన మంచి విషయాలు మననం చేసుకోవాలని సూచించారు. పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ గాంధీజీ ఆలోచనలను అనుసరించేవారని తెలిపారు. మహాత్మాగాంధీ విధానాలు భావితరాలకు ఒక ప్రేరణ కావాలన్నారు. గాంధీ వెనుక ఉన్న భారతీయులు గర్జిస్తే ఒక భూకంపం వచ్చినట్టుగా ఉండేదని చెప్పారు. స్వతంత్ర్య సమరయోధులకు సన్మానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గాంధీజీ ఆలోచనలు, విధానాలు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అహింస, సత్యం మాట్లాడటం గాంధీజీ నేర్పిన అంశాలని గుర్తుచేస్తూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు ఎన్నటికీ మర్చిపోలేనివని వ్యాఖ్యానించారు. తెలుగు తనకు అర్ధం కాకపోయినా, విద్యార్ధులు మాట్లాడిన మాటలు వారి ఉద్వేగం నుంచి అర్ధం చేసుకున్నానని చెప్పారు. ఈ కార్యకమంలో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనకు గవర్నర్ మంత్రముగ్ధులయ్యారు. -
కేసీఆర్ స్పీచ్‌లా గవర్నర్ ప్రసంగం
-
‘టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతోంది’
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో అందరిని కలుపుకుని ముందుకెళతానని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభలో ప్రసంగించినట్లు గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, పింఛన్ గురించి గవర్నర్ ఏం చెప్పలేదని తెలిపారు. పాలకులు.. ప్రతిపక్షం బలంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆకర్ష్‌కు తమ ఎమ్మెల్యేలు లొంగరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్లోకి వెళ్లలేదని.. కావాలనే అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గవర్నర్ ప్రసంగం కాపీ, పేస్ట్‌లా ఉంది : షబ్బీర్ ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడే మాటలనే గవర్నర్ కాపీ కొట్టారంటూ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. రైతు రుణ మాఫీ, పింఛన్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఎప్పుడు ఇస్తారో గవర్నర్ స్పష్టం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై కూడా గవర్నర్ ప్రసంగంలో మైనార్టీగా ప్రస్తావించారని.. దీని గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఈ చిలిపి చేష్టలు, గిల్లికజ్జాలేమిటి?: హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసన సభ గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపిందని మండిపడుతూ వారి చర్యను ఖండించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలొద్దని, హుందాగా వ్యవహరించాలని గత బీఏసీ సమావేశాల్లోనే అందరి సమక్షంలో నిర్ణయించామని, అయినా ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్లోగన్లతో సభలో గందరగోళానికి యత్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూస్తే.. ‘మేం ఎన్ని రోజులైనా చర్చకు రెడీ. ప్రతి అంశంపై చర్చ పెడతామని ఇప్పటికీ చెబుతున్నాం. గతంలో అది చేశాం.. ఇప్పుడు కూడా చేస్తాం. స్పీకర్ కూడా అన్ని పక్షాలకు ఈ విషయాన్ని చెప్పారు. గతంలో బీఏసీలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులొద్దని నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్, టీడీపీ ఎందుకు స్లోగన్స్ ఇచ్చింది? ఎందుకు ఆ తొందరపాటు? చిలిపిచేష్టలు ఏ ఉద్దేశంతో చేశారు? గిల్లికజ్జాలతో సభను ఎందుకు డిస్ట్రబ్ చేయాలని అనుకున్నారు? ఏదైనా చెప్పాలనుకుంటే రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చెప్పేటప్పుడు చెప్పవచ్చు కదా. అప్పుడు మీకు చాలా సమయం ఉంటుందిగా. మీకు భయం.. ఎందుకంటే పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రతిపక్షాలు క్లీన్ బోల్డ్ అయ్యాయి. ఇప్పుడు కూడా అవుతాయని భయపడ్డాయి. కుల వృత్తుల కోసం బడుగుల కోసం త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తుంటే వణికిపోతున్నారు. తమను మెచ్చుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నారు. ప్రతిపక్షాల చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కేసీఆర్ తుగ్లక్‌లా చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ తుగ్లక్ పనులు చేసి చాలా గొప్పగా చేశానంటూ చెప్పుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌తో రాజకీయ ప్రసంగం చదివించారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా వద్ద టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఏం మాట్లాడారంటే.. ..‘తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నర్‌ది నాలుగో ప్రసంగం. సాధారణంగా గవర్నర్ ప్రభుత్వ కేబినెట్ ఏది రాసిస్తే అదే చదువుతారు. నేటి ప్రసంగంలో ప్రధాన అంశాలు మాత్రం ఇందులో లేవు. గతంలో ప్రకటించిన పథకాలపై నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. గవర్నర్ చేత పలు చోట్ల అబద్ధాలు చెప్పించారు. పవర్ సప్లయ్ విషయంలో కాంగ్రెస్ హయాంలో పూర్తయినవి తప్ప వీళ్లు మొదలుపెట్టిన ప్రాజెక్టులతో ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. అందించలేదు. వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకొచ్చే పనులు కూడా గత ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఏదో అద్భుతం చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. పరిశ్రమలు వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పించారు. తెలంగాణ రాష్ట్రంలోకి పెట్టుబడులు తక్కువగా వస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్ సైట్ ఇచ్చిన నివేదిక 2017 తెలిపింది. 31 జిల్లాల గురించి గొప్ప చేసినట్లు చెబుతున్నారు. అన్ని తుగ్లక్ పనులు చేసి గొప్ప పనులని కేసీఆర్ అంటున్నారు. జిల్లాల విభజనలో ప్రజల మనోభవాలు పట్టించుకోలేదు. జీడీపీ గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పారు.. దానిపై అనుమానం ఉంది. రబీలో తెలంగాణ రైతు బ్రహ్మాండంగా చేశారని కేసీఆర్ అంటున్నారు. కానీ, ఏది నిజమో రైతులకు తెలుసు. పంటపండింది తక్కువ చెప్పుకుంటుంది ఎక్కువ. వాస్తవానికి తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ముస్లింలు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న 12శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వలేదు’ . జానారెడ్డి ఏం మాట్లాడారంటే.. ‘ప్రభుత్వ విధివిధానాలను వివరించే విషయంలో ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇళ్లు.. మూడెకరాల భూమి, 12శాతం మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు, సబ్ ప్లాన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్పీచ్ చాలా బాధా కలిగించింది. డబుల్ బెడ్రూం, మూడు ఎకరాల భూమిపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేం కూడా కొత్త ప్రభుత్వం అని సహకరించాం. వారు చేసిన తప్పిదాన్ని వారికి తెలియజేసేందుకే మేం వాకౌట్ చేశాం’ అని అన్నారు.