The Government of India
-
ఆసియా దేశాల్లో శాంతి, అభివృద్ధికి భారత్-చైనాల సహకారం
తిరుపతి తుడా: ఆసియా దేశాల్లో శాంతి స్థాపన, అభివృద్ధికి భారత్, చైనా దేశాలు సహకారం కీలకమైందని, చైనాలో భారత ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేసిన సీవీ.రంగనాథన్ అన్నారు. భారత్ చైనా సంబంధాలు దృఢమైనవని ఆయన తెలిపారు. ఆగ్నేయ, ఆసియా పసిఫిక్ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్హాల్లో మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీవీ రంగనాథన్ మాట్లాడుతూ భారత్, చైనాల మధ్య చిన్నపాటి సమ్యలు తలెత్తాయని చెప్పారు. వాటిని అధిగమించి పరస్పరం అభివృద్ధికి సహకరించాల్సిచాల్సిన సమయం ఎంతైనా ఉందన్నారు. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉందన్నారు. భారత్‌కు చైనా సహకారం, చైనాకు భారత్ సహకారం అవరసమన్నారు. ఎస్వీయూ వీసీ ఆచార్య రాజేంద్ర మాట్లాడుతూ ఇరు దేశాలు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే అవగాహనతో కూడిన సహకారం అవసరమన్నారు. భారత్ చైనాల మధ్య బలమైన సత్సంబంధాలు మెరుగుపడి ప్రపంచ శాంతికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం పరిశోధన సంస్థలు, రాయబార కేంద్రాలు, ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు. ఈ సదస్సులో ఆగ్నేయ, ఆసియా పసిఫిక్ అధ్యయన కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చైనాలో భారత ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేసిన సీవీ. రంగనాథన్‌ను సదస్సులో ఘనంగా సన్మానించారు. -
స్మార్ట్ సిటీల అభివృద్ధికి సింగపూర్ సహకారం
విదేశాంగ మంత్రి సుష్మ వెల్లడి సింగపూర్: దేశంలో ‘స్మార్ట్ సిటీ’ల అభివృద్ధికి భారత ప్రభుత్వం సింగపూర్ సహకారం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం రూ. 7,060 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం సింగపూర్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి లీ హెసీన్ లూంగ్, విదేశాంగ మంత్రి కె.షణ్ముగంతో సహా పలువురు ముఖ్య నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. భారత్ - సింగపూర్ల మధ్య దౌత్య సంబంధాలు నెలకొల్పుకుని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది నిడివి ఉత్సవాలను షణ్ముగంతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ.. భారత్‌లో సింగపూర్ సంస్థలు అనుసంధాన, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. ప్రత్యేకించి ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్, చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్లతో పాటు ఈశాన్య ప్రాంతంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారిడార్‌లో ఎక్కడోచోట ‘లిటిల్ సింగపూర్’ను అభివృద్ధి చేయవచ్చన్నారు. సుష్మా పర్యటన సందర్భంగా పలు ఒప్పందాలతో పాటు భారత్‌లో స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకారంపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పట్టణ ప్రణాళికారచన, నీటి నిర్వహణ వ్యూహాలు తదితర రంగాల్లో సింగపూర్ సహకారం అందించనుంది. సుష్మ సింగపూర్‌లో పర్యటనలో భాగంగా ఆర్థిక, రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాలూ అవగాహనకు వచ్చాయి. -
తొలి రోజే తెలంగాణకు కేంద్ర నిధులు అందాయి
న్యూఢిల్లీ: భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు అందడం సోమవారం నుంచి ఆరంభమయ్యాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్రానికి అందించాల్సిన నిధులను సోమవారం నుంచి ఇవ్వడం ప్రారంభించామని ఆర్ధిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 13వ ప్లానింగ్ కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటా ప్రతి నెల తొలి పనిదినాన అందుబాటులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు చట్టం 2014 ద్వారా ఏర్పడిన తెలంగాణ జూన్ 2 తేదిన అవిర్భవించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కే. చంద్రశేఖర్ రావు పదవీ బాధ్యతల్ని స్వీకరించారు.