Government of Odisha
-
కొటియా గ్రామాలపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని కొటియా గ్రామాలపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సరిహద్దు గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ సీటీ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. రెండు రాష్ట్రాల మధ్య అధికార పరిధికి సంబంధించిన ఆర్టికల్ 131 చెల్లుబాటును సవాల్ చేస్తూ ఒడిశా ఇప్పటికే ఓ వ్యాజ్యం దాఖలు చేసిందని ఆ రాష్ట్రం తరఫు న్యాయవాది వికాస్‌సింగ్ తెలిపారు. గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఆదేశాలు కొనసాగించాలని లేదంటే ఆర్టికల్ 131పై ఒడిశా దాఖలు చేసిన వ్యాజ్యం సహా రెండు అంశాలనూ ఒకేసారి విచారించాలని ధర్మాసనాన్ని కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ.. ఆర్టికల్ 131పై ఒడిశా వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు వచ్చిన తర్వాత విచారణ చేపడతామని స్పష్టం చేశారు. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది నజ్కీ స్పందిస్తూ.. తమకు అభ్యంతరం లేదని చెప్పారు. -
సంప్రదింపులతోనే పెండింగ్ అంశాల పరిష్కారం
సాక్షి, అమరావతి: సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్‌శర్మ, సురేశ్ చంద్ర మహాపాత్ర వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర సమస్యలను నిర్దిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే అంశంపై ఇటీవల ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆ కమిటీలు రెండూ సోమవారం పెండింగ్ అంశాలపై సమీక్షించాయి. ఈ సందర్భంగా సీఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ.. పెండింగ్ అంశాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర మాట్లాడుతూ సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పరిష్కరించుకునేందుకు సమావేశాలు దోహదం చేస్తాయన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో రోడ్డు అనుసంధాన పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తెచ్చారు. సమావేశం మినిట్స్‌ను రెండు రాష్ట్రాలు పంపితే తదుపరి భేటీల్లో పెండింగ్ అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. ఇంధనం, జల వనరులు, రవాణాపై చర్చ ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఇంధన, జలవనరులు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంధన శాఖకు సంబంధించి జోలాపుట్, లోయర్ మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, బలిమెల డ్యామ్, చిత్రకొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. జలవనరుల శాఖకు సంబంధించి వంశధార నదిపై నేరడి బ్యారేజ్, ఝంజావతి రిజర్వాయర్, బహుదా నది నీరు విడుదలకు సంబంధించి పంపు స్టోరేజ్ ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరఫున ఎన్వోసీల మంజూరు అంశాలపై సమీక్షించారు. బహుదా నీటిని విడుదల చేయండి నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం 106 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఆ భూమిని అప్పగిస్తే బ్యారేజ్ సకాలంలో పూర్తయి ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే ఝంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంతో విజయనగరం జిల్లాలోని 5 మండలాల్లో 75 గ్రామాలకు తాగునీరు అందడమే కాకుండా 24,640 ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. ఒప్పందం ప్రకారం బహుదా నది ద్వారా ఒడిశా ప్రభుత్వం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. -
ఒడిషాలో 89 స్టేడియాలు!
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ క్రీడల పట్ల తమ ప్రాధాన్యతను చూపించిన ఒడిషా ప్రభుత్వం ఇప్పుడు తమ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టింది. ఒడిషాలో మొత్తం రూ. 693.35 కోట్ల వ్యయంతో 89 మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాలను నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ కింద 18 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారివంటివి ఎదురైనప్పుడు వసతి కేంద్రాలుగా, ఆస్పత్రులుగా కూడా ఉపయోగించుకునే విధంగా ఈ స్టేడియాలను నిరి్మస్తున్నారు. 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రూర్కెలాలో ‘బిర్సా ముండా’ పేరుతో అధునాతన హాకీ స్టేడియాన్ని రూ. 120 కోట్ల వ్యయం తో ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే నిర్మిస్తోంది. -
కొటియాలో ఒడిశా ఆంక్షలు
సాలూరు: పరిషత్ ఎన్నికల్లో కొటియా గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తిని సాకుగా చూపుతూ కొరాపుట్ జిల్లా కలెక్టర్ అబ్దుల్ ఎమ్.అక్తర్ 144 సెక్షన్ విధించడంతో ఒడిశా అధికారులు బుధవారం ప్రత్యేక బలగాలతో కొటియా గ్రామాలకు చేరుకున్నారు. గిరిజన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తోణాం, మోనంగి పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పట్టుచెన్నేరులో రహదారులపై రాళ్లు అడ్డంగా వేసి దారిని దిగ్బంధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ఈ గ్రామాలకు సంబంధించి గంజాయిభద్ర ఎంపీటీసీ స్థానానికి నేరెళ్లవలస సంత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి ఉంది. ఒడిశా ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులతో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓటు వేసేందుకు వెళ్లకూడదని ఆంక్షలు విధిస్తున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. పోలింగ్ నిర్వహణకు వెళ్లిన సిబ్బందిని కూడా అడ్డుకోవడంతో సీఐ అప్పలనాయుడు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్వో మధుసూదనరావు నేరెళ్లవలస చేరుకున్నారు. ఒడిశా బలగాలు వారికి 144 సెక్షన్ ప్రతిని చూపించాయి. దీనిపై బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చర్చలు సాగుతున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ పీవో ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు పోలింగ్ స్టేషన్లో వివాదం కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కౌశల్యాపురం పోలింగ్ స్టేషన్లో ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. కౌశల్యాపురం ప్రాథమిక పాఠశాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కోసం ఆంధ్రా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఒడిశా అధికారులు బుధవారం పోలింగ్ స్టేషన్ వద్దకు వచ్చి భూభాగానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉన్నందున ఎన్నికలు నిర్వహించొద్దంటూ ఆంధ్రా అధికారులకు చెప్పారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు చర్చించారు. అనంతరం అధికారులు దీనిపై పాలకొండ ఆర్డీవో, సీతంపేట ఐటీడీఏ పీవోలకు ఫిర్యాదు చేశారు. వెంటనే పీవో.. కౌశల్యాపురం పాఠశాల వద్దకు చేరుకుని ఇరు రాష్ట్రాల అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఒడిశా అధికారులతో పీవో మాట్లాడి గురువారం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. -
ఆంధ్రా–ఒడిశా మధ్య.. 'పంచాయతీ' చిచ్చు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మన రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దని ఒడిశా ప్రభుత్వం ఓటర్లను బెదిరిస్తోంది. ఈ విషయం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపుతోంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని పట్టుచెన్నేరు, పగులుచెన్నేరు, కురుకూటి, గంజాయిభద్ర, సారిక పంచాయతీల్లో 23 గిరిశిఖర గ్రామాలున్నాయి. వీటినే కొటియా పల్లెలుగా పిలుస్తున్నారు. ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను మూడేళ్ల క్రితం ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో ఏపీకి చెందిన జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ, ఇతర ముఖ్య అధికారులు ఈ గ్రామాల్లో పర్యటించి ప్రాథమికంగా పలు సంక్షేమ ఫలాలు అందించి వచ్చారు. ఈ పరిణామంతో ఒడిశా కూడా అభివృద్ధి మంత్రంతో గిరిజనులకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు రూ.180 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పనులను చేపట్టింది. వాటిపై అంత ప్రేమ ఎందుకంటే.. కొటియా పల్లెలు అపార ఖనిజ సంపదకు నిలయాలు. అక్కడి కొండల్లో అధికంగా మాంగనీస్, ఇనుప ఖనిజం, రంగురాళ్లు వంటి విలువైన నిక్షేపాలున్నాయి. వీటి విలువ కొన్ని లక్షల కోట్లల్లో ఉంటుంది. వీటిని దక్కించుకుంటే ఆ రాష్ట్రం ఆరి్థకంగా ఉన్నతస్థాయికి చేరుకుంటుందన్న ప్రచారం ఉంది. ఈ ప్రాంతానికి సంబంధించిన వివాదాన్ని పార్లమెంటు కమిటీ అధ్యయనం చేస్తోంది. అధిక శాతం ప్రజల అభీష్టం మేరకే వారిని ఏ రాష్ట్రానికి ఇవ్వాలనే దానిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో అక్కడ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చురుగ్గానే మంజూరయ్యేవి. అందువల్ల అక్కడి గిరిజనులు ఆంధ్రా ప్రాంతం వైపే మొగ్గు చూపేవారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా విస్మరించింది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కొటియా ప్రజలకు కొత్త జీవితం మొదలైంది. సంక్షేమ పథకాలు వారికి చేరువవుతున్నాయి. దీంతో వారు మళ్లీ ఆంధ్రాపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలతో రాజుకుంటున్న వివాదం కొటియా గ్రూప్‌లోని గంజాయిభద్రలో 13 గ్రామాలున్నాయి. పట్టుచెన్నేరులో నాలుగు, పగులుచెన్నేరులోని మూడు, సారికలో ఒకటి, కురుకూటిలో రెండు పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇప్పుడు ఒడిశా సర్కారు పోలీసులను ఈ గ్రామాల్లో దించింది. ఆంధ్రా ఎన్నికలకు వెళ్లొద్దని బెదిరిస్తోంది. సాలూరు తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ పార్వతి పోలీసు బలగాలతో అక్కడకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని అక్కడివారిని కోరారు. సుప్రీంకోర్టుకు వెళ్తా కొటియా గ్రామాల్లో ఓటర్లపై ఒడిశా అధికారులు దురుసుగా ప్రవర్తించి ఓటు వేయకుండా అడ్డుకోవాలని చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్లడానికైనా వెనుకాడను. మా ప్రాంతానికి వచి్చనపుడు గవర్నర్ బిశ్వభూషణ్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకువెళ్లాను. తాజా పరిస్థితిని సీఎం జగన్ దృష్టికీ తీసుకెళ్తా. – పీడిక రాజన్నదొర, సాలూరు ఎమ్మెల్యే చూస్తూ ఊరుకోం కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వ పథకాలన్నీ అందేలా చేస్తున్నాం. గిరిజనులకు మంచి జరుగుతుందనే కారణంతో ఒడిశా కార్యక్రమాలను అడ్డుకోలేదు. అంతమాత్రాన ఓటు వేయనీయకపోతే చూస్తూ ఊరుకోం. మన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్ ప్రశాంత ఎన్నికలకు చర్యలు కొటియా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. మేం అక్కడి ప్రజలకు అవగాహన కలి్పస్తున్నాం. త్వరలోనే వారందరికీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించడానికి ఏర్పాట్లుచేశాం. ఒడిశా చర్యలు సరైనవి కావు. – ఆర్. కూర్మనాథ్, పార్వతీపురం ఐటీడీఏ పీఓ -
ఒడిశాలో కేర్ ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కేర్ హాస్పిటల్స్, ఒడిశా ప్రభుత్వం చేతులు కలి పాయి. ఇందులో భాగంగా ఆ రాష్ట్రంలోని జార్సుగూడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆసుపత్రిని 15 ఏళ్లపాటు కేర్ నిర్వహించనుంది. 100 పడకల సామర్థ్యంతో రానున్న ఈ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ కేర్ హాస్పిటల్‌కు ప్రభుత్వం రూ.75 కోట్ల వ్యయం చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్న ఈ హాస్పిటల్ నిర్మాణం రెండేళ్లలో పూర్తి అవుతుంది. పశ్చిమ ఒడిశాలో ఇటువంటి ఆసుపత్రి ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. హాస్పిటల్ సామర్థ్యంలో 50 శాతం పేదలకు కేటాయిస్తారు. వీరికి ఉచితంగా సేవలు అందిస్తారు. ఒడిశా రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో మంగళవారం ఒప్పందం జరిగింది. కార్యక్రమానికి కేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బి.సోమరాజు, సీవోవో కసి రాజు పాల్గొన్నారు. కేర్ ఖాతాలో ప్రస్తుతం 14 ఆసుపత్రులు ఉన్నాయి.