government schems
-
సీఎం జగన్‌కి క్షమాపణలు చెప్తున్నాం: వలంటీర్లు
సాక్షి, విజయవాడ: జీతాలు పెంచాలంటూ ఆందోళన చేస్తోన్న వలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ లేఖపై వలంటీర్లు స్పందించారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తుల ప్రలోభాల వలన కొందరు వలంటీర్లు అలా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ రోజు మేము వినతిపత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళాము. విజయవాడలో జరిగిన ఘటనలో మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. వలంటీర్లు అందరి తరుపున సీఎం జగన్‌కి క్షమాపణలు చెబుతున్నాము’’ అన్నారు. ‘‘సీఎం జగన్ వలంటీర్లుకు రాసిన లేఖ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. దీని ద్వారా ఆయన మాకు క్లారీటీ ఇచ్చారు. గతంలో ప్రతి రోజు ఆఫీసుకి రావాలి.. లేకపోతే మీ జీతాలు కట్ అవుతాయి అని చెప్పేవారు. అయితే సీఎం రాసిన లేఖ ద్వారా మా విధివిధానాలు తెలుసుకున్నాం. వారానికి రెండు, మూడు రోజులు మాత్రమే సేవ చేయ్యండని చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలకు సేవ చేయ్యలన్న దృక్పథంతో ఉన్న సీఎంని స్ఫూర్తిగా తీసుకుని సేవ చేస్తున్నాం. మేము ఎప్పటికి సీఎం జగన్‌కి వ్యతిరేకంగా కాదు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి.. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తాం’’ అని వలంటీర్లు స్పష్టం చేశారు. చదవండి: వలంటీర్ అంటేనే స్వచ్ఛంద సేవ -
గడప ముంగిటకే పెన్షన్లు, రేషన్- మంత్రి అనిల్
సాక్షి, నెల్లూరు సిటీ: పెన్షన్ల కోసం అవ్వా, తాతలు, రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన అసవరం లేకుండా మీఇంటి ముంగిటకే వచ్చి అందజేసేలా వలంటీర్లను నియమిస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. కిసాన్‌నగర్ సింహపురి మున్సిపల్ పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆయన బిడ్డ సీఎం జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచారన్నారు. పెన్షన్లు, రేషన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు పడకుండా వలంటీర్లు ఇళ్ల ముంగిటకే తెచ్చి ఇస్తారని తెలిపారు. అమ్మఒడి పథకం కింద ఏటా జనవరి 26న పిల్లలను పాఠశాలల్లో చదివించే తల్లుల ఖాతాల్లో రూ.15వేలు నగదు అందజేస్తారన్నారు. ఆరోగ్య ఖర్చులు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్న వైద్య ఖర్చులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 72గంటల్లో ప్రభుత్వ పథకాలు మంజూరు ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి తిరగాల్సిన అవసరం లేదని మంత్రి అనిల్‌కుమార్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో ప్రభుత్వ పథకాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.17,500 నగదు అందజేస్తామన్నారు. నాలుగేళ్లలో మద్యపాన నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బెల్టు దుకాణాలు లేకుండా చేశామన్నారు. హౌస్‌ఫర్ ఆల్ క్రింద 300 చదరపు అడుగులు ఇళ్లకు రూ.3లక్షల రుణాన్ని పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 365,430 చదరపు అడుగుల ఇళ్లకు కొంతమొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేషన్ కమిషనర్ అలీంబాషా, నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, సంక్రాంతి కళ్యాణ్, అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఈఈ శేషగిరిరావు పాల్గొన్నారు. కార్పొరేట్ స్థాయికి మున్సిపల్ పాఠశాలలు నెల్లూరు సిటీ: మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. నగరంలోని బీవీఎస్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు సోమవారం సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, నాయకులు రూప్‌కుమార్‌యాదవ్, సంక్రాంతి కళ్యాణ్, తదితరులు పాల్గొన్నారు. -
బడుల్లో బడా గోల్మాల్
ఆధార్ అనుసంధానంతో అక్రమాల గుట్టురట్టు 10.67 లక్షల మంది విద్యార్థులపై తేలని లెక్కలు మధ్యాహ్న భోజనం, యూనిఫారం పథకాల్లో భారీగా నిధుల స్వాహా ఇతర పథకాల్లోనూ ఏటా కోట్లాది రూపాయల దుర్వినియోగం సాక్షి, హైదరాబాద్: అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడుతున్నారు. చిన్నపిల్లలకు పెట్టే మధ్యాహ్నభోజనం, వారికిచ్చే దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఆడపిల్లలకు ప్రత్యేకించి కేటాయించే నిధులను మింగేస్తున్నారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల పాఠశాలల విద్యార్థులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టడంతో అక్రమాల బాగోతాలు వెలుగులోకొస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటినుంచి పదోతరగతి విద్యార్థులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియను 2013లో ప్రారంభించగా.. ఇప్పటికి 95 శాతం పూర్తయింది. ఆధార్ అనుసంధానం తరువాత ఆ గణాంకాలు, పథకాల వ్యయాన్ని బేరీజు వేయగా దిగ్భ్రాంతికి గురయ్యే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. మధ్యాహ్నభోజన పథకం కింద మంజూరవుతున్న రూ.35 కోట్లు, యూనిఫారం కింద వస్తున్న రూ.15 కోట్లు దుర్వినియోగమవుతున్నట్లు అంచనా. ఇక పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకిచ్చే ఇతర నిధులూ పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు. తేలని లెక్కలు.. ఆధార్ అనుసంధానం రెండేళ్లుగా కొనసాగుతోంది. యూని ఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్(యూడీఐఎస్ఈ) సర్వే ప్రకారం 2014-15 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో ఒకటి నుంచి 10వ వరకు 72,10,086 మంది విద్యార్థులున్నారు. వీరిలో ఆధార్ అనుసంధానం చేసినవారు 61,42,895 మంది ఉన్నారు. లెక్కలు తేలని విద్యార్థులసంఖ్య 10,67,191. వీరిలో 6,11,857 మంది ప్రైవేటు, 4,55,334 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. అవగాహనలేమి కారణంగా లేదా ఆధార్‌కార్డులు తీసుకోనందున అనుసంధానం చేయనివా రు లక్ష మందిదాకా ఉండొచ్చని అంచనా. తక్కిన 3.55 లక్షల మందికిపైగా విద్యార్థులు బోగస్‌వేనని అనుమానిస్తున్నారు. అక్రమాలు ఎలా జరిగాయంటే.. కొన్ని ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థుల పేర్లను ప్రభుత్వ పాఠశాలల రికార్డుల్లోనూ నమోదు చేస్తున్నారు. స్థానికతకోసం కొందరు.. తమ పిల్లల పేర్లను గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయిస్తున్నారు. ఇక డ్రాపవుట్ల సంఖ్యను ఎక్కువగా చూపితే ప్రభుత్వ ఒత్తిడి తమపై పడుతుందని భావిస్తూ వారిపేర్లను టీచర్లు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కిస్తున్నారు. పైవేటు స్కూళ్లకెళ్లి చదువుకునేవారి పేర్లను తొలగించకుండా రికార్డుల్లో కొనసాగిస్తున్నారు. నిష్పత్తి ప్రకారం విద్యార్థులు లేకపోతే తమ పోస్టులకు ఎసరు వస్తుందనేది టీచర్ల భయం. ఇలా లక్షల్లో బోగస్ పేర్లు రికార్డుల్లో కొనసాగుతున్నాయి. దీనివల్ల రూ.కోట్లాది సొమ్ము దుర్వినియోగమవుతోంది. పథకాల్లో గోల్మాల్ మధ్యాహ్న భోజనం కింద రోజుకు ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో రూ.4, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రూ.6 చొప్పున ఖర్చు చేస్తున్నారు. రికార్డుల్లో 3.55 లక్షలమందికిపైగా బోగస్ విద్యార్థులున్నట్లు లెక్కలు తేలుతుండడంతో ఏటా ఈ పథకంకింద రూ.35 కోట్లు పక్కదారి పడుతున్నట్లు అంచనా. ఇక యూనిఫారం పేరిట ఏటా ఒక్కో విద్యార్థికిచ్చే రెండు జతల దుస్తులకోసం ప్రభుత్వం రూ.400 చొప్పున వెచ్చిస్తోంది. దీంట్లో రూ.15 కోట్లకుపైగా దుర్వినియోగమవుతోంది. మరోవైపు ఉచిత పాఠ్యపుస్తకాలు, తదితర పథకాల్లోనూ నిధులు పక్కదారి పడుతున్నాయి. ఆధార్ అనుసంధానం ప్రక్రియను ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎన్సీఎల్పీ స్కూళ్లు, మదర్సాలు, వర్క్‌సైట్ స్కూళ్లకూ విస్తరిస్తే బోగస్ లెక్కలు మరిన్ని వెలుగులోకి వస్తాయంటున్నారు. 2015 ఏప్రిల్ 19 నాటికి ఆధార్ అనుసంధాన స్థితి జిల్లా విద్యార్థులు ఆధార్ సీడింగ్ అంతరం శ్రీకాకుళం 4,00,008 3,60,112 39,896 విజయనగరం 3,41,122 3,05,110 36,012 విశాఖపట్నం 6,45,088 5,12,294 1,32,794 తూ.గోదావరి 7,60,909 6,67,795 93,114 ప.గోదావరి 5,50,496 4,92,211 58,285 కృష్ణా 6,00,671 4,90,872 1,09,799 గుంటూరు 6,76,536 5,63,745 1,12,791 ప్రకాశం 5,10,511 4,11,786 98,725 నెల్లూరు 4,14,585 3,59,237 55,348 వైఎస్సార్ 4,47,349 3,75,157 72,192 కర్నూలు 6,70,120 5,31,939 1,38,181 అనంతపురం 5,94,015 5,28,834 65,181 చిత్తూరు 5,98,676 5,43,803 54,873 మొత్తం 72,100,86 61,42,895 10,67,191