govindaraj
-
డీఎంకేలోకి వలసలు..
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేతలు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. గడిచిన తమిళనాడు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే విజయఢంకా మోగించి అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు అధికారంలో ఉండిన అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి వెళ్లింది. ముఖ్యమంత్రి స్టాలిన్ మూడు నెలల కాలం ప్రభుత్వం కరోనా కట్టడి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివిధ పార్టీలకు చెందిన నేతలు డీఎంకేకు ఆకర్షితులవుతూ పార్టీలో చేరడం ప్రారంభించారు. అన్నాడీఎంకే మాజీ మంత్రులు తోప్పు వెంకటాచలం, పళనియప్పన్ పలు జిల్లాలకు చెందిన నిర్వాహకులు ఇప్పటికే డీఎంకేలో విలీనమైనారు. తంజావూరు, ధర్మపురి, సేలం, నామక్కల్, రామనాథపురం, కన్యాకుమారీ జిల్లాలకు అన్నా డీఎంకే, ఏఎంఎంకే నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో కార్మిక సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన నటరాజన్, అతని కుమారుడు, ఏఎంఎంకే జిల్లా కార్యదర్శి ఆనందన్, మాజీ మంత్రి శేఖర్ కుమారుడు పట్టుకోట్టై సెల్వం డీఎంకేలో చేరారు. అలాగే కుమరి జిల్లా కార్యదర్శి సురేష్ రాజన్ సహా 73 మంది అన్నాడీఎంకే నేతలు డీఎంకేలో విలీనం అయ్యారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన 14 మంది పార్టీ యూనియన్ కార్యదర్శులు, నలుగురు నగర కార్యదర్శులు, 10 మంది పంచాయతీ అధ్యక్షులు, ముగ్గురు కౌన్సిలర్లు డీఎంకేలో చేరారు. మంత్రులు దురైమురుగన్ (పార్టీ ప్రధాన కార్యదర్శి) పొన్ముడి, ముత్తుస్వామి, పలువురు అగ్రనేతలు పాల్గొన్నారు. అన్నాడీఎంకే ఓటి కుండ: రాజన్ అన్నాడీఎంకే ఒక ఓటి కుండని, శశికళ చేతుల్లోకి వెళ్లినా అతకడం సాధ్యం కాదని మాజీ మంత్రి నటరాజన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేను వీడి డీఎంకేలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లా డుతూ, అన్నాడీఎంకేలో ఐక్యత లేదు, పార్టీ కేడర్ అయోమయంలో పడిపోయిందని విమర్శించారు. -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
గోవింద్రాజ్, కిరణ్ మేడసాని, త్రిశంక్, అభిషేక్, లావణ్య, ఫరీనా, రవళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అన్నది ట్యాగ్‌లైన్ . అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తన ఆలోచనే కరెక్ట్ అని భావించి తాను తీసే సినిమా యూనిట్‌ను ముప్పతిప్పులు పెట్టే ఓ డైరెక్టర్ చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథని వినోదాత్మకంగా తెరకెక్కించాం. ప్రధాన పాత్రలో గోవింద్ రాజ్ నటించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్.జి, కెమెరా: బొబ్బిలి సంతోష్ రెడ్డి. -
ఎర్ర ‘కింగ్‌పిన్’ అరెస్ట్
చిత్తూరు(అర్బన్): ఆంధ్ర, కర్ణాటక రా ష్ట్రాల్లో పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్‌ను జిల్లా టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ‘కింగ్‌పిన్’గా పేరొందిన బెంగళూరుకు చెందిన కే.రామకృష్ణ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను చిత్తూరులో సో మవారం అరెస్టు చూపించారు. ఇతనితో పాటు చెన్నైకు చెందిన అయ్యప్పన్ గౌండర్ (34), తిరువళ్లూరుకు చెందిన జీ.కుమార్ (30), తిరునల్వేలికి చెందిన ఎస్.మురుగన్ (41), క్రిష్ణగిరికి చెందిన ఏ. గోవిందరాజ్ (21)ను కుప్పం-క్రిష్ణగిరి ఘాట్ రోడ్డు, వి.కోట-కుప్పం రోడ్డుల్లో అరెస్టు చేసినట్టు చిత్తూరు ఓఎస్డీ రత్న ప్రకటించారు. వీరి నుంచి పెట్రోలి యం ట్యాంకరు, మహీంద్ర కారు, ఓ లారీ, రూ.2.40 లక్షల నగదు, 34 ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్డీ రత్న, సీఐ రిషికేశవ్ వివరాలు వెల్లడించారు. స్మగ్లర్ల బయోడేటా రామకృష్ణ ఇతనిది బెంగళూరులోని ముల్బాగిల్. మదనపల్లెలో నివాసముంటున్నాడు. 9వ తరగతి చదువుకుని లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ రియల్ ఎస్టేట్‌లోకి దిగాడు. అక్కడ లాభాలు రాకపోవడంతో 2008 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 1500 టన్నుల ఎర్రచంద నాన్ని జిల్లా నుంచి ఎగుమతి చేశాడు. ఇతనికి అంతర్జాతీ య స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎర్రచందనం నిల్వచేసే గో డౌన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఇతనిపై 14 కేసులు ఉన్నాయి. 2010లో ఎర్రచందనం కేసులో ఇతను జైలు శిక్ష అనుభవించాడు. ఎర్రచందనం రవాణా లో ఆరితేరడంతో ఇతన్ని అందరూ ‘కిం గ్పిన్’గా పిలుస్తుంటారు. వార్షిక ఆదా యం రూ.6 కోట్లు. అయ్యప్ప గౌండర్.. చెన్నైలోని కొడియంగన్ను ప్రాంతానికి చెందిన అయ్యప్పగౌండర్ దుస్తుల వ్యా పారి. చెన్నైకు చెందిన బట్టల వ్యాపారి శేఖర్ ద్వారా 2008లో ఎర్రచందనం స్మగ్లింగ్‌లోకి వచ్చాడు. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ స్మగ్లర్లకు ఎర్రచందనం సరఫరా చేయడం మొదలు పెట్టాడు. దాదాపు వంద టన్నుల వరకు రవాణా చేశాడు. వార్షిక ఆదాయం రూ.2.50 కో ట్లు. ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. కుమార్ తమిళనాడులోని తిరువళ్లూరుకు చెంది న ఇతను పదో తరగతి చదువుకుని డ్రైవర్‌గా పనిచేసేవాడు. మూడేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణాలోకి వ చ్చాడు. ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. వార్షిక ఆదాయం రూ.60 లక్షలు. మురుగన్ ఇతనిది తమిళనాడులోని తరునల్వేలి జిల్లా. బీ.కామ్ వరకు చదువుకుని ట్రా వెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉం డేవాడు. అక్రమంగా డబ్బు సంపాదిం చాలని ఎర్రచందనం అక్రమ రవాణాలోకి వచ్చాడు. వంద టన్నులు ఇతర ప్రదేశాలకు తరలించాడు. జిల్లాలో ఇతనిపై 8 కేసులు ఉన్నాయి. వార్షిక ఆదాయం రూ.2.50 కోట్లు. గోవిందరాజ్ తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన ఇతను ఎర్రచందనం స్మగ్లింగ్ వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనిపై జిల్లాలో ఆరు కేసులు ఉన్నాయి. ఇతని వార్షిక ఆదాయం రూ.12 లక్షలు. ఇద్దరు ‘ఎర్ర’దొంగల అరెస్ట్ వి.కోట: వి.కోట మీదుగా తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివాంజనేయుులు తెలిపారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు రహస్య సవూచారం అందింది. పోలీసులు కుప్పం రహదారిలో కాపుగాశారు. పలవునేరు వూర్గం నుంచి కుప్పం వైపునకు వేగంగా వెళుతున్న పెట్రోల్ ట్యాంకర్‌ను, వుహీంద్రా ఎక్స్యుూవీని అనువూనంతో నిలి పారు. వాహనంలో ఉన్నవారు పొంతన లేని సవూధానం చెప్పడంతో తనిఖీ చేశారు. వాహనాల్లో ఎర్రచందనం దుంగలు ఉండడంతో డ్రరుువర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు వుదనపల్లెకు చెందిన రావుకృష్ణ, తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన గోవిందరాజ్గా తేలింది. వారిని రివూం డుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నిన్న సస్పెన్షన్.... రేపు రిటైర్మెంట్
చెన్నై, సాక్షి ప్రతినిధి: 1985లో జైలువార్డన్‌గా విధుల్లో చేరిన చేరిన గోవిందరాజ్ అంచలంచెలుగా ఉన్నతాధికారిగా ఎదిగారు. సుదీర్ఘకాలం పదోన్నతికి నోచుకోని ఆయనకు 2009లో డీఐజీగా ఒక్కసారిగా పదోన్నతి లభించింది. ఆరేళ్లుగా అదే హోదాలో కొనసాగుతున్న గోవిందరాజ్ ప్రస్తుతం కోవైలోని సెంట్రల్‌జైలు డీఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జైలులో గంజార, హెరాయిన్ తదితర నిషేధిత మత్తుపదార్థాలతోపాటూ ఖైదీలకు సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, చార్జర్లు యథేచ్ఛగా సరఫరా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మికంగా సీబీసీఐడీతో విచారణ జరి పించగా ఆరోపణలు రుజువయ్యూయి. డీఐజీ గోవిందరాజ్తోపాటూ మరో 17 మంది జైలు అధికారులు, సిబ్బంది ప్రమేయంతోనే మత్తుపదార్థాలు సరఫరా అయినట్లు సీబీసీఐడీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో డీఐజీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నిర్దోషిని సీబీసీఐడీ పోలీసులు ఇచ్చిన నివేదిక తనను దోషిగా పేర్కొన్నా, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని గోవిందరాజ్ పేర్కొన్నారు. తన 30 ఏళ్ల సర్వీసుల్లో ఎన్నడూ ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొనలేదని అన్నారు. తనతోపాటూ మరో 17 మంది అధికారులను సీబీసీఐడీ తప్పుపట్టినా తనను మాత్రమే సస్పెండ్ చేయడం బాధాకరమని అన్నారు. మరో రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇటువంటి చర్యకు పాల్పడటం తనను షాక్‌కు గురిచేసిందని పేర్కొన్నారు. -
భలే గిరాకీ
చేపల ధర కేజీ రూ.30 నుంచి రూ.150 వరకు పెరుగుదల సాక్షి, సిటీబ్యూరో: మృగశిర కార్తె రాకతో నగరంలో చేపల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ‘మృగశిర’ అడుగిడిన తొలి రోజే చేపలు తినడమనేది నగర ప్రజల్లో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఆదివారం ఉదయం 11.36 గం.లకు మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. అయితే... ఆదివారం ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతో అనేక మంది శనివారం నాడే చేపలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో శనివారం మార్కెట్లో చేపలు మరింత ప్రియమైపోయాయి. సాధారణ రోజుల్లో అమ్మకాల కంటే రెట్టింపు ధర పలికాయి. నగరంలో అనేక చోట్ల రోడ్డుపక్క టెంట్లు వేసి చేపల విక్రయాలు కొనసాగాయి. గిరాకీని బట్టి వ్యాపారులు రేట్లు నిర్ణయించడంతో ఒక్కోచోట ఒక్కో ధర పలికాయి. పెరిగిన దిగుమతులు... రామ్‌నగర్‌లోని దయార హోల్‌సేల్ చేపల మార్కెట్‌కు రోజుకు 20 నుంచి 25 లారీల్లో చేపలు దిగుమతవుతుంటాయి. అయితే... మృగశిర కార్తె డిమాండ్ దృష్ట్యా శనివారం 45 నుంచి 50 లారీల్లో సరుకు దిగుమతైనట్లు టీ జీఆర్ కంపెనీ అధినేత గోవిందరాజ్ తెలిపారు. ఆదివారం నాడు ఇంకా ఎక్కువ గిరాకీ ఉండే అవకాశం ఉన్నందున 100-120 లారీల వరకు సరుకు దిగుమతయ్యే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట, సూర్యాపేట, కోదాడ నుంచే కాకుండా ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేపలు దిగుమతైనట్లు గంగపుత్ర సంఘం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. ‘మాకు ఐస్ సమస్య అధికంగా ఉంది. కరెంట్ కోతల వల్ల ఈ దుస్థితి ఎదురైంది. ఒక్క బ్లాక్ ఐస్‌కు రూ.450-500లు వసూలు చేస్తున్నారు. ఆ ప్రభావమే చేపల ధరలపై పడింది. అందుకే రేట్లు అమాంతం పెరిగాయి’ అని ఆయన వివరించారు. మార్కెట్ల కళకళ... ధరల సంగతెలా ఉన్నా... సెంటిమెంట్ ప్రభావం చేపల మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. నగరంలోని చిన్నా, పెద్దా అన్ని మార్కెట్లు వినియోగదారులతో కళకళలాడాయి. ఆనవాయితీ కారణంగా మాంసాహారులైన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పరిమాణంలో చేపలు కొనుగోలు చేయడం కనిపించింది. దీంతో అన్ని మార్కెట్లలో చేపల వ్యాపారం జోరుగా సాగింది.