Gregorian calendar
-
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ప్రపంచం మొత్తం ఇంచుమించుగా ఒకే ఏడాదినే ఫాలో అవుతుంది. ఆయా దేశ కాలమాన పరిస్థితుల రీత్యా న్యూ ఇయర్ వేడుకులు వేర్వేరుగా జరగుతాయేమో..! గానీ అన్ని చోట సంవత్సరం ఒకటే ఉంటుంది. ఆయా స్థానిక సంప్రదాయాలు, మతాలు రీత్యా ఉండే ఏడాదులు వేరుగా ఉంటాయి. కానీ అంతర్జాతీయంగా ఫాలో అయ్యే ఇయర్ అనేది ప్రపంచమంతా ఒకటే ఉంటుంది. కానీ ఒక దేశం మాత్రం ఇంకా 2016వ సంవత్సరంలోనే ఉంది. ఇదేంటీ..? అనుకోకండి. ఎందుకుంటే..? అక్కడ దాదాపు ఏడేళ్లు వెనుక్కు ఉంటారట. మరీ వేరే దేశాలతో జరిగే కార్యకలాపాల్లో ఎలా..? అనే కదా..!. అందుకు వారేం చేస్తారంటే..ఇధియోపియా ఇంకా 2016వ ఏడాదిలోనే ఉంది. వచ్చే సెప్టంబర్11కి 2017 ఏడాదిలోకి అడుగుపెడుతుందట. దాదాపు ఎనిమిదేళ్ల వ్యత్యాసమా అని ఆశ్చర్యంగా ఉన్నా. ఇది వాస్తవం. ఆఫ్రికాలో రెండో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిన ఇధియోపియా దేశం తమ సంప్రదాయ సమయపాలనకు కట్టుబడి ఉంది. ప్రపంచమంతా గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అయితే..అక్కడ మాత్రం ఆర్థోడాక్స్ చర్చి క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే ఏడు లేదా ఎనిమిదేళ్లు వెనుక్కు ఉంటుంది. చెప్పాలంటే ఇథియోపియా దేశం తమ సాంప్రదాయిక వ్యవస్థన పట్ల ఉన్న నిబద్ధతను చాటేలా.. తన సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని ప్రతిబింబించేలా తాప్రతయపడుతోంది. అందుకోసమే ఇలా ప్రత్యేక క్యాలెండర్‌ని ఫాలో అవుతుంది. అంతేగాదు తాము వలస రాజ్యాన్ని వంటబట్టించుకోలేదని, మాకు స్వంత క్యాలేండర్, స్వంత వర్ణమాల ఉందని సగౌర్వంగా చెబుతున్నారు ఇథియోపియా వాసులు. ఇక ఇధియోఫియా క్యాలెండర్లో ఏకంగా 13 నెలలు ఉంటాయి. వాటిలో 12 నెలల్లో ఒక్కొక్కటి 30 రోజులు ఉండగా చివరినెల ఒక విధమైన సమయపాలను ఉంటుంది. ఇక్కడ ప్రజలు రెండు క్యాలెండర్లును ఫాలో అవ్వుతారు. అందరూ ఫాలో అయ్యే గ్రెగోరియన్ క్యాలెండర్ తోపాటు తమ దేశ క్యాలెండర్‌ని అనుసరిస్తారు. అందువల్ల ఇక్కడ ప్రజలు బర్త్ సర్టిఫికేట్లు రెండు ఉంటాయి. వాటిని ప్రాంతాల వారిగా ఒక తేదీ, అంతర్జాతీయంగా మరో తేదీ ఉంటుంది. ఇది కాస్త గందరగోళానికి గురి చేసే వ్యవహారమే అయినా వాళ్లు మాత్రం అలానే అనుసరించడం విశేషం. ఇథియోపియాలో పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కూడా. అయితే అక్కడ ప్రజలకు మాత్రం ఇదేమంత పెద్ద విషయం కాదు. వాళ్లు చాలా సులభంగా రెండు క్యాలెండర్లను అనుసరిస్తారు.(చదవండి: డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?) -
Russia-Ukraine War: రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్ ‘నో’
కీవ్: తమ భూభాగంపై దురాక్రమణకు దిగిన రష్యాపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్ శతాబ్దకాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికీ తిలోదకాలు ఇచి్చంది. వందేళ్లకుపైగా ఉక్రెయిన్ జనవరి ఏడో తేదీనే క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటోంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్.. రష్యాతోపాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్ క్యాలెండర్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది. ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఈఏడాది తొలిసారిగా డిసెంబర్ 25వ తేదీనే క్రిస్మస్ వేడుకలు ఉక్రెయిన్ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి. ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ‘ ఉక్రేనియన్లు సొంత సంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించనున్నారు’ అని ఈ సందర్భంగా జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో క్రైస్తవ జనాభానే అధికం. ఉక్రెయిన్‌లో దశాబ్దాలుగా రష్యన్ ప్రాచీన చర్చి సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం. -
2020 యుగాంతం: అంతా ఉత్తుత్తిదే
న్యూఢిల్లీ: డూమ్స్‌డే ప్రవచనాలు, మయాన్ క్యాలెండర్ ప్రకారం జూన్ 21, 2020 నాటికి ప్రపంచం అంతమైపోతుందని కొంతమంది సిద్దాంతకర్తలు పేర్కొడనంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అదేరోజు అమావాస్య, సూర్యగ్రహణం కూడా రావడంతో ఇది నిజమే అయ్యింటుందని భావించి ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. నిన్న(ఆదివారం) 2020 జూన్ 21 ముగియడంతో అదంతా ఉత్తుత్తిదే అని తెలీంది. అయితే ఈ ఏడాది 2020లో విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు సోకి.. లక్షల్లో మరణించడంతో మయాన్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచం అంతమైపోతుందని సిద్దాంతకర్తలు అంచనా వేశారు. ఇంతకుముందు కూడా మయాన్ క్యాలెండర్ ప్రకారం 2012లో ప్రపంచం ముగియనుందంటూ పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే జూన్ 21 ముగియడంతో 2012 మాదిరిగానే మాయాన్ క్యాలెండర్ అంతా అబద్ధమేనని మరోసారి రుజువైంది. (2012 కాదు, 2020లో యుగాంతం!) ఈ మాయాన్ క్యాలెండర్ అనేది 1582 సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది. అయితే దీనికి ముందు తేదీలను కనుగొనడానికి వివిధ క్యాలెండర్లను ఉపయోగించాల్సి వచ్చిందని సిద్దాంతకర్తలు తెలిపారు. అయితే ఆ సమయంలో ప్రజలు ఎక్కువగా మయాన్, జూలియన్ క్యాలెండర్లను అనుసంరించేవారని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ దేశ ప్రజలు ఎక్కువగా గ్రెగోరియన్ క్యాలెండర్‌నే అనుసరిస్తున్నారు. ఈ వింతైన సిద్ధాంతం ప్రకారం జూలియన్ క్యాలెండర్ మరో క్యాలెండర్‌కు మార్చబడుతున్న సమయంలో ఈ క్యాలెండర్ నుంచి సంవత్సరంలోని 11 రోజులు పోయాయాని నిపుణులు పేర్కొన్నారు. ఈ తర్వాత రోజులు ఆ రోజులు జతచేయబడ్డాయి. కానీ దీని ప్రకారం ప్రస్తుతం మనం 2020లో కాకుండా 2012లో ఉన్నామని నిపుణులు చెబుతున్నారు. (తూచ్.. యుగాంతం ఉత్తదే!) దీని గురించి పాలో తగలోగుయిన్ అనే శాస్త్రవేత్త ఈ సిద్దాంతాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ... ‘జూలియన్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం మనం సాంకేతికంగా 2012లో ఉన్నాము. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన 11 రోజులను కొల్పోయాం. గ్రెగోరియన్ క్యాలెండర్ బట్టి (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు ఉపయోగించి 268 సంవత్సరాలు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం మనం జూన్ 21, 2020 అనేది కి డిసెంబర్ 21, 2012 అవుతుంది. దీంతో కొంతమంది సిద్ధాంతకర్తలు 2012 డిసెంబర్ 21ని ప్రపంచ అంతంగా ప్రతిపాదించారు. . -
2020లో యుగాంతం, తెరపైకి కొత్త వాదన!
2020 ఈ ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ సంవత్సరం గురించి ఎవరిని అడిగిన ఇలాంటి భయంకరమైన ఏడాదిని ఎప్పుడు చూడలేదనే చెబుతారు. ఈ ఏడాదిలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రకృతి విపత్తులు, కరోనా వైరస్ దాడి, భూకంపాలు సంభవించి మానవ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. అందుకే చాలా మంది 2020లోనే యుగాంతం కాబోతుందా? భూమి అంతరించిపోతుందా అని ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ఈ ఏడాదే యుగాంతం, త్వరలో భూమి అంతరించపోబోతుంది, అందరూ చనిపోతారు అంటూ ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే 2012 డిసెంబర్ 21న మయాన్ క్యాలెండర్ ప్రకారం భూమి అంతమవుతుందనే వాదన అప్పట్లో గట్టిగా వినిపించింది. దాని మీద ‘2012’ అనే పేరుతో హాలివుడ్లో భారీ బడ్జెట్ సినిమాను కూడా తీశారు. అయితే 2012 వెళ్లిపోయి కూడా నేటికి 8 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం మనం 2020లో ఉన్నాం. అయితే మనం గ్రెగోరియన్ క్యాలండర్‌ను అనుసరిస్తున్నామని, మయాన్ క్యాలండర్ తప్పని శాస్త్రవేత్త, పండితుడు పాలో తగలోగుయిన్ ఒక ట్వీట్ చేశారు. దానిలో ‘జూలియన్ క్యాలెండర్ తరువాత, మనం సాంకేతికంగా 2012లో ఉన్నాం. గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి మారడం వల్ల సంవత్సరంలో కోల్పోయిన రోజులు 11... 268కి గ్రెగెరియన్ క్యాలెండర్ (1752-2020) సార్లు 11 రోజులు = 2,948 రోజులు. 2,948 రోజులు / 365 రోజులు (సంవత్సరానికి) = 8 సంవత్సరాలు’ అని పేర్కొన్నాడు. చదవండి: (తూచ్.. యుగాంతం ఉత్తదే!) దీనిని బట్టి చూస్తే జూలియన్ క్యాలెండర్ ప్రకారం టెక్నికల్ గా మనం 2012లోనే ఉన్నాం. జూలియన్ క్యాలెండర్ నుంచి మనం గ్రెగోరియన్ క్యాలెండర్‌లోకి రావడం వల్ల ఏడాదికి 11 రోజులు తగ్గుతుంది. 1752 నుంచి 2020 వరకు అంటే 268 సంవత్సరాలు. సంవత్సరానికి 11 రోజులు చొప్పున తగ్గాయి కాబట్టి 268ని 11తో గుణిస్తే 2948 రోజులు వస్తాయి. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి, ఆ 2948ని 365తో భాగిస్తే 8 సంవత్సరాలు అవుతుంది. ఆ లెక్కన 2020లో 8 సంవత్సరాలు తీసేస్తే 2012లోనే ఉన్నట్టు లెక్క అని పాలో తగలోగుయిన్ వాదిస్తున్నారు. మయాన్ క్యాలెండర్లో 2012 గ్రెగోరియన్ క్యాలండర్లో 8 సంవత్సరాల తరువాత ఉంది. దీని ప్రకారం 2020 జూన్ 21న ఈ భూమి అంతం కానుందని పాలో తగలోగుయిన్ తెలిపారు. అయితే ఈ పోస్ట్‌ను వెంటనే ట్విటర్ తొలగించింది. అయినప్పటికి దీనిపై కొంత మంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీని ఆధారంగా సోషల్‌మీడియా వేదికగా రకరకాల చర్చలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆధారం లేని వాదనలని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొట్టిపడేసింది. -
శేషం ‘0’ వస్తే లీపు సంవత్సరమేనా?
ఏడాదికి 365 రోజులు.. ఏ రోజు.. ఏ పని చేయాలో మనలో చాలా మంది క్యాలెండర్లో టిక్ చేసుకుని పెట్టుకుంటారు... అదే లీప్ ఇయర్ అయితే.. ఏడాదిలో ఒక్కరోజు అదనంగా వచ్చి చేరుతుంది... 365 రోజుల క్యాలెండర్ కాస్తా 366 తేదీలతో కళకళలాడుతుంది.. ఈ ఏడాది ఆ ప్రత్యేకమైన రోజు శనివారం రావడంతో స్పెషల్ డే కాస్తా చాలామందికి హాలిడే అయిపోయింది. అయితేనేం నాలుగేళ్లకొకసారి వచ్చే లీప్ ఇయర్‌ను ఎంజాయ్ చేసేందుకు అంతా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ అరుదైన రోజున పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనే వారి ఆనందం రెట్టింపైంది. అంతేకాదు సర్చ్ ఇంజన్ గూగుల్.. ఈసారి ‘జంపింగ్ డూడుల్’తో లీప్ ఇయర్‌ను సెలబ్రేట్ చేస్తోంది. ఈ సందర్భంగా... అసలు లీప్ ఇయర్ అంటే ఏంటి.. ఇది ఎప్పుడు మొదలైంది.. ఈ ఎక్స్ట్రా డే వెనుక ఉన్న వివరాలు కొన్నింటిని తెలుసుకుందాం. అందుకే 29 రోజులు మానవాళి మనుగడ సాగించే భూ గ్రహం.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి దాదాపు 365.2422 రోజుల సమయం పడుతుందన్న విషయం తెలిసిందే. ఇందులో 365 రోజుల కాలాన్ని సాధారణంగా ఒక సంవత్సరంగా పేర్కొంటారు. అయితే, 365 మీద ఉన్న 0.2422 రోజును 0.25 రోజుగా పరిగణిస్తే, ఇలా ఏడాదికి దాదాపు ఆరు గంటలు మిగులుతుంది. ఇదంతా కలిసి, నాలుగేళ్లకు 24 గంటలు అంటే ఒక రోజు అవుతుంది. అలా మిగిలిన రోజును నాలుగేళ్లకు ఒకసారి క్యాలెండర్లో చేర్చుతారు. ఇలా అదనపు రోజు వచ్చిన ఏడాదిని లీపు సంవత్సరంగా పిలుస్తారు. అందుకే, సాధారణ సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉండగా.. లీపు సంవత్సరంలో 29 రోజులుంటాయి. రోమన్ చక్రవర్తి జూలియన్ సీజర్ కాలంలో లీపు సంవత్సరం ప్రారంభమైంది. క్యాలెండర్ ప్రవేశపెట్టిన తర్వాత.. క్రీస్తు పూర్వం 45లో జూలియన్ సీజర్ నాలుగేళ్లకోసారి.. ఈ అదనపు రోజును క్యాలెండర్లో చేర్చాడు. అయితే క్రీస్తుశకం 1582లో జూలియన్ క్యాలెండర్ రూపకల్పనలో పదిరోజుల వ్యత్యాసం రావడంతో.. పోప్ గ్రెగరీ 13 కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. అందులో ఒకరోజు అధికంగా వచ్చే సంవత్సరానికి ‘లీప్ సంవత్సరం’గా నామకరణం చేశాడు. ఫిబ్రవరి నెలలో 29వ తేదీ చేర్చి దానిని అధికారికంగా క్యాలెండర్లో చేర్చాడు. శేషం 0 అయితే లీపు సంవత్సరమేనా? నాలుగుతో భాగిస్తే శేషం 0 వచ్చే సంవత్సరం లీపు ఇయర్ అవుతుందని చాలామంది భావిస్తారు. అయితే శేషం వచ్చిన ప్రతీ ఏడాది లీప్ ఇయర్ కాదు. ఉదాహరణకు 2100ను 4తో భాగిస్తే శేషం 0 అయినప్పటికీ అది లీపు సంవత్సరం కాదు. ఎందుకంటే... మనం చెప్పుకొన్నట్లుగా భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 365.2422 రోజులు. ఇందులో మనం 0.25 రోజు మిగులుతున్నట్లు పరిగణించాం. కానీ, నిజానికి 365.2422ను కచ్చితంగా లెక్కిస్తే.. అంతా కలిసి 400 ఏళ్లలో మూడు రోజులు అవుతాయి. అలా నాలుగు శతాబ్దాల్లోని మూడు రోజుల వ్యత్యాసం భర్తీ అయ్యేక్రమంలో.. మూడు లీపు సంవత్సరాలు మిస్సవుతాయి. ఇక ఫిబ్రవరి 29న జన్మించిన వారిని లీప్ లింగ్స్ లేదా లీపర్స్ అని పిలుస్తారు. వీరు అందరిలా ఏడాదికోసారి కాకుండా.. నాలుగేళ్లకు ఓసారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. మనిషి సగటు ఆయుష్షు 60 ఏళ్లు అనుకుంటే వీరు కేవలం 15సార్లు మాత్రమే బర్త్‌డే కేక్ కట్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా మనం పైన చెప్పుకొన్నట్లు మిస్సైన మూడు లీపు సంవత్సరాల్లోని ఏడాదిలో వస్తే మరో బర్త్‌డే సెలబ్రేషన్ కూడా మిస్సవుతారు. వాతావరణ పరంగా లీప్ ఇయర్లో గుర్తుంచుకోదగిన రోజులు హాటెస్ట్ లీప్డే: 1940(టెక్సాస్‌లోని పలు ప్రాంతాల్లో 100 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతలు) కోల్డెస్ట్ లీప్డే: 1956(-66 డిగ్రీ ఫారెన్హీట్లు, అలస్కా) వెట్టెస్ట్ లీప్డే: 1984(21 ఇంచుల వర్షపాతం- హవాయి) స్నోయియెస్ట్ లీప్డే: 1944(33 ఇంచుల హిమపాతం- కాలిఫోర్నియా) -
క్యాలెండర్ కథ
వివిధ సంస్కృతులలో వివిధ రకాలైన క్యాలెండర్లు ఉన్నప్పటికీ అందరికీ ఒకే క్యాలెండర్ ఉంటే సమన్వయ పరచుకోవడానికి అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రపంచదేశాలన్నీ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అంగీకరించాయి. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న 365. 25 రోజుల క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరే. మొదట్లో సెప్టెంబర్... 7వ నెల! ఇంగ్లిష్ క్యాలెండర్‌లోని సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలను మన తెలుగు అంకెలతో పోలిస్తే , సెప్టెంబరు అనే పదం మన సప్త సంఖ్యను పోలి ఉంటుంది. మొదట తయారయిన ఇంగ్లిష్ క్యాలెండర్లో సెప్టెంబరు మాసం ఏడవది కావడం వల్ల ఆ పేరును నిశ్చయించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే అక్టోబరు - అష్ట, నవంబరు - నవ, డిసెంబరు - దశ... ఈ పదాలన్నీ కూడా మన పదాలకు దగ్గర దగ్గరగా ఉన్నాయి. పోప్ గ్రెగరీ -గీఐఐఐ, 1572లో చక్రవర్తిగా ఎన్నికైనప్పుడు, నాటి మేధావి వర్గం క్యాలెండర్ సవరణల గురించి ప్రతిపాదన తీసుకురావడంతో, అప్పటివరకు ఉన్న జూలియన్ క్యాలెండర్‌ను మార్పు చేసి గ్రెగోరియన్ క్యాలెండర్‌ను వాడుకలోకి తెచ్చారు. గ్రెగోరియన్ క్యాలండర్‌నే వెస్టర్న్ క్యాలెండర్ అని, క్రిస్టియన్ క్యాలెండర్ అని కూడా అంటారు. పోప్ గ్రెగరీ -గీఐఐఐ పేరు మీద రూపొందిన ఈ క్యాలెండర్‌ని నేడు అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్నారు. అంతకు ముందు ఉన్న జూలియన్ క్యాలెండర్‌ని కొద్దిగా అంటే కేవలం 0.002 శాతం మాత్రం మార్పులు చేసి దీనిని రూపొందించారు. ఈ మార్పుని ముందుగా ఐరోపా ఖండంలోని క్యాథలిక్ దేశాలు అంగీకరించాయి. ప్రొటెస్టంట్లు, తూర్పున ఉన్న శుద్ధ సంప్రదాయ దేశాలు ఈ క్యాలెండర్‌ని అంగీకరించడానికి చాలాకాలమే పట్టింది. గ్రెగోరియన్ క్యాలెండర్ సూర్యమానం ఆధారంగా రూపొందింది. ఈ క్యాలెండర్‌ని అంగీకరించిన ఆఖరి దేశం గ్రీస్ (1923). కొత్త సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ జూలియన్ క్యాలెండర్లో చేసిన ముఖ్యమైన మార్పు లీపు సంవత్సరం. ఆ ప్రకారం జనవరికి 31 రోజులు ఉంటే, ఫిబ్రవరికి 29 రోజులు, మార్చి నెలకు 31 రోజులు... ఇలా వస్తాయి. క్రీ.పూ. 222 వరకు మే 1 వ తేదీని, కొంతకాలానికి మార్చి 15 వ తారీకుని, క్రీ.పూ. 153 నుంచి జనవరి 1 వ తేదీని కొత్త సంవత్సరంగా ప్రకటించారు. - డా. పురాణపండ వైజయంతి