Group - 2 Notification
-
గ్రూప్-2 గెట్ రెడీ.. ఏపీలో పది రోజుల్లో నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: విజయ దశమి వేళ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వతేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తద్వారా గ్రూప్–2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తోంది. యువత వినతిపై స్పందించిన సీఎం గ్రూప్స్ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ పలు సందర్భాల్లో అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో అనుమతినిచ్చిన పోస్టులతో పాటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని స్పష్టం చేయడంతో తాజాగా గ్రూప్ 2 విభాగంలో 212 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆయా శాఖల నుంచి పోస్టుల ఖాళీలను నిర్దారించుకున్న వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వీస్ కమిషన్‌కు ఉత్తర్వుల్లో సూచించారు. రోస్టర్ పాయింట్లతో పాటు విద్యార్హతల ఆధారంగా నిబంధనల మేరకు ఈ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థికశాఖ కోరింది. గ్రూప్స్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. నోటిఫికేషన్ నాటికి ఆయా శాఖల్లో ఉన్న మరిన్ని ఖాళీలను సైతం కలపనున్నారు. దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. -
గ్రూప్-2 నోటిఫికేషన్ రిలీజ్.. పోస్టులు, అప్లై తేదీల వివరాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో కీలకమైన గ్రూప్–2 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. 18 శాఖల్లో 783 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రకటన విడుదలైంది. 2023 జనవరి 18 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. అభ్యర్థుల విద్యార్హతలు, వయోపరిమితి తదితర వివరాలను కమిషన్ వెబ్సైట్లో చూడాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ ఉద్యోగ ఖాళీల్లో అత్యధికంగా సాధారణ పరిపాలన విభాగం పరిధిలో 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఆ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, భూ పరిపాలన శాఖలో 98 నయాబ్ తహసీల్దార్ పోస్టులున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండోసారి భర్తీ చేస్తున్న గ్రూప్–2 పోస్టుల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలుండటంతో నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–4 కేటగిరీలతోపాటు పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ... అతిత్వరలో గ్రూప్–3 ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. మరిన్ని వివరాల కోసం సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయగలరు. -
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొలువుల మేళా మొదలైంది. 439 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-2 ఉద్యోగాలకు ఏప్రిల్ 24, 25 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్, ఏసీటీవో, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసింది. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా రేపు మరికొన్ని నోటిఫికేషన్లను టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. గ్రూప్-2 పోస్టుల వివరాలు....