guda
-
ఆంధ్రజ్యోతికి ‘గుడా’ నోటీసులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిబంధనలకు విరుద్ధంగా రెండు అంతస్తుల ప్రింటింగ్ కార్యాలయాన్ని నిర్మించిన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోగా స్పందించాలంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 208/5ఎలో ప్రింటింగ్ ప్రెస్ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి. అయితే, దీని నిర్మాణం కోసం డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అధికారుల నుంచి గానీ, ‘గుడా’ నుంచిగానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదు. భవన ప్రధాన ముఖ ద్వారం రోడ్డు కాకుండా మరో రోడ్డు (పెరిఫెరల్ రోడ్) కూడా నిర్మించాల్సి ఉండగా.. ఇక్కడ అలాంటిదేమీ చేపట్టలేదు. ‘గుడా’ అధికారులపై ఆంధ్రజ్యోతి ఒత్తిళ్లు అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అప్రమత్తమైంది. తమ భవనానికి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇవ్వాలని గుడా అధికారులపై ఒత్తిడి తెస్తోంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకోవాలని గుడా వర్గాలు చెప్పినా పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ కింద అయితే సుమారు రూ. 70 లక్షలు చెల్లించాల్సి వస్తోందని ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు గుడా అధికారులు ఈ నెల 25న ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతికి గుడా జారీ చేసిన నోటీసు -
‘గుడా’ తో గ్రామీణాభివృద్ధి సాధ్యం
చైర్మన్ గన్ని కృష్ణ 13 మండలాల కార్యదర్శులకు అవగాహన సదస్సు నేడు కాకినాడలో మరో 13 మండలాలకు.. రాజమహేంద్రవరం సిటీ : గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరిగి, అభివృద్ధి సాధ్యమౌతుందని చైర్మన్ గన్నికృష్ణ పేర్కొన్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో గల 13 మండలాలకు చెందిన పంచాయితీ కార్యదర్శులు, లైసెన్స్డ్ సర్వేయర్ల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ‘గుడా’ వల్ల గ్రామాల్లో ప్రజలపై భారం పడుతుందనే అపోహలు పూర్తిగా విడిచిపెట్టాలన్నారు. ‘వుడా’ ఏర్పాటుతో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ‘గుడా’ పరిధిలోని అన్ని మండలాల్లో పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు గుడాపై పూర్తి అవగాహన కలిగి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. గుడా వైస్ చైర్మన్, కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ గుడా పరిధిలోని 26 మండలాల్లో 253 పంచాయతీలుండగా వాటిలో మొదటి దఫాగా 13 మండలాలకు రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని మిగిలిన, 13 మండలాలకు గురువారం కాకినాడలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు నిర్మాణం చేయాలంటే అన్ని ఆన్లైన్ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. 300 స్క్వేర్ మీటర్ల కన్నా తక్కువ స్థలం ఉన్న వారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇస్తారని, అది దాటితే గుడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లు అవకతవకలకు పాల్పడితే రెండేళ్లు బ్లాక్ లిస్ట్‌లో పెడతానని హెచ్చరించారు. గుడా సభ్యులు గట్టి సత్యనారాయణ, నాని, రవి, టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ సాయిబాబా పాల్గొన్నారు. -
క్రియాశీలకంగా ‘గుడా’
– చైర్మన్, వైస్ చైర్మన్ నియామకంతో కార్యకలాపాలు వేగవంతం –‘గుడా’ పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ – ప్రత్యేకాధికారిగా సంజయ్‌రత్నకుమార్ – రాజమహేంద్రవరంలో జోనల్ కార్యాలయం సాక్షి, రాజమహేంద్రవరం : కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా) కార్యకలాపాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. గుడా చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణను నియమించిన ప్రభుత్వం కాకినాడలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ రెవెన్యూ కార్యాలయంలో గుడా జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుడాకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపాందించేందుకు నియమించిన ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గుడా పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించి మంగళవారం వైస్ చైర్మన్ విజయరామరాజు అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుడా పరిధిలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగరపంచాయతీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, టౌన్‌ప్లానింగ్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, గుడా మాస్టర్‌ప్లాన్ తయారీ ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్ హాజరయ్యారు. గుడా పరిపాలనపై కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు వైస్ చైర్మన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీస్ చట్టం–2016 కింద జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఇక నుంచి గుడా పరిధిలో భవనాల నిర్మాణం, ఇతర అనుమతుల కోసం గుడాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం గుడా వారికి అనుమతులు మంజూరు చేస్తుంది. అంతేకాక పురపాలక శాఖ విడుదల చేసిన జీవో 439 ప్రకారం నగర, పురపాలక సంఘాలు అభివృద్ధి చార్జీలు, బిల్డింగ్ ఫీజులు, లే అవుట్ల అనుమతులకు ఫీజులు ఆయా సంఘాలు గుడాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి కొత్త నిర్మాణాలు, లే అవుట్లు చేపట్టాలంటే గుడా అనుమతి తప్పనిసరి. గుడా పరిధిలో లే అవుట్లు, భవనాల నిర్మాణాలకు ప్లాన్లు తయారు చేసే లైసెన్స్ సర్వేయర్లు తమ పేర్లు తప్పనిసరిగా గుడా వద్ద నమోదు చేయించుకోవాలని వైస్ చైర్మన్ తెలిపారు. ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు చర్యలు గుడా పరిధిలోని ప్రాంతాలకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న ప్లానింగ్ అధికారి సంజయ్రత్నకుమార్ను గుడా ప్లానింగ్ అధికారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైస్ చైర్మన్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కావడంతో ఇక్కడే ఉంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్‌ను రూపాందించిన అనుభవం కమిషనర్‌కు ఉండడం గుడా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఉపయోగపడనుంది. గుడాకు మాస్టర్‌ప్లాన్ రూపాందించి అమలు చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
‘గుడా’ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించాలి
ఎమ్మెల్యేలు మద్దతు లేఖలతో సరిపెట్టకూడదు రాజమహేంద్రవరంలో ఏర్పాటుతో ‘గుడా’ పేరుకు సార్థకత విలేకర్ల సమావేశంలో అఖిలపక్ష నేతలు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేద్రవరం నగరపాలకసంస్థ పాలక మండలి సాధారణ సమావేశంలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అజెండాలో పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని అఖిల పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. గోదావరి నది పేరుతో పెట్టిన గుడా కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ పేరుకు సార్థకత ఉంటుందన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలోని ఆనం రోటరీ హాల్లో నగరపాలక సంస్థ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు ‘గుడా’ కార్యాలయం ఏర్పాటు అంశాన్ని అజెండాలో పెట్టినట్టు తెలిపారు. ఇందుకు మద్దతుగా సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు లేఖలు ఇచ్చారని చెప్పారు. మార్చి 25న జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలు రాలేదని, రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్లో ఈ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం పరిపాలన తీరుతో స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చి సరిపెట్టకుండా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కొంత మంది నేతలు గుడా కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినా మద్దతు తెలుపుదామంటున్నారని, గోదావరి తల్లి పేరుతో ఉన్న గుడా కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడమే సరైన నిర్ణయమన్నారు. అలాంటి నేతలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు, తర్వాత రాజమహేంద్రవరం అభివృద్ధికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. రాజకీయ నేతలు దృష్టి సారిస్తే ఆ హామీలలో కొన్నయినా కార్యరూపం దాల్చేవని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్న రాజమహేంద్రవరంలోనే గుడా కార్యాలయం ఏర్పాటు చేయడం సమంజసమన్నారు. గుడా కార్యాలయం ఏర్పాటుకు తమ పార్టీ తరఫున పోరాటాలు చేయడానికైనా సిద్ధమని వైఎస్సార్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు చెప్పారు. ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ లేఖలు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గుడా కార్యాలయం సాధించే వరకు ఎమ్మెల్యేలు ముందుండాలని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు కోరారు. ఈ అంశానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ Ðవెంకట సుబ్బారాయుడు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, వైఎస్సార్సీపీ నేతలు పెంకే సురేష్, మజ్జి అప్పారావు, వాకచర్ల కృష్ణ, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, కోడికోట, ఆరీఫ్, కాంగ్రెస్ పార్టీ నేత ఆకుల భాగ్యలక్ష్మి, అధ్యాపకులు విక్టర్‌బాబు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ సునీల్, బీజేపీ నేత మట్టాడి జయప్రకాష్, ఆర్ఎంపీ డాక్టర్ బళ్లా శ్రీనివాస్, మీడియా ఇన్చార్జి ఆర్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వేగంగా గుడా కార్యకలాపాలు
పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశం కాకినాడ సిటీ : గోదావరి అర్భ¯ŒS డెవలప్మెంట్ అథార్టీ (గుడా) కార్యకలాపాలను వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవ¯ŒS జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. గుడా కార్యకలాపాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ ఏర్పాటుకు భవనాలు త్వరితగతిన చూడాలని, ఇప్పటికే కార్యాలయ ప్రధాన పోస్టులు మంజూరు చేశామని, మిగిలిన అధికారులు సిబ్బంది నియమకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రధానంగా గ్రామాల్లో నా¯ŒSలేఅవుట్లు ఎక్కువై ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గుడా ఏర్పాటుతో ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో అపోహలకు తావులేకుండా అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరె¯Œ్సలో కలెక్టరేట్ నుంచి గుడా ఇ¯ŒSచార్జ్ వైస్ చైర్మన్, రాజమహేంద్రవరం కార్పొరేష¯ŒS కమిషనర్ విజయరామరాజు, మున్సిపల్ ఆర్డీడీ సాయిబాబు, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎ¯ŒS మూర్తి, డీపీవో గంగాధర కుమార్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ప్రసాద్ పాల్గొన్నారు.