gundu hanumantha rao
-
అమృతం సీరియల్ చేయడానికి కారణం ఇదే..!
-
గుండు నవ్వులు ఇక లేవు
‘‘పైన ఏముంది.. ఆకాశం. కింద ఏముంది.. భూమి.. ఎలా చెప్పగలిగావ్.. తాయత్తు మహిమ’ అంటూ ‘మాయలోడు’లో నవ్వులు పంచాడు. ‘యావన్మంది భక్తులకు విజ్ఞప్తి. మా గురువుగారయినటువంటి శ్రీ డీవీఎస్ పండుశాస్త్రిగారు తప్పిపోయారు. ఆయనకి ఏకాదశి చంద్రుడిలాంటి బట్టతల.. భద్రాచలం దేవస్థానం వారు ఉచితంగా ఇచ్చిన ధోవతి.. అన్నవరం దేవస్థానం వారు ఫ్రీగా ఇచ్చిన శాలువా.. ఆయన్ని చూస్తే ఒక మహా పండితుడు, బ్రహ్మజ్ఞాని అని ఎవ్వరూ అనుకోరు’ అంటూ ‘ఆట’ చిత్రంలో బ్రాహ్మణుడిగా హాస్యం పండించాడు. ‘నాలుగు రోజుల నుంచి స్నానం చేయకపోవడంతో పిచ్చెక్కిపోయిందనుకో. ట్యాంకులో నీళ్లు అడుగున ఉన్నాయి. మా కుళాయికి ఎక్కడం లేదు. అందుకే ట్యాంకులో దిగి స్నానం చేస్తున్నా’ అంటూ ‘అమృతం’ సీరియల్లో కడుపుబ్బా నవ్వించాడు. సుమారు 400 సినిమాల్లో హాస్యనటుడిగా ఇలా నవ్వులు పంచిన గుండు హనుమంతరావు (61) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు సోమవారం ఉదయం 3.30 గంటల సమయంలో అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నాటకాల నుంచి సినిమాలకు.. గుండు హనుమంతరావు 1956, అక్టోబర్ 10న కాంతారావు, సరోజిని దంపతులకు విజయవాడలో జన్మించారు. తండ్రి చేసిన మిఠాయి వ్యాపారం చూసుకుంటూనే నాటక రంగం మీద ఆసక్తితో 18ఏళ్లకే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. ఆయన వేసిన మొదటి వేషం ‘రావణబ్రహ్మ’. స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఆయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్లంట’ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అహ నా పెళ్లంట, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్ హీరో, కొబ్బరి బోండాం, బాబాయ్ హోటల్, శుభలగ్నం, క్రిమినల్, పెళ్లాం ఊరెళితే, భద్ర’ వంటి చిత్రాల ద్వారా హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్ ‘అమృతం’. ఆ సీరియల్లో అంజి పాత్రలో ప్రతి ఇంటిలో ఆయన నవ్వుల జల్లులు కురిపించారనడం అతిశయోక్తి కాదేమో. తన నటనకు గాను ఆయన మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. గుండు హనుమంతరావు మృతి చెందారని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఎస్.ఆర్. నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలివచ్చి నివాళులర్పించారు. తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, నటులు మురళీమోహన్, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు గుండు హనుమంతరావు భౌతికకాయానికి నివాళి అర్పించారు. -
గుండు హనుమంతరావుకు ప్రముఖుల నివాళులు
-
ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది..
సాక్షి, హైదరాబాద్ : హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి తీరని లోటు అని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. అనారోగ్యంతో గుండు హనుమంతరావు సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..‘తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్య నటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను. పరిపూర్ణ ఆరోగ్యంతో గుండు హనుమంతరావు తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా గుండు హనుమంతరావు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు. -
కన్నీళ్లు పెట్టిన శివాజీరాజా
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యంతో మరణించిన హాస్యనటుడు గుండు హనుమంతరావుకు పలువురు తెలుగు సినిమా ప్రముఖులు నివాళి అర్పించారు. ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటని పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శిరాజీరాజా, కాదంబరి కిరణ్ తదితరులు గుండు హనుమంతరావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శివాజీరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు సన్నిహితుడైన గుండు హనుమంతరావు మరణం కలిచివేసిందన్నారు. ‘అమృతం ధారావాహిక మా ఇద్దరికి చాలా ప్రత్యేకం. చెన్నై నుంచి మా ఇద్దరి ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతరావు ఇవ్వని ప్రదర్శన లేదు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ ఆయన కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటుంద’ని శివాజీరాజా అన్నారు. మంచి వ్యక్తి: మోహన్‌బాబు గుండు హనుమంతరావు మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి అని సీనియర్ నటుడు మోహన్‌బాబు పేర్కొన్నారు.. ‘గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. మా నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చాలా సినిమాల్లో నటించాడు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాథుడిని వేడుకొంటున్నాన’ని మోహన్‌బాబు అన్నారు. -
గుండు హనుమంతరావు ఇకలేరు
-
విషాదంలో బ్రహ్మానందం
సాక్షి, హైదరాబాద్: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల తెలుగు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గుండు హనుమంతరావుతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందని బ్రహ్మానందం తెలిపారు. అహ నా పెళ్లంట చిత్రంతో తమ ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చిందని, తనను బ్రహ్మానందం బావ అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలే ఆయన తన ఇంటికి వచ్చాడని, హనుమంతు లేడంటే నమ్మలేకపోతున్నాను. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి హనుమంతరావు. నాకున్న అతితక్కువ మంది మిత్రుల్లో ఆయన ఒకరు. హనుమంతరావు ధన్యజీవి. హాస్యప్రదర్శనలతో ఎంతోమందిని అలరించాడు. జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నార’ని బ్రహ్మానందం అన్నారు. తీరని లోటు: బాలకృష్ణ ఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ‘చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది. గుండు హనుమంతరావుతో కొన్ని సినిమాల్లో కలిసి నటించాను. మృదుస్వభావి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను’ అని నివాళి అర్పించారు. -
మిఠాయిల అబ్బాయి..
సాక్షి, వెబ్ డెస్క్ : వెండితెరపై తన హావభావాలతో తెలుగువాడికి కితకితలు పెట్టిన గుండు హనుమంతరావు సోమవారం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన భౌతికంగా మనందరికీ దూరమైనా వెండితెరపై పూయించిన నవ్వులతో మన హృదయాల్లోనే ఉంటారు. 1956 అక్టోబర్ 10న విజయవాడ నగరంలో హనుమంతరావు జన్మించారు. చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిక ముందు మిఠాయిల వ్యాపారం చేశారు. ‘అహ నా పెళ్లంట’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. కెరీర్లో 400లకు పైగా చిత్రాల్లో హస్యానికి ప్రాణం పోశారు. బాబాయ్ హోటల్, కొబ్బరి బోండా, యమలీల, చినబాబు, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, తప్పుచేసి పప్పుకూడు, పెళ్లి కాని ప్రసాద్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మృగరాజు, రిక్షావోడు, కలిసుందాం రా, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, పాపారావు, మావిచిగురు, ఆలస్యం అమృతం, క్రిమినల్, పెళ్లా ఊరెళితే, బాలు తదితర చిత్రాల్లో హనుమంతరావు నటనకు మంచి గుర్తింపు లభించింది. గుండు హనుమంతరావు బుల్లితెర ధారావాహికల్లో నటించిన గుండు హనుమంతరావుకు అమృతం సీరియల్ ఎంత పేరు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేటికీ అమృతం సీరియల్ రీ-టెలికాస్ట్ అవుతోంది. బుల్లితెరలో అద్భుత నటనకు గాను హనుమంతరాదు మూడు నంది అవార్డులు అందుకున్నారు. గుండు హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హనుమంతరావుకి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 5 లక్షలు సాయం చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా హనుమంతరావుకి రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఎస్ఆర్ నగర్‌లోని నివాసంలో సోమవారం తెల్లవారుజామున 03.30 గంటలకు హనుమంతరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెయింట్ థెరిస్సా ఆసుపత్రికి తరలిస్తుండగా తనువు చాలించారు. హనుమంతరావు హఠాన్మరణం తమను కలివేసిందని పలువురు సినీ ప్రముఖులు అన్నారు. ఆయనకు నివాళులు అర్పించారు. గోకుల్ థియేటర్ ఎదురుగా ఉన్న జెట్ కాలనీలో గల హనుమంతరావు నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. -
హాస్యనటుడు గుండు హనుమంతరావు ఇకలేరు
-
గుండు హనుమంతరావు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) ఇక లేరు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా హనుమంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసిన విషయం తెలిసిందే. ‘అహనా పెళ్లంట’ సినిమాతో హనుమంత రావు సినీరంగ ప్రవేశం చేశారు. కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో మంచి హస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆయన నటించిన అమృతం సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకుంది. గుండు హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. ఆనారోగ్యం కారణంగానే కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. -
అనారోగ్యంతోనే పరిశ్రమకు దూరమయ్యా..
► 200 సినిమాల్లో నటించా.. ► సీరియల్స్‌కే ప్రాధాన్యమిస్తున్నా.. ► సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు అనారోగ్యంతోనే నాలుగేళ్లుగా సినీ పరిశ్రమకు దూరమయ్యానని ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు అన్నారు. కనిగిరిలోని ప్రగతి విద్యానిలయంలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం వచ్చిన గుండు హనుమంతరావు, సినీ నటుడు ఆలేటి అరుణ్ విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే.. 200 సినిమాల్లో నటించా..: గుండు హనుమంతరావు ‘నాకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి, ’ఇదేమిటీ’ అనే నాటకంలో జంధ్యాల గారు నా నటన చూసి, ‘అహ నా పెళ్లంటా’ సినిమాలో అవకాశం ఇచ్చారు. సినీ పరిశ్రమ తల్లి లాంటిది. అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పటి వరకు 200 సినిమాల్లో నటించా. మూడు నంది అవార్డులు వచ్చాయి. అమృతం, బ్రయోషియా, శ్రీమతి సుబ్రహ్మణ్యం సీరియల్స్‌లో ఉత్తమ నటునిగా నంది అవార్డులు వచ్చాయి. పేరు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అహనా పెళ్లంటా, రాజేంద్రుడు–గజేంద్రుడు, అమ్మదొంగ, మాయలోడు, యమలీల, అన్నమయ్య, నువ్వులేక నేనులేను, పెళ్లానికి ప్రేమలేఖ..ప్రియురాలికి శుభలేఖ, అన్నమయ్య సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. వ్యసనాలకు బానిసైన వాళ్లే పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా సీరియల్స్, స్టేజ్ షోలు చేస్తున్నాను. అమెరికా, దుబాయ్, కువైట్, సిడ్ని, ఖాతర్ తదితర చోట్ల స్టేజ్ ప్రదర్శనలు చేశా. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. నాకు ఒక కుమారుడు. ఎమ్మెస్సీ చేశాడు, హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాడు. ఇష్టమైన కమెడియన్ సునీల్... నాకు ఇష్టమైన హీరో కమల్‌హాసన్, హాస్యనటుల్లో పాతతరంలో సూర్యకాంతం, ఇప్పటి వారిలో సునీల్, వెన్నెల కిషోర్ హాస్యం బాగుంటుంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఉన్న సినిమాలో, రెండు సీరియళ్లలో నటిస్తున్నా. చదువుతూనే నటిస్తున్నా..: సినీ నటుడు వరుణ్ లజ్జ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాను. ఆ తర్వాత బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ సినిమాలో కీరోల్గా నటించా. ఈ రెండు సినిమాలు కనిగిరి ప్రాంతంలో కూడా షూటింగ్లో జరిగాయి. ఆర్పీ పట్నాయక్‌తో ‘మనలో ఒకడు’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాను. ఈనాడు చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నా. చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉండటంతో బీటెక్ చదువుతూనే సినిమాలో నటిస్తున్నా..అందుకు మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. ’ మెగా’ ఫ్యామిలీతో బంధుత్వమే సినిమాల్లో అవకాశానికి ఓ కారణం. తొలుత నువ్వే కావాలి షార్ట్ ఫిలింలో నటించడంతో మంచి పేరు వచ్చింది. పవన్ కల్యాణ్ నా అభిమాన హీరో. ఎప్పటికైనా ఆయనతో నటించాలన్నదే నా లక్ష్యం.