గుండు హనుమంతరావు (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు (61) ఇక లేరు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా హనుమంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. 400 పైగా సినిమాల్లో హనుమంతరావు నటించారు. ఇటీవల ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆయనకు రూ.2లక్షల ఆర్థికసాయం అందించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరుచేసిన విషయం తెలిసిందే.
‘అహనా పెళ్లంట’ సినిమాతో హనుమంత రావు సినీరంగ ప్రవేశం చేశారు. కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో మంచి హస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆయన నటించిన అమృతం సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకుంది. గుండు హనుమంత రావుకు భార్య, ఇద్దరు పిల్లలుండగా ఇదివరకే కూతురు, భార్య చనిపోయారు. ఆనారోగ్యం కారణంగానే కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment