gunpoint robbery
-
Viral Video: గన్‌తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
-
Live Video: గన్‌తో బెదిరించి రూ.30లక్షల కారు ఎత్తుకెళ్లారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామునే జాతీయ రహదారిపై తుపాకులతో బెదిరించి రు.30లక్షలకుపైగా విలువైన ఎస్యూవీ కారును ఎత్తుకెళ్లారు ముగ్గురు దుండగులు. అంతా చూస్తుండగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 5.19 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల రాహుల్ అనే వ్యక్తి తన ఎస్యూవీ ఫార్చునర్ కారులో ఢిల్లీకి వచ్చారు. ఈ క్రమంలో ఝరేరా గ్రామంలో జాతీయ రహదారి-8పై రోడ్డు పక్కన కారును నిలిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకడు తుపాకీ చూపించి బెదిరించాడు. మిగిలిన ఇద్దరు సైతం తుపాకులతో హల్చల్ చేశారు. కారును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 397, 34 ప్రకారం ఢిల్లీ కంటోన్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: అగ్నితో చెలగాటమా? దెబ్బకు ముఖం కాలిపోయిందిగా..! -
బయటికి వెళ్లొచ్చి బ్యాంకులో దోపిడీ
చండీగఢ్: సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు. బ్యాంకు ఉద్యోగులను బెదిరించి రూ. 10 లక్షల 44 వేలు లూటీ చేశాడు. అయితే, పోలీసులు సత్వరం స్పందించి నిందితున్ని 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ ఘటన హరియాణాలోని మొహాలీ జిల్లాలో జరిగింది. పార్చ్ గ్రామంలోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో బల్జీత్ సింగ్ సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11.20 గంటలకు బ్యాంకు డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్ పని నిమిత్తం బటయకు వెళ్లారు. తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేదు, మందులు తీసుకొస్తానని బల్జీత్ సింగ్ కూడా బయటకు వెళ్లాడు. బ్రాంచ్‌లో మేనేజర్ అమన్ గగ్నేజా, ఒక ప్యూన్ మాత్రమే మిగిలారు. అంతలోనే మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో లోనికి ప్రవేశించి వారిద్దరినీ బెదిరించి క్యాష్ బాక్స్‌తో పరార్ అయ్యాడు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తమదైన రీతిలో ప్రశ్నించడంతో బల్జీత్ సింగ్ నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నగదుతోపాటు ఓ నాటు తుపాకీ, ఐదు తుపాకీ గుళ్ల కార్ట్రిజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: విషాద ఘటనలో ఒంటరైన ‘కూవి’, దాంతో) -
తుపాకి చూపిస్తే క్యాషియర్ రియాక్షన్ ఇదా..!
అమెరికాలో గన్ కల్చర్ బాగా ఎక్కువ. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి తుపాకులు చూపించి బెదిరించి డబ్బు వసూలు చేయడం మనకు తెలిసిందే. అలా ఎవరైనా వచ్చి ఉన్నట్టుండి తుపాకి చూపించగానే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? భంయతో వణికిపోతాం కదూ. వీలైతే అరుస్తాం, దుండగుడిని భయపెట్టడానికి కూడా ఎంతో కొంత ప్రయత్నిస్తాం. కానీ, కాన్సాస్‌లో ఓ క్యాషియర్ మాత్రం అలా ఏమీ చేయలేదు. మరి తుపాకి చూపించి బెదిరించిన నిందితుడి విషయంలో అతడేం చేశాడో తెలుసా.. కాన్సాస్‌లోని జిమ్మీ జాన్స్ రెస్టారెంటుకు ఓ కస్టమర్ వచ్చాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత జేబులోంచి గన్ తీశాడు. దగ్గరున్న డబ్బులన్నీ ఇవ్వమని బెదిరించాడు. కానీ అక్కడున్న క్యాషియర్ ఏమాత్రం భయపడలేదు, కంగారు కూడా పడలేదు. తాపీగా వచ్చి ముందు చేతులకు ఉన్న గ్లోవ్స్ తీసేశాడు. చాలా కూల్‌గా క్యాష్ రిజిస్టర్ తెరిచి, అందులో ఉన్న నోట్లన్నింటినీ ఒక్కోటీ తీసి ఆ దుండగుడికి ఇచ్చాడు. అంతేకాదు, సూపర్ బజార్లలో డబ్బులు పెట్టే క్యాష్ రిజిస్టర్‌ను కూడా తీసి అతడి చేతిలో పెట్టాడు. దాంతో బిత్తరపోయిన దుండగుడు.. డబ్బులు మాత్రం తీసుకుని ఆ డబ్బాను పక్కన పెట్టి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని కాన్సాస్ పోలీసులు యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు ఇప్పటికే పది లక్షలకు పైగా వ్యూలు వచ్చాయి. నిందితుడిని పట్టుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానిమీద కామెంట్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఆ క్యాషియర్ ఎంత సిన్సియర్.. క్యాష్ వద్దకు వెళ్లే ముందు గ్లోవ్స్ కూడా తీసేశాడంటూ మెచ్చుకున్నారు. డిక్షనరీ తీసి అందులో 'ఇంపెర్చూర్బబుల్' అనే పదానికి అర్థం వెతికితే అక్కడ ఈ క్యాషియర్ ముఖం కనిపిస్తుందని మరో వ్యక్తి చెప్పారు. ఇప్పటికే ఒకటి రెండు సార్లు అతడికి అలా అయి ఉంటుందని, అందుకే ఈసారి అలవాటు పడిపోయి ఉంటాడని మరికొందరు వ్యాఖ్యానించారు. మొత్తం డ్రాయర్ అంతా తీసేసి ఇచ్చేయడం చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేకపోయామని ఇంకొందరు చెప్పారు.