Guntupalli
-
ఆ డాక్టర్ మాకొద్దు!
సాక్షి, గుంటుపల్లి (కృష్ణా) : వ్యాగన్ వర్క్‌షాపు రైల్వే వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నిర్లక్ష్యంపై గురువారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, కార్మికులు మధ్యాహ్నం భోజన సమయంలో వైద్యశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి గద్దా సురేష్ మాట్లాడుతూ ఆస్పత్రి వైద్యురాలు సుమలత రైల్వే కాలనీలో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు వైద్యశాలకు వెళితే దుర్భాషలాడుతున్నారని, మహిళా రోగులపై విరుచుకుపడుతోందని ఆరోపించారు. రోగులనే కనికరం లేకుండా అసభ్య పదజాలంతో దూషించటం వలన వారి మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సరైన వైద్యం చేయకుండా మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు విమర్శించారు. విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశ్యంతో యూనియన్ నాయకులు వైద్యశాలకు వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా ‘ఏం చేసుకుంటారో చేసుకోమని’ తెగేసి చెప్పటం దారుణమైన విషయమన్నారు. గతంలో వైద్యుల నిర్లక్ష్యంతో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, పలువురు అంగవైకల్యంతో మిగిలారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ జె.ప్రదీప్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. -
బౌద్ధారామం.. ఆంక్షల పర్వం
పశ్చిమగోదావరి,కామవరపుకోట: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గుంటుపల్లి బౌద్ధారామాల సందర్శన ఇంకా ప్రారంభం కాలేదు. గత ఆదివారం గుంటుపల్లి గుహల వద్ద భీమడోలు మండలానికి చెందిన శ్రీధరణి అనే యువతి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించడం కోసం గుంటుపల్లి సందర్శనను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈ విషయం తెలియని పలువురు సందర్శకులు గుంటుపల్లి వచ్చి తిరిగి వెళ్లిపోతున్నారు. సాధారణ రోజులతో పోల్చుకుంటే శని, ఆదివారాల్లో గుంటుపల్లి పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆదివారం గుంటుపల్లికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులను సిబ్బంది అనుమతించలేదు. దీంతో పదుల సంఖ్యలో వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు కుటుంబాలతో, స్నేహితులతో వస్తున్నారు. పోలీసు ఆంక్షల నేపథ్యంలోలో గుంటుపల్లి బౌద్ధారామాలు ఇంకా తెరుచుకోలేదు. నూజివీడు నుంచి వచ్చిన మహ్మద్ షఫీ కుటుంబం గతంలో ఇక్కడికి వచ్చినట్టు బౌద్ధారామాలు పరిసరాలు ఆకర్షనీయంగా ఉండటంతో కుటుంబసభ్యులతో వచ్చినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా మహాశివరాత్రి పర్వదినం సందర్శంగా గుంటుపల్లి బౌద్ధారామాల వద్ద ఉన్న ధర్మలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వచ్చే అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వీరిని కూడా అనుమతించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సిబ్బందిని పరిశీలిస్తే పోలీసు అధికారులు అనుమతి ఇస్తేనే లోనికి పంపిస్తామని చెప్పారు. ఆంక్షలతో కూడిన అనుమతి బౌద్ధారామాల సందర్శనకు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బౌద్ధగుహలకు ఒక మార్గం ద్వారానే సందర్శకులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇతర మార్గాలను ముళ్ల కంచెలతో మూసివేశారు. కుటుంబ సభ్యులు కాకుండా జంటగా వెళ్లే వారి నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. హత్యోదంతం నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేయనున్నారు. సందర్శకులు నిబంధనలు పాటించకపోతే వెనుదిరగాల్సిన పరిస్థితి ఉంది. -
శ్రీధరణి హత్యకేసు : బయటపడ్డ సంచలన నిజాలు
సాక్షి, ఏలూరు : శ్రీధరణి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితులను జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పొట్లూరి రాజు అనే నిందితుడు తుపాకుల సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కలిసి ఈ నేరాన్ని చేశారని తెలిపారు. నవీన్‌పై మొదటగా కర్రతో దాడి చేశారని.. అనంతరం ధరణిపై అత్యాచారం చేసి.. ఆమెను కూడా కర్రతో కొట్టి చంపారని తెలిపారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈ గ్యాంగ్ వరుసగా అత్యాచారాలు చేసిందని, ఒంటరిగా తిరిగే యువతులు, జంటలే లక్ష్యంగా చేసుకునే ఈ గ్యాంగ్.. ఇప్పటివరకు 32 నేరాలు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ప్రతి నేరం ముందు మూడు రోజుల పాటు ఈ గ్యాంగ్ రెక్కీ నిర్వహించేదన్నారు. ప్రధానంగా ఆదివారం ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్నే ఈ గ్యాంగ్ లక్ష్యంగా చేసుకుంటూ నేరాలకు పాల్పడుతుందన్నారు. ఇప్పటివరకు ముగ్గురు యువకులు, ఓ యువతిని హత్య చేశారన్నారు. ఖమ్మం, నూజివీడు, ఇబ్రహీంపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. చదవండి : శ్రీధరణి హత్య.. నవీన్ పైనే అనుమానంగా ఉంది ప్రేమికులే వాడి టార్గెట్ ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం శ్రీధరణి హత్యకేసులో పురోగతి ఏదీ -
శ్రీధరణి హత్య కేసు: వెలుగులోకి సంచలన నిజాలు
-
ప్రేమజంటపై దాడి : తెరపైకి కొత్త అనుమానాలు
సాక్షి, పశ్చిమ గోదావరి : కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారంలో తెరపైకి కొత్త అనుమానాలు వస్తున్నాయి. ప్రియుడితో కలిసి బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడికే మృతిచెందగా, గాయాలతో ప్రేమికుడు నవీన్ బయటపడ్డారు. కాగా సోమవారం శ్రీధరణి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. యువతిపై ఎటువంటి అత్యాచారం జరగలేదని పోస్ట్‌మార్టంలో వెల్లడేనట్లు తెలుస్తోంది. యువతి తలపై బలంగా కర్రతో కొట్టడం వల్లే చనిపోయిందని నిర్ధారించారు. ప్రేమికుడు నవీన్ తల వెనుకభాగంలో ఐదు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరూ కూర్చొని ఉండగా దుడ్డుకర్రతో వెనుకవైపు నుంచి వచ్చి కొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. (కలకలం రేపిన యువతి హత్య) ఇది ముమ్మాటికి పరువు హత్యే శ్రీధరణిది ముమ్మాటికి పరువు హత్యేనని నవీన్ తరపు గ్రామస్థులు చెబుతున్నారు. నవీన్, శ్రీధరణిలు ప్రేమించుకోవడం అమ్మాయి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, వారి బంధువులే ఈ హత్య చేయించారని ఆరోపిస్తున్నారు. నవీన్ చాలా అమాయకుడు. శ్రీధరణి, నవీన్‌లు ప్రేమించుకోవడం అమ్మాయి కుటుంబ సభ్యలకు ఇష్టం లేదు. త్వరలోనే అమ్మాయికి సొంత బావతో వివాహం చేయాలని శ్రీధరణి కుటుంబ సభ్యులు భావించారు. అమ్మాయికి ఇష్టంలేదని చెప్పి.. తాను నవీన్‌నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇది ఇష్టం లేకనే అమ్మాయి బావ, మామ ఇద్దరూ కిరాయి ముఠాతో ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నాం’ అని నవీన్ గ్రామస్తులు ఆరోపించారు. అమ్మాయి బంధువులను అదుపులోకి తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ వ్యవహార తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో అతను పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారిస్తున్నారు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్.. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో ముగ్గరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.(ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం) -
ప్రేమజంటపై దాడి: ప్రేమికుడిపై అనుమానం
-
శ్రీధరణిని హతమార్చింది ప్రేమికుడేనా?
సాక్షి, పశ్చిమ గోదావరి: కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో ఆదివారం ప్రేమజంటపై జరిగిన దాడి వ్యవహారంలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడితో కలిసి బౌద్ధారామం కొండపైకి వెళ్లిన శ్రీధరణి నిన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఘటనలో శరీరంపై తీవ్ర గాయాలతో యువతి అక్కడిక్కడికే మృతిచెందగా, గాయాలతో బయటపడిన ప్రేమికుడు నవీన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. యువతి తలపై దుడ్డుకర్రతో బలంగా మోదడం వల్లనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం కూడా జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటలను (జ్యోతి ఘటన) దృష్టిలో ఉంచుకుని పోలీసులు యువకుడిని ప్రశ్నిస్తున్నారు. ( ప్రేమజంటపై దాడి.. యువతి మృతి) ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ వ్యవహార తీరుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో అతను పొంతనలేని సమాధానం చెప్తుండడంతో మరింతో లోతుగా విచారిస్తున్నారు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్.. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ తలవెనుక భాగంలో బలమైన గాయలు అయినట్లు వైద్యలు వెల్లడించారు. కాగా హత్యకు గురైన శ్రీధరణికి మార్చి9న దగ్గరి బందువు అబ్బాయితో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. యువతి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గుంటుపల్లి బౌద్ధారామంలో విచిత్ర ఆచారం
-
గ్యాస్, పింఛన్ల పంపిణీని పరిశీలించిన కేంద్ర బృందం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పంపిణీ విధానాలను కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. కొండపల్లిలోని శ్రీలక్ష్మీబాలాజీ గ్యాస్ ఏజెన్సీస్ ద్వారా వినియోగదారులకు గ్యాస్ పంపిణీ జరిగే విధానాన్ని తెలుసుకున్నారు. గ్యాస్ బుకింగ్ చేసే పద్ధతి నుంచి వినియోగదారుడి ఇంటికి సరఫరా చేసే వరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియపై ఆరా తీశారు. గ్యాస్ సరఫరాలో ఆధార్ నమోదు ప్రాధాన్యతను తెలుసుకున్నారు. అనంతరం గుంటుపల్లి గ్రామంలో వృద్ధులకు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అమలు చేస్తున్న ఆన్లైన్ విధానాన్ని పరిశీలించారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ వేమూరి మానస, సర్పంచి దొప్పల రమణ, వీఆర్వోలు రమేష్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాగన్ వర్క్‌షాపును సందర్శించిన రైల్వే జీఎం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త గురువారం సందర్శించారు. ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు ఎస్వీ సాంబశివరావు, కార్యదర్శి చాంద్‌బాషా కార్మికుల సమస్యలు వివరించారు. వర్క్‌షాపులో ఖాళీగా ఉన్న 450 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. రైల్వే ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌ను నియమించాలన్నారు. మచిలీపట్నం, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాయనపాడులో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే కాలనీ శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులు రవీంద్రగుప్తాను సత్కరించారు. కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.