GV Sriraj
-
‘ట్విటర్ పక్షి’ని మాంచిగా వండి లాగించేసిన కాంగ్రెస్ నాయకులు
సామాజిక మాధ్యమం ‘ట్విటర్’ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ పక్షిపై చూయించారు. ఆ పక్షిని బలి తీసి ఉప్పుకారం మసాలాలు దట్టించి సలసల మాగే నూనెలో వేయించారు. అనంతరం ఆ మాంసాన్ని ట్విటర్ ప్రధాన కార్యాలయానికి పోస్టు చేశారు. ఇదంతా చేసింది రాహుల్ ఖాతాను ట్విటర్ నిలిపివేయడానికి నిరసనగా చేసిన ఈ కార్యక్రమం వైరల్‌గా మారింది. ఈ ఘటనను పలువురు ఖండిస్తుంటే.. మరికొందరు హర్షిస్తున్నారు. ఇంతకీ ఆ పక్షిని కాల్చి వండుకుతిన్నది ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ఎంపీ కుమారుడు, అతడి అనుచరులే. (చదవండి: ఎట్టకేలకు రాహుల్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ) రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్ వారం నిషేధించిన అనంతరం పునరుద్ధరించింది. వరుసగా ఇదే పరిస్థితి ఏర్పడడంతో ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ ట్విటర్ లోగోలో ఉండే పక్షి పిచ్చుక. ట్విటర్‌పై కోపంతో పిచ్చుకను కాల్చి మాంచిగా వండారు. ఫ్రై చేస్తూనే తాము ఎందుకు ఈ విధంగా చేస్తున్నామో తెలిపారు. ‘రాహుల్‌గాంధీ ట్విటర్ ఖాతా నిలుపుదల చేసి ట్విటర్ నిర్వాహకులు తప్పు చేశారు. కాంగ్రెస్ ట్వీట్లను ప్రమోట్ చేయడం లేదు. బీజేపీ చేసిన కుట్రతోనే ట్విటర్ కాంగ్రెస్ నాయకుల అకౌంట్లను బ్లాక్ చేసింది’ అని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బీజేపీ డౌన్‌డౌన్ అని నినదించారు. ట్విటర్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు హితవు పలికారు. చివరకు వండిన ఆ మాంసాన్ని ఒక డబ్బాలో పెట్టి గురుగ్రామ్‌లోని ట్విటర్ కార్యాలయానికి పంపుతున్నట్లు చెప్పారు. తపాలా కార్యాలయానికి వెళ్తున్నవరకు వీడియో ఉంది. అనంతరం వారు ఆ బాక్స్ పోస్టు చేశారు. చదవండి: ప్రేమించి పెళ్లాడి ఉగ్రవాదిగా మారిన భారత డెంటిస్ట్.. జైల్లోనే -
బోయపాటి పై క్రిమినల్ కేసులు పెట్టాలి
రాజమహేంద్రవరం : పుష్కర తొక్కిసలాటకు ప్రధాన కారకుడు సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ పుష్కర తొక్కిసలాట సమయంలో బోయపాటి శ్రీనివాస్ వద్ద మైక్ ఉందని, ఆయన భక్తులను వదలండీ అనగానే పుష్కరాల రేవు గేట్లు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగి పలువురు మృతి చెందారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చి మైక్ తీసుకొని భక్తులను ఘాట్‌లోకి వదలమని చెప్పడానికి అతనికి ఏ అర్హత ఉందని ప్రశ్నించారు. ఆయన చేతికి మైక్ ఇచ్చిన సమాచార శాఖ కమిషనర్, కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో 2015 జూలై 21 వ తేదీన ఫిర్యాదు చేశామని, దానికి త్రీటౌన్ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు రశీదు ఇచ్చారన్నారు. పుష్కర తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్‌కు కూడా ఎఫ్ఐఆర్ కాపీని పంపలేదని తెలిపారు. -
'ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారు'
హైదరాబాద్ : గోదావరి పుష్కరాల నేపథ్యలో రాజమండ్రిలో తొక్కిసలాట ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తామని అమలాపురం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లో శ్రీరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ... రాజమండ్రిలో తొక్కిసలాట హర్షకుమార్ వర్గం కుట్ర అని మంత్రుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తోక్కిసలాట ఘటనపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీరాజ్ డిమాండ్ చేశారు. సెంట్రల్ జైల్లో ఉండి కనీసం ఫోన్ కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్న తన తండ్రిపై అబాండాలు వేయడం సరికాదన్నారు. తోక్కిసలాట సంఘటనతో కలత చెంది పట్టణ మూడో టౌన్ పీఎస్‌కు వెళ్తే దాదాపు 2 గంటలు వేచి ఉంచి ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలో మైక్ ఐ అండ్ పీఆర్ లేదా పోలీసుల చేతిలో ఉండాలి. కానీ దర్శకుడు బోయపాటి శ్రీను మైక్ పట్టుకున్న దృశ్యాలు అన్నిఛానల్స్లో చూశామన్నారు. ఏ హోదాతో బోయపాటి మైక్ పట్టుకున్నారని ప్రశ్నించారు. తన తండ్రి హర్షకుమార్‌ను అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదన్నారు. దీక్ష చేస్తున్న 36 గంటల్లో కనీసం డాక్టర్‌ను కూడా పంపకుండా నిర్ధాక్షణ్యంగా ఈడ్చుకెళ్లారని శ్రీరాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి అడ్మినిస్ట్రేటీవ్ స్కిల్స్ లేవని ఎద్దేవా చేశారు.