g.vivek
-
కమలం బల్దియా బాట
సాక్షి, మంచిర్యాల : మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పాగా వేయాలనే తపనతో ఇప్పటినుంచే పునాది వేసుకునేందుకు పాదయాత్ర చేపట్టింది. గాంధీ సంకల్పయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ నాయకుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాదయాత్ర ఇప్పటికే చెన్నూరు, మంచిర్యాల పట్టణాల్లో పూర్తి కాగా.. మరో ఐదు మున్సిపాల్టీల్లో కొనసాగనుంది. పట్టణాల్లో పాదయాత్ర దేశవ్యాప్తంగా గాంధీ సంకల్పయాత్ర పేరుతో సంబంధిత నియోజకవర్గాల్లో నేతలు పాదయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించడం తెలిసిం దే. ఇందులో భాగంగా పార్టీ నేత, మాజీ ఎంపీ జి.వివేక్ జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, నస్పూరు, లక్సెట్టిపేట్, క్యాతన్‌పల్లి, మందమర్రి, బెల్లంపల్లిల్లో నిర్వహించేలా యాత్రకు రూపకల్పన చేశారు. చెన్నూరు పట్టణంలో ఈనెల 2న ఆయన పాదయాత్ర ప్రారంభించారు. చెన్నూరులో ఒకరోజు పర్యటించిన అనంతరం, మళ్లీ ఈ నెల 7న మంచిర్యాల పట్టణంలో యాత్ర నిర్వహించారు. ముందస్తు ప్రచారం సంకల్పయాత్రను బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచా రానికి మలచుకున్నట్లు కనిపిస్తోంది. పట్టణాల్లో చేపడుతున్న యాత్రలో భాగంగా ఇంటింటికీ వెళుతున్న నేతలు.. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడంతో పాటు, తమ పార్టీ మున్సిపాల్టీల్లో అధికారంలోకి వస్తే పట్టణాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు. పనిలోపనిగా వ్యాపార, వాణిజ్య వర్గాల ను కలిసి మద్దతు కోరుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని ఇప్పటినుంచే అభ్యర్థిస్తున్నారు. స్థానికంగా వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ, వాటిని ప్రస్తావిస్తూ ముం దుకు సాగుతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రజానీకానికి భరో సా ఇస్తున్నారు. ఆయా వార్డుల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న నాయకులు కార్యకర్తలను సమీకరిస్తున్నారు. యాత్ర ఫలించేనా..! దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రధానిగా నరేంద్రమోదీ నిర్ణయాలు, తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న వైనం తమకు మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని తెచ్చిపెడుతాయనే ధీమాతో బీజేపీ నేతలున్నారు. ఇప్పుడు, అప్పుడు అంటూ మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడుతున్నా, ఎప్పుడో ఒకప్పుడు నిర్వహించాలి్సందేనని, ఆ లోగా తమ పార్టీ మరింత బలపడుతుందంటున్నారు. ఇప్పటికే మున్సిపాల్టీల వారిగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు ఆందోళనలో ముందుంటున్నాయి. తాజాగా పట్టణాల్లో చేపడుతున్న పాదయాత్ర కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు దోహదం చేస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. అందివచి్చన ప్రతీ అవకాశాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించుకునే దిశగా బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. -
వివేక్‌పై నిప్పులుచెరిగిన టీసీఏ
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ సలహాదారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జి.వివేక్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జిల్లాల్లో క్రికెట్ టోర్నీలు నిర్వహించని వివేక్.. ఆ పేరుతో కోట్ల రూపాయలు దిగమింగారని టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ గురువారెడ్డిలు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన టీసీఏ ప్రతినిధులు.. హెచ్‌సీఏ అక్రమాల చిట్టాను బయటపెట్టారు. వెంకటస్వామి ట్రోఫికి అనుమతి ఎవరిచ్చారు? : ‘‘క్రికెట్లో ఓనమాలు కూడా తెలియని వివేక్ రాజకీయాలను అడ్డం పెట్టుకుని హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యారు. జిల్లాల్లో టోర్నమెంట్లు నిర్వహించకున్నా ఆ పని చేసినట్లు చెప్పుకుని నిధులు కాజేశారు. గత రెండు సంవత్సరాలలో రూ.2కోట్ల నిధులు దారిమళ్లించారు. హెచ్‌సీఏ కార్యదర్శి(శేష్ నారాయణ్) సస్పెన్షన్ విషయంలో నిబంధనలు పాటించలేదు. వెంకటస్వామి పేరు మీద ట్రోఫీ నిర్వహించడానికి హెచ్‌సీఏ జనరల్ బాడీ అనుమతి ఉందా? వివేక్ తన విశాఖ సంస్థ ప్రచారం కోసం క్రికెట్ సంఘాన్ని వాడుకుంటున్నారు’’ అని లక్ష్మీనారాయణ అన్నారు. పోరాటం చేస్తాం : తెలంగాణ జిల్లాలన్నీ హెచ్‌సీఏ పరిథిలోకే వస్తాయని వివేక్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. టీసీఏ చైర్మన్‌గా మంత్రి ఈటల రాజేందర్, చీఫ్ ప్యాట్రన్‌గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలు ఉన్నారు. ఇప్పటివరకు మేం(టీసీఏ) 1200 మ్యాచ్‌లు నిర్వహించాం. అవసరమైన మేరలో సీనియర్ క్రికెటర్ల సేవలను వినియోగించుకుంటాం. క్రికెట్ కోసం ఇంతగా కష్టపడుతోన్న టీసీఏకి బీసీసీఐ గుర్తింపు విషయంలో హెచ్‌సీఏ అనుమతి అవసరమేలేదు. వివేక్ ఆధ్వర్యంలో హెచ్‌సీఏలో కొనసాగుతోన్న అక్రమపర్వాలపై చట్టపరమైన పోరాటం చేస్తాం..’’ అని గురువారెడ్డి వ్యాఖ్యానించారు. -
'రేసు'గుర్రం ఎవరు?
(సాక్షి వెబ్ ప్రత్యేకం) ప్రతిష్టాత్మక వరంగల్ ఉపపోరుపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వరంగల్ ఎంపీ స్థానానికి ప్రధాన పొలిటికల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రిగా బాధ్యలు చేపట్టడంతో వరంగల్ లోక్ సభ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో 'సూటబుల్ కేండిడేట్' కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ జల్లెడ పడుతున్నాయి. ఎస్సీకి రిజర్వు అయిన ఈ స్థానంలో ఉప పోరుకు ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ తరపున పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేకానంద పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన వివేక్ తర్వాత మనసు మార్చుకుని మళ్లీ సొంతగూటికి వచ్చారు. వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఆయన సొంత జిల్లాకు వచ్చే అవకాశముందని అంటున్నారు. గత ఎన్నికల్లో కడియం శ్రీహరి చేతిలో ఓటమి పాలయిన కాంగ్రెస్ సిరిసిల్ల రాజయ్య కూడా మరోసారి పోటీకి సై అంటున్నారు. 'అధిష్టానమ్మ' భక్తుడు సర్వే సత్యనారాయణ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. వరంగల్ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలను సొమ్ము చేసుకోవాలని టీడీపీ-బీజేపీ కూటమి భావిస్తోంది. బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓరుగల్లులో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈసారి కూడా కమలం పార్టీ కేండిడేట్ బరిలో దిగే అవకాశముంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో ఉపపోరును 'రెఫరెండం'గా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఓయూ భూముల వివాదం, ప్రజాసంఘాల ఐక్యతతో కలవరపడుతున్న అధికార పార్టీ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా తమ సీటును నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో పావులు కదుపుతోంది. దీటైన అభ్యర్థిని నిలిపి 'పోరుగడ్డ'పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. కేసీఆర్ అవకాశమిస్తే వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో రేసుగుర్రాన్ని తానే అవుతానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రేసులోకి దూసుకొచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన రవి మనసులోని మాట బయటపెట్టడంతో రేసు రసవత్తరంగా మారనుంది. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రేసులో ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత వారం రోజుల్లో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కడియం శ్రీహరి ప్రకటించారు. -
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్?
వరంగల్ లోక్‌సభ స్థానం టీఆర్ఎస్లో విస్తృతచర్చకు తెరలేపింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం, ఉపముఖ్యమంత్రిగా పదవి పొందడంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక తప్పదని తేలిపోయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరడం.. వరంగల్ ఎంపీ అభ్యర్థి కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కడియం కేబినెట్లో చేరడంతో ఈ స్థానం ఖాళీ అయినట్లే లెక్క. దీంతో ఇక్కడ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎవరన్న అంశం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ వివేక్‌ను తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని, ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి వరంగల్ లోక్‌సభ స్థానంలో ఆయనను పోటీకి పెడతారని తెలుస్తోంది. -
తెలంగాణ దేవత సోనియా
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి ఆమె తెలంగాణ ప్రజలకు దేవతగా మారారని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ అన్నారు. తెలంగాణ సంబరా ల్లో భాగంగా ఆదివారం రాత్రి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ సాధించిన విషయాన్ని ప్రజలందరికీ చేరవేసేలా ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని జి.వెంకటస్వామి పోరాటం చేశారని, ఇప్పుడు ఆయన కల నెరవేరిందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నిం టిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, బాబర్ సలీంపాషా, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, తానిపర్తి గోపాల్‌రావు, ఎం.రవికుమార్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత, దొంతుల లింగం, కోట రవి తదితరులు పాల్గొన్నారు. -
జంప్ జిలానీలకు కలిసొచ్చేనా?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కప్పదాట్ల నేతలకు కలిసొస్తుందా? కండువాలు మార్చి పోటీ చేస్తున్న నేతలను ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల నగారా మోగే వరకు ఆయా పార్టీల్లో ఉండి.. ఎన్నికల్లో అతికొద్ది రోజుల ముందు పార్టీలు మార్చిన అభ్యర్థులు విజయతీరం చేరుకుంటారా? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు పార్టీలు మార్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారి పరిస్థితిని పరిశీలిస్తే.. నగేశ్‌ది తుది వరకు చంద్రబాబు జపం నగేశ్ ఇన్నాళ్లు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొంటే ఆయన మాత్రం చంద్రబాబు జపమే చేశాడు. సకల జనుల సమ్మెతో అందరూ ఏకమై నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే.. ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇకపై ఆ పార్టీలో ఉంటే అ సలుకే ఎసరొస్తుందని భావించి.. రెండు నెలల క్రితం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని ప్రస్తుతం ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ మాటెత్తని ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పునర్నిర్మాణం తమతోనే సాధ్యమంటున్నారు. తెలంగాణవాదుల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయనకు ప్రత్యార్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చివరి క్షణంలో పార్టీ మారిన నగేష్‌ను నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కారు దిగి.. కాంగ్రెస్‌లోకి కాకా కుమారులు.. పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి జి.వివేక్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. నగేష్ చంద్రబాబు జపం చేస్తే.. వివేక్ కేసీఆర్‌కు వంతపాడారు. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్‌తోనే సాధ్యమని కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా ఆయన గులాబీ గూటిలోనే ఉన్నారు. తీరా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత చివరి క్షణంలో టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వెంటనే ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఖరారైంది. ఇన్నాళ్లు టీఆర్ఎస్లో ఈ నాయకుడు ఇప్పుడు తన ప్రత్యర్థిగా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిని విమర్శించాల్సి వస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న వివేక్ ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. కాకా మరో కుమారుడిది ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా చివరివరకు కొనసాగారు. వివేక్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఓదేలు నుంచి చెన్నూరులో పోటీని ఎదుర్కొంటున్నారు. మంత్రిగా పనిచేసిన ఆయన చెన్నూరును అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు కప్పదాట్ల నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా బరిలో ఉన్నారు. ఆదిలాబాద్, ముథోల్ బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న పాయల్ శంకర్, రమాదేవిలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబుు వెంటే చివరి వరకు ఉన్నారు. టీడీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని భావించి కాషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణపై చంద్రబాబు తీరును నిరసిస్తూ వీరు పార్టీని వీడినా ఎన్నికల్లో టీడీపీతోనే పొత్తుండటంతో తిరిగి టీడీపీ కండువాను కూడా వేసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తోంది. చంద్రబాబును విమర్శించి, పార్టీ మారిన ఈ నేతలు అదే పార్టీ మద్దతుతో బరిలో ఉన్న వీరిపై నియోజకవర్గ ప్రజల ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన దివాకర్‌రావు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు. టీఆర్ఎస్లో ఉన్న సి ట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి కాంగ్రెస్ గూటి కి చేరుకోవడంతో, దివాకర్‌రావు టీఆర్ఎస్లోకి వెళ్లారు. ఈ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు కండువాలు మార్చుకుని తలపడుతుండగా, విజయం ఎవరిని వరిస్తుందో ఫలితాలు తేల్చనున్నాయి. ఎన్నికల వరకు తటస్థంగా ఉంటూ.. టిక్కెట్ల గోల ప్రారంభం కాగానే కాంగ్రెస్‌లో చేరిన ఐకేరెడ్డి చివరకు కాంగ్రెస్ కండువా కోసం పోరాడి విఫలం అయ్యారు. అనంతరం బీ ఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రధా న అనుచరుడు కోనప్ప కూడా బీఎస్పీ నుం చి పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్న వీరిని స్థానిక ప్రజలు ఆదరిస్తారో చూడాల్సిందే. కాంగ్రెస్‌ను వీడి ఎన్నికల వేళ టీడీపీలో చేరిన సోయం బాపురావుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.