వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్? | vivek likely to join trs, may contest as warangal mp | Sakshi
Sakshi News home page

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్?

Published Mon, Jan 26 2015 9:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్?

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వివేక్?

వరంగల్ లోక్‌సభ స్థానం టీఆర్ఎస్లో విస్తృతచర్చకు తెరలేపింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి అనూహ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం, ఉపముఖ్యమంత్రిగా పదవి పొందడంతో ఈ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక తప్పదని తేలిపోయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరడం.. వరంగల్ ఎంపీ అభ్యర్థి కావడం చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు కడియం కేబినెట్‌లో చేరడంతో ఈ స్థానం ఖాళీ అయినట్లే లెక్క. దీంతో ఇక్కడ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎవరన్న అంశం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎంపీ వివేక్‌ను తిరిగి టీఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయని, ఎన్నికల ప్రకటన వచ్చే నాటికి వరంగల్ లోక్‌సభ స్థానంలో ఆయనను పోటీకి పెడతారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement